Home
News

OnePlus Nord 3 స్మార్ట్‌ఫోన్‌ ధర లీక్‌.. జులై తొలివారంలో విడుదల..?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ నుంచి కొత్త మిడ్‌ రేంజ్‌ ఫోన్ త్వరలో విడుదల కానుంది. OnePlus Nord 3 స్మార్ట్‌ఫోన్‌ జులై తొలివారంలో భారత్‌ మార్కెట్‌లోకి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెజాన్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ త్వరలో విడుదల కానుందనే స్టాటస్‌ బార్‌ కనిపిస్తోంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 ధర వివరాలను టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ లీక్‌ చేశారు. నార్డ్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలిపారు. 8GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.32,999 (అంచనా) మరియు 16GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.36,999గా (అంచనా) అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ధరలపై వన్‌ప్లన్‌ నిర్దారించాల్సి ఉంది.

OnePlus Nord 3

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ సహా ఇతర వివరాలు ఇప్పటికే లీక్‌ అయ్యాయి. ఈ ఫోన్‌ 6.74 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉండనుందని సమాచారం. HDR+ సపోర్ట్‌తో రానుంది. 1240 * 2772 స్కీన్‌ రిజల్యూషన్‌తో రానుందని తెలుస్తోంది. మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 5 డిస్‌ప్లే రక్షణతో రానుంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆక్సిజిన్‌ OS 13తో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. మరియు శక్తివంతమైన మీడియోటెక్‌ MT6983 డైమెన్సిటీ 9000 చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు మూడు కెమెరాలతో రానున్నట్లు తెలుస్తోంది.

f/1.9 అపేచర్‌తో 50MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 8MP ఆల్ట్రావైడ్‌ లెన్స్‌, 2MP డెప్త్‌ సెన్సార్‌తో రానున్నట్లు తెలుస్తోంది. డ్యూయర్ LED ప్లాష్‌, పనోరమ మోడ్‌ను కలిగి ఉండనున్నట్లు సమాచారం. మరియు ఫోన్‌ ముందువైపు 16MP కెమెరాలను కలిగి ఉండనుందని తెలుస్తోంది. ఈ కెమెరా ఆటో HDRను సపోర్ట్‌ చేయనుందని సమాచారం.

వన్‌ప్లస్‌ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్ విడుదల తేదిపై తయారీ సంస్థ వన్‌ప్లస్‌ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ జులై తొలివారంలో రానుందని మాత్రం తెలుస్తోంది. ఈ ఫోన్ డిజైన్‌, వేరియంట్‌, ధర, ఫీచర్లు వంటి కీలక వివరాలు ఇప్పటికే లీక్‌ అయ్యాయి. ఇవి ఫోన్‌ విడుదలపై చాలా మంది దృష్టి ఆకర్షిస్తున్నాయి. ఈ ధరలో ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 మంచి ఎంపిక అయ్యే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
OnePlus Nord 3 smartphone price leaked ahead of launch expected in july 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X