Home
News

OnePlus నుంచి మరో కొత్త ఫోన్! ధర,స్పెసిఫికేషన్లు & లాంచ్ వివరాలు

By Maheswara

వన్ ప్లస్ సంస్థ తమ అధికారిక వెబ్‌సైట్‌లో OnePlus Nord 3 ఫోన్ ను పొందుపరిచింది. ఈ ఫోన్ త్వరలో భారతదేశంలో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ వెబ్‌సైట్ సోర్స్ కోడ్‌లో ఈ ఫోన్ పేరును గుర్తించి, దాని స్క్రీన్‌షాట్‌ను ట్విట్టర్‌లో పంచుకున్నారు. దీంతో ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్‌ ఖాయం అని అర్థమవుతోంది.

ఇది ఆశ్చర్యం కూడా కాదు ఎందుకంటే ఈ ఫోన్ ఇప్పటికే BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కూడా కనిపించింది. దీనికి అదనంగా, టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ఇటీవల OnePlus Nord 3 ఫోన్ రాబోయే 6 నుండి 8 వారాల్లో లాంచ్ అవుతుందని కూడా పేర్కొన్న విషయం మీకు తెలిసిందే. దీని ద్వారా కూడా ఈ ఈవెంట్ చాలా దూరంలో లేదని సూచిస్తుంది.

OnePlus Nord 3 Is Expected To Launch Soon In India. Expected Price And Specifications Details.

వన్ ప్లస్ నుండి ఈ ఫోన్ అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ధృవీకరించనప్పటికీ, ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్లు ఏమిటో ఇప్పటివరకు లీక్‌లు సూచించాయి. తాజా OnePlus Nord ఫోన్‌తో, కంపెనీ రూ. 30,000 కంటే తక్కువ ధర ఉన్న ఫోన్‌లకు పోటీగా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

వన్ ప్లస్ నోర్డ్ 3 బహుశా పంచ్ హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ ఫోన్ వెనుక భాగంలో మనము ట్రిపుల్ కెమెరా సెటప్‌ను చూడవచ్చు. త్వరలో రాబోయే ఈ 5G మిడ్-రేంజ్ ఫోన్ 6.7 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఇది పూర్తి HD+ రిజల్యూషన్‌తో పనిచేసే అవకాశం ఉంది. అధిక రిఫ్రెష్-రేట్ డిస్‌ప్లేను కూడా అందించాలని కంపెనీ భావిస్తున్నారు. ఇంకా, ఇది నార్డ్ సిరీస్‌లోని హై ఎండ్ ఫోన్‌గా పరిగణించబడుతుంది. దీని ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.

ఇక ఇప్పటికే లీక్‌ అయిన వివరాలను గమనిస్తే, ఈ రాబోయే వన్ ప్లస్ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 9000 చిప్‌సెట్ అందించబడుతుంది. వన్ ప్లస్ కొత్త నోర్డ్ CE మోడల్‌లలో స్టీరియో స్పీకర్‌లను పొందుపరచలేదు. కాబట్టి వన్ ప్లస్ నోర్డ్ 2 మాదిరిగానే నోర్డ్ 3 కూడా ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలను గమనిస్తే, ఈ ఫోన్ వెనుక మూడు కెమెరాలు ఉండవచ్చు. వీటిలో 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ తృతీయ సెన్సార్‌లు ఉన్నాయని పుకారు ఉంది. ఇక ముందు వైపు కెమెరా గురించిన వివరాలు ప్రస్తుతం తెలియవు. వన్ ప్లస్ భారతదేశంలో వన్ ప్లస్ నోర్డ్ 3 ని లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నట్లైతే ఆ వివరాలు మనకు త్వరలోనే తెలుస్తాయి.

ఈ ఫోన్ సాధారణ 4,500mAh బ్యాటరీ కలిగి ఉండవచ్చు.మరియు, 80W లేదా 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని అందిస్తుందా అనేది ప్రస్తుతానికి తెలియదు. ప్రస్తుతం, ఇది OnePlus 10R స్మార్ట్‌ఫోన్‌తో గరిష్టంగా 150W మద్దతును అందిస్తోంది. పోటీతో సమానంగా ఛార్జింగ్ వేగాన్ని అందించడానికి 80W తో రావొచ్చని అంచనా వేయవచ్చు.

రాబోయే వన్ ప్లస్ నోర్డ్ 3 స్మార్ట్ ఫోన్ భారత దేశంలో రూ. 25,000 మరియు రూ. 30,000 మధ్య ధరలలో ఉండవచ్చని అంచనా వేయబడింది. దాని అసలు Nord సిరీస్ చాలా కాలంగా అదే ధర శ్రేణిని లక్ష్యంగా చేసుకుని ఫోన్లు లాంచ్ చేస్తున్నారు. వన్ ప్లస్ నోర్డ్ 2 5G భారతదేశంలో రూ. 27,999 ప్రారంభ ధరతో లాంచ్ చేయబడింది. దీని తర్వాత, కంపెనీ వన్ ప్లస్ నోర్డ్ 2T ని ధర రూ. 28,999 కి లాంచ్ చేసింది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Nord 3 Is Expected To Launch Soon In India. Expected Price And Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X