Home
News

వన్‌ప్లస్‌ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. 16GB ర్యామ్‌, శక్తివంతమైన చిప్‌సెట్‌..??

వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ (OnePlus Nord 4 Smartphone) త్వరలో భారత్‌ మార్కెట్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. వన్‌ప్లస్‌ నార్డ్ 3కు తర్వాత తరం ఫోన్‌గా నార్డు 4 విడుదల అవుతోంది. మరియు ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 హ్యాండ్‌సెట్‌ వన్‌ప్లస్‌ ఏస్‌ 3V (OnePlus Ace 3V Smartphone) రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే వన్‌ప్లస్‌ ఏస్‌ 3V స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ చిప్‌ ఇంకా విడుదల కాలేదు. కానీ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌ తరహా ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ సహా 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం.

OnePlus Nord 4 Smartphone may launch soon in india

16GB ర్యామ్‌, 5500mAh బ్యాటరీ? : దీంతోపాటు 100W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5,500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ 16GB ర్యామ్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మరియు ఆప్టికల్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో వస్తుందని తెలుస్తోంది.

** వన్‌ప్లస్‌ నుంచి ఇటీవల వన్‌ప్లస్‌ 12 మరియు 12R సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు విడుదల అయ్యాయి. వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ 1264*2780 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల అమోలెడ్ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 360Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణను పొందుతుంది.

ఈ 12R స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా కోర్‌ 4nm స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 SoC చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. 12GB లేదా 16GB LPDDR5x ర్యామ్‌ మరియు అడెన్నో 740 GPU తో జతచేయబడుతుంది. UFS 3.0 టెక్నాలజీతో గరిష్ఠంగా 1TB స్టోరేజీని కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ 100W సూపర్‌వోక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), f/1.8 అపేచర్‌తో 50MP సోనీ IMX890 ప్రధాన కెమెరా, f/2.2 అపేచర్‌తో కూడిన 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, f/2.4 లెన్స్‌తో కూడిన 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది.

సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది. 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.39,999 గా ఉంది. అదే 16GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.45,999 గా ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Nord 4 Smartphone may launch soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X