OnePlus Nord 4 ఇండియాలో లాంచ్ అయింది! ధర, స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు
ఈ రోజు మిలన్‌లో జరిగిన ఈవెంట్‌లో OnePlus Nord 4 అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయబడింది. ఈ పరికరం 7.99 మిమీ మందంతో మెటల్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ఇప్పటివరకు నార్డ్ సిరీస్ లో అత్యంత సన్నని ఫోన్. OnePlus Nord 3 కి సక్సెసర్ కూడా ఇది వివిధ రకాల AI ఫీచర్లను కలిగి ఉంది మరియు మెర్క్యురీ సిల్వర్, అబ్సిడియన్ మిడ్‌నైట్ మరియు ఒయాసిస్ గ్రీన్‌తో సహా మూడు రంగులలో అందుబాటులోకి రానుంది.
OnePlus Nord 4 స్పెసిఫికేషన్‌ల వివరాలు
OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్ భారీ 6.74 Tianma U8+ OLED ప్యానెల్‌తో 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది గరిష్ట ప్రకాశాన్ని 2150 నిట్‌ల వరకు అందిస్తుంది. హుడ్ కింద, ఈ పరికరం స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 16GB LPDDR5X RAM మరియు 512GB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో అనుసంధానించబడి వస్తుంది.

ఇది 100W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన పెద్ద 5500 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ని 28 నిమిషాల్లో 0 నుండి 100 వరకు ఛార్జ్ చేయగలదని OnePlus పేర్కొంది. ఇది ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఆక్సిజన్OS తో నడుస్తుంది మరియు నాలుగు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు మరియు ఆరు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది.
ఈ ఫోన్ లో అలెర్ట్ స్లైడర్‌తో పాటు డాల్బీ అట్మోస్ మరియు IR బ్లాస్టర్‌తో కూడిన ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. ఇది 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4 మరియు NFCని కూడా పొందుతుంది.
ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే,ఈ స్మార్ట్‌ఫోన్ 50MP సోనీ LYT600 ప్రైమరీ షూటర్ మరియు 8 MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌ను పొందుతుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం, పరికరం 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.
భారతదేశంలో OnePlus Nord 4 ధర వివరాలు
OnePlus Nord 4 ధర 8 GB RAM మరియు 128 GB స్టోరేజీ తో బేస్ మోడల్ రూ. 29,999 నుండి ప్రారంభమవుతుంది. 8GB RAM మరియు 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999 కాగా టాప్-ఎండ్ వేరియంట్ 12GB + 256GB ధర రూ.35,999 గా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క సేల్ ఆగస్ట్ 2 నుండి ప్రారంభమవుతుంది మరియు ప్రీ-ఆర్డర్ జూలై 20 నుండి ప్రారంభమై జూలై 30న ముగుస్తుంది. కస్టమర్‌లు రూ. 2,250 విలువైన జియో బెనిఫిట్‌లతో పాటు ఐసిఐసిఐ మరియు వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడంపై రూ. 3,000 తగ్గింపును పొందవచ్చు. అదనంగా, కస్టమర్లు 4 నెలల Spotify ప్రీమియంను కూడా ఉచితంగా పొందవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








