OnePlus కొత్త ఫోన్ ఇండియా ధర లీక్ అయింది! లాంచ్ త్వరలోనే
వన్ ప్లస్ నోర్డ్ 3 5G జూన్‌లో భారతదేశంలో లాంచ్ అవుతుందని ఇప్పటికే లీక్ అయిన వివరాల ద్వారా మనకు తెలుసు. ఇది మరి కొన్ని వారాల దూరంలో మాత్రమే ఉంది. లాంచ్ ఈవెంట్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ, టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ రాబోయే వన్‌ప్లస్ ఫోన్ ధరను లీక్ చేశారు. OnePlus Nord 3 యొక్క స్పెసిఫికేషన్‌ల వివరాలు కూడా, పొందినట్లు కూడా తెలుస్తోంది.
OnePlus Nord 3 ఇండియా ధర లీక్ అయింది
జూన్ లో రాబోయే ఈ OnePlus Nord 3 భారతదేశంలో రూ. 30,000 లేదా రూ. 32,000గా ధర ఉంటుందని లీక్ పేర్కొంది. మా విశ్లేషణ ప్రకారం, వన్‌ప్లస్ రూ. 30,000 మార్కును మించదు ఎందుకంటే ఇది కంపెనీ తన వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ కోసం రిజర్వ్ చేసిన ఒక ధర విభాగం. ఒరిజినల్ వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ ఫోన్‌లు చాలా వరకు రూ. 30,000 లోపు ఉన్నాయి. ఇంకా, అధిక బడ్జెట్‌లో ఎక్కువ ప్రీమియం అనుభవాన్ని ఇష్టపడే వారి కోసం కంపెనీ ఇప్పటికే రూ. 30,000 కంటే ఎక్కువ ధర కలిగిన ఫోన్‌లను కలిగి ఉంది.

అంతేకాకుండా, iQOO Neo 7 మరియు Poco F5 5G వంటి దాని ప్రత్యర్థులు పోటీ ఫోన్లు కూడా భారతదేశంలో ఇదే ధర పరిధిలో ప్రకటించబడ్డాయి. కాబట్టి, కొత్త వన్ ప్లస్ మిడ్ రేంజ్ ఫోన్‌ను దాని ఇతర ప్రత్యర్థుల కంటే ఎక్కువ ధర నిర్ణయించడం సబబుకాదు.
OnePlus Nord 3: లీకైన స్పెసిఫికేషన్‌ల వివరాలు
టిప్‌స్టర్ వన్‌ప్లస్ నోర్డ్ 3 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లను కూడా లీక్ చేసారు. ఇది, 5G ఫోన్ 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేతో వస్తుందని, ఇది 6.74 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. ఇది AMOLED డిస్ప్లే కావచ్చు, ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ దాని ఒరిజినల్ Nord సిరీస్ ఫోన్‌లతో అందించబడుతుంది. ఈ ప్యానెల్ 120Hz వద్ద రిఫ్రెష్ అయ్యే అవకాశం ఉంది.
ఇంకా, మీడియా టెక్ డైమెన్సిటీ 9000 SoC ఉండవచ్చు. ఇది ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ చిప్‌సెట్, ఇది కంపెనీ ఇటీవల ప్రారంభించిన OnePlus ప్యాడ్ లో కూడా ఉంటుంది. వన్ ప్లస్ నోర్డ్ 3 వాస్తవానికి అదే చిప్‌ని ఉపయోగిస్తుంటే, వేగవంతమైన పనితీరును పొందవచ్చు. అయితే, ఈ బ్రాండ్ ద్వారా ఏదీ అధికారికంగా ధృవీకరించబడలేదు.
ఇక ఈ ఫోన్ యొక్క కెమెరా వివరాలు, మేము 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను చూడవచ్చు. ఇది 8 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ కెమెరాతో కూడి ఉంటుంది. ఇక, ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది కంపెనీ యొక్క సిగ్నేచర్ అలర్ట్ స్లైడర్ ఫీచర్‌ను నిలుపుతుందని చెప్పబడింది, ఇది ఇప్పుడు ఎంపిక చేసిన వన్ ప్లస్ ఫోన్‌లలో అందుబాటులో ఉంది.
ఆండ్రాయిడ్ 14 OS ఇంకా విడుదల కానందున ఈ వన్‌ప్లస్ నోర్డ్ 3 ఆండ్రాయిడ్ 13 OS తో వస్తుంది. ఈ వన్ ప్లస్ ఫోన్ సాధారణ 5,000mAh బ్యాటరీని అందజేస్తుందని చెప్పబడింది. ఫోన్‌తో పాటు ఛార్జర్‌ను కూడా అందచేస్తుంది. OnePlus Nord 3 ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతుతో వస్తుందని చెప్పబడింది.


Click it and Unblock the Notifications








