Home
News

OnePlus కొత్త ఫోన్ల, లాంచ్ తేదీ విడుదలైంది! ధర,స్పెసిఫికేషన్ల వివరాలు 

By Maheswara

దేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త ఫోన్లను లాంచ్ చేయడానికి OnePlus సంస్థ సిద్ధంగా ఉంది. సంస్థ నుంచి వన్ ప్లస్ నార్డ్ 3 ఫోన్ నార్డ్ 2 కి కొనసాగింపుగా లాంచ్ చేయబడుతుంది మరియు OnePlus Nord CE 3 ఫోన్ Nord CE 2 కి కొనసాగింపుగా వస్తుంది. దీని లాంచ్ తేదీ, సమయం, ఊహించిన స్పెసిఫికేషన్‌లు, డిజైన్‌లు మరియు ధరల వివరాలను ఇప్పడు చూద్దాం.

OnePlus Nord 3, Nord CE 3 లాంచ్ తేదీ, సమయం వివరాలు
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు తాను OnePlus Nord 3, Nord CE 3 5G మరియు Nord Buds 2r లను జూలై 5వ తేదీ సాయంత్రం 7 గంటలకు IST సమ్మర్ లాంచ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ అధికారిక ధరలు మరియు స్పెసిఫికేషన్‌లను వెల్లడిస్తుంది.

OnePlus Nord 3 And OnePlus Nord CE 3 Set To Launch On July 5 In India. Price,Specifications And Other Details.

OnePlus Nord 3, Nord CE 3 అంచనాలు స్పెసిఫికేషన్లు
వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ సహా ఇతర వివరాలు ఇప్పటికే లీక్‌ అయ్యాయి. ఈ వివరాల ప్రకారం, ఈ ఫోన్‌ 6.74 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉండనుందని సమాచారం. HDR+ సపోర్ట్‌తో రానుంది. 1240 * 2772 స్కీన్‌ రిజల్యూషన్‌తో రానుందని తెలుస్తోంది. మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 5 డిస్‌ప్లే రక్షణతో రానుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆక్సిజిన్‌ OS 13తో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ఈ ఫోన్లో శక్తివంతమైన మీడియోటెక్‌ MT6983 డైమెన్సిటీ 9000 చిప్‌సెట్‌ ఉండే అవకాశం ఉంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు మూడు కెమెరాలతో రానున్నట్లు తెలుస్తోంది. వాటిలో, 50MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 8MP ఆల్ట్రావైడ్‌ లెన్స్‌, 2MP డెప్త్‌ సెన్సార్‌తో రానున్నట్లు తెలుస్తోంది. డ్యూయల్ LED ప్లాష్‌, పనోరమ మోడ్‌ను కలిగి ఉండనున్నట్లు సమాచారం. మరియు ఈ ఫోన్‌ ముందువైపు 16MP కెమెరాలను కలిగి ఉండనుందని తెలుస్తోంది. ఈ కెమెరా ఆటో HDRను సపోర్ట్‌ చేయనుందని సమాచారం.

ఈ వన్ ప్లస్ ఫోన్ సాధారణ 5,000mAh బ్యాటరీని అందజేస్తుందని చెప్పబడింది. ఫోన్‌తో పాటు ఛార్జర్‌ను కూడా అందచేస్తుంది. OnePlus Nord 3 ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతుతో వస్తుందని చెప్పబడింది.

OnePlus Nord 3 అంచనా ధర
లీక్ అయినధరల వివరాల ప్రకారం వన్ ప్లస్ నార్డ్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలిపారు. 8GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.32,999 (అంచనా) మరియు 16GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.36,999గా (అంచనా) అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ధరలపై వన్‌ప్లన్‌ నిర్దారించాల్సి ఉంది.

OnePlus Nord CE 3 ని Nord CE 3 లైట్ తో పోలిస్తే మెరుగైన పనితీరును అందిస్తుందని భావిస్తున్నారు, అయితే దాని ధరకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Nord 3 And OnePlus Nord CE 3 Set To Launch On July 5 In India. Price,Specifications And Other Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X