Home
News

ట్రిపుల్‌ కెమెరా, 5000mAh బ్యాటరీ OnePlus స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.4000 తగ్గింపు.. లిమిటెడ్‌ పిరియడ్‌ ఆఫర్‌..!

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ ఆకర్షణీయమైన తగ్గింపు ధరను పొందింది. ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాంలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్టుల్లో ప్రస్తుతం ఈ తగ్గింపు ధరలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఈ తగ్గింపు కారణంగా వన్‌ప్లస్‌ నార్డ్ 3 5G ( OnePlus Nord 3 ) స్మార్ట్‌ఫోన్‌ 30000 రూపాయల సెగ్మెంట్‌లోకి వచ్చింది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5G ధర వివరాలు : ఈ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.4000 తగ్గింది. దీంతో ఈ హ్యాండ్‌సెట్‌ రూ.29999 ధరకు అమెజాన్‌ ( Amazon ), ఫ్లిప్‌కార్టుల్లో ( Flipkart ) అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్‌ ఎప్పటి వరకు ఉంటుందనే వివరాలు వెల్లడికాలేదు. లిమిటెడ్‌ పిరియడ్‌ ఆఫర్‌గా తెలుస్తోంది.

oneplus-nord-3-smartphone news

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5G డిస్‌ప్లే : మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్లలో వన్‌ప్లస్‌ నార్డ్ 3 5G ఉత్తమ ఫోన్‌గా అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ మెరుగైన డిజైన్‌, డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు ఈ ప్యానల్‌ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. మరియు మెరుగైన పరితీరును కనబరుస్తుంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5G బ్యాటరీ, ఛార్జింగ్‌ : ప్రస్తుతం ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13.1 ఆధారిత ఆక్సిజన్‌OS 13పైన పనిచేస్తుంది. మరియు 80W సూపర్‌వోక్‌ ఫాస్ట్‌ ఛార్జర్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మిడ్‌ రేంజ్‌ సిగ్మెంట్‌ రూ.30,000 ధరలో స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఈ హ్యాండ్‌సెట్‌ మెరుగైన ఎంపిక అయ్యే అవకాశం ఉంది.

oneplus-nord-3-smartphone news

కెమెరాల విషయానికి వస్తే వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌తో 50MP సోనీ IMX890 ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ సోనీ IMX355 కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. మరియు ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలను అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 ర్యామ్‌, స్టోరేజీ వివరాలు : ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ, 16GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మరియు ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ను ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసేందుకు కూడా అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus nord 3 smartphone price slashed by RS 4000 in amazon and Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X