Home
News

OnePlus నుంచి రెండు కొత్త ఫోన్లు, లాంచ్...ఈరోజే! లైవ్ చూడండి 

By Maheswara

OnePlus సంస్థ తన Nord సిరీస్‌ ఫోన్లలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మరియు వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను ఈరోజు, జూలై 5న భారతదేశంలో లాంచ్ చేయబోతోంది. ఈ కొత్త Nord సిరీస్ ఫోన్లు ఈ రోజు రాత్రి 7:00 PM IST కి జరిగే నార్డ్ సమ్మర్ లాంచ్ ఈవెంట్‌లో లాంచ్ చేయబడతాయి.

ఈ కొత్త Nord సిరీస్ ఫోన్లు ఈ సంవత్సరం ప్రారంభంలో OnePlus యొక్క ఫ్లాగ్‌షిప్ ఈవెంట్‌ను అనుసరిస్తాయి. ఇక్కడ కంపెనీ తన మొదటి టాబ్లెట్ మరియు OnePlus 11 మరియు 11R స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది.

OnePlus Nord 3 And OnePlus Nord CE 3 Launching Today In India. How To Watch Live And Event Timing Details.

OnePlus Nord 3, OnePlus Nord CE 3 లాంచ్‌ ఈవెంట్ ను ఎలా చూడాలి?
అభిమానులు ఈ ఈవెంట్ ను వన్ ప్లస్ యొక్క అధికారిక YouTube ఛానల్ ద్వారా రాత్రి 7:00 PM ISTకి ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. అలాగే, కంపెనీ తన సోషల్ మీడియా ఛానెల్‌లలో లైవ్ అప్‌డేట్‌లను కూడా పోస్ట్ చేస్తుంది.

ఈ ఈవెంట్ లో ఏమి ఆశించవచ్చు?
ఇప్పటికే, అధికారిక లాంచ్ కు ముందే, సంస్థ దాని OnePlus Nord 3, OnePlus Nord CE 3 మరియు OnePlus బడ్ 2R యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. OnePlus Nord 3 ప్రత్యేకమైన OnePlus స్లైడర్‌ ఫీచర్ ను కలిగి ఉంది. ఇది వినియోగదారులు ఆడియో మోడ్‌లను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఈ సెగ్మెంట్‌లోని దాని పోటీదారుల మాదిరిగా కాకుండా, ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ తో ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

వినియోగదారులు టెంపెస్ట్ గ్రే మరియు మిస్టీ గ్రీన్ కలర్స్ మధ్య ఎంచుకోవచ్చు. వెనుక ప్యానెల్‌లో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)తో కూడిన సోనీ IMX 890 కెమెరా సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. ఇందులో సెల్ఫీ కెమెరా ముందు భాగంలో హోల్-పంచ్ లో ఉంచబడింది. అంతేకాకుండా, Nord 3 ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని కూడా చెప్పబడింది.ఈ ఫోన్ 16GB RAM కాన్ఫిగరేషన్‌తో అందుబాటులో ఉన్న మొదటి Nord స్మార్ట్‌ఫోన్ కూడా. భారతదేశంలో దీని ధర దాదాపు రూ. 33,000గా అంచనా వేయబడింది.

అలాగే మరొక్క ఫోన్ OnePlus Nord CE 3, OnePlus Nord 3 యొక్క తక్కువ ధర వేరియంట్‌గా లాంచ్ కాబోతోంది. దీని స్పెసిఫికేషన్‌ల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ సరసమైన ధరకి లాంచ్ కాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 782G SoC మరియు 5,000mAh బ్యాటరీ నుండి శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ Nord 3 మాదిరిగానే 80W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే, 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Nord CE 2లోని LCD ప్యానెల్‌పై గణనీయమైన అప్‌గ్రేడ్ చేయబడింది.

ఇంకా ఈ Nord CE 3 కూడా వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇది నార్డ్ 3 మాదిరిగానే ఉంది. ఇంకా వెనుక కెమెరా సిస్టమ్ OISతో కూడిన 50 మెగాపిక్సెల్ Sony IMX 890 కెమెరా సెన్సార్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ OnePlus Nord CE 3 ఫోన్ "ఆక్వా సర్జ్" రంగును కలిగి ఉంటుందని సంస్థ చెప్పింది, ఇది ఒరిజినల్ Nord ఫోన్ యొక్క టీల్ బ్లూ రంగుని పోలి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Nord 3 And OnePlus Nord CE 3 Launching Today In India. How To Watch Live And Event Timing Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X