ప్రపంచంలోనే మొదటిసారిగా AR లాంచ్ ఈవెంట్‌లో లాంచ్ కానున్న వన్‌ప్లస్ నార్డ్
ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ వన్‌ప్లస్ సంస్థ కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్శించడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తన తాజా స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్‌ను జూలై 21 న రాత్రి 7.30 గంటలకు ప్రపంచంలోని మొట్టమొదటి AR స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లో ఆవిష్కరిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్లలో లభించే వన్‌ప్లస్ నార్డ్ AR యాప్ ద్వారా ఈ లాంచ్ ఈవెంట్ కార్యక్రమాన్ని అనుభవించవచ్చు.

ఈ వినూత్న ప్రయోగాన్ని వీక్షించడానికి వన్‌ప్లస్ సంస్థ తన అభిమానుల కోసం ప్రత్యేక ఆహ్వానాన్ని కూడా రూపొందించింది. ఇది వినియోగదారులకు AR టెక్నాలజీ ద్వారా వన్‌ప్లస్ నార్డ్ యొక్క ఈవెంట్ అనుభవాన్ని అందించడానికి అనుమతిస్తుంది. ఈ ఆహ్వానంను అమెజాన్ వెబ్‌సైట్‌లో రూ.99 ధర వద్ద జూలై 11 మధ్యాహ్నం 12 గంటల నుండి అందుబాటులోకి తీసుకువచ్చింది. AR ప్రయోగ ఆహ్వానాలను కొనుగోలు చేసే వినియోగదారులు అమెజాన్‌లో లాంచ్ డే లాటరీలో పాల్గొనడానికి మరియు హామీ ఇచ్చిన బహుమతిని గెలుచుకునే అవకాశం కూడా లభిస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ AR లాంచ్ ఆహ్వానాన్ని ఉపయోగించడం ఎలా?
** ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ నుండి వన్‌ప్లస్ నార్డ్ AR యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
** తరువాత యాప్ ను ఇన్‌స్టాల్ చేయండి. తరువాత AR అనుభవానికి అవసరమైన అనుమతులను అంగీకరించండి.
** WEB AR అనుభవాన్ని ప్రారంభించడానికి ఆహ్వానంలో QR కోడ్‌ను స్కాన్ చేయండి. మీరు మీ యొక్క కెమెరా యాప్, గూగుల్ లెన్స్ లేదా ఏదైనా QRcodescanner తో QR కోడ్‌ను స్కాన్ చేయవచ్చు.
**మీరు WEB AR అనుభవాన్ని లోడ్ చేసిన తర్వాత రాబోయే వన్‌ప్లస్ నార్డ్ డివైస్ యొక్క AR ఆహ్వానాన్ని స్కాన్ చేసి అనుభవించవచ్చు.
మరిన్ని అప్ డేట్స్ కోసం వన్‌ప్లస్ నార్డ్ ఇన్‌స్టాగ్రామ్ మరియు వన్‌ప్లస్ నార్డ్ AR వెబ్‌సైట్‌లో కూడా చూడవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ AR యాప్ ను ఉపయోగించడం
** ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ నుండి వన్‌ప్లస్ నార్డ్ AR యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
** యాప్ ను ఇన్‌స్టాల్ చేసి దాని యొక్క AR అనుభవానికి అవసరమైన అనుమతులను అంగీకరించండి.
** మీ అవతార్ మరియు యాప్ ని సెటప్ చేయడానికి యాప్ ను ప్రారంభించి దానికి కావలసిన సూచనలను అనుసరించండి.
AR యాప్ ద్వారా వన్‌ప్లస్ నార్డ్ AR లాంచ్ డేట్ మరియు సమయం
** 21 జూలై 2020 న రాత్రి 7.30 గంటల సమయానికి వన్‌ప్లస్ నార్డ్ AR లాంచ్ ఓపెన్ అవుతుంది.
** AR యాప్ను ఓపెన్ చేసి లీనమయ్యే AR అనుభవాన్ని ప్రారంభించడానికి తెరపై కనిపించే సూచనలను అనుసరించండి.
** స్థిరమైన AR స్ట్రీమింగ్ అనుభవాన్ని పొందడానికి మీకు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండడం తప్పనిసరి.
వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ యొక్క ప్రీ-ఆర్డర్‌లు జూలై 15 నుండి అమెజాన్ లో ప్రారంభమవుతాయి. వీటిని రూ.499 చెల్లించి ముందుగా బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు బుక్ చేయడానికి అమెజాన్.ఇన్‌ను క్లిక్ చేయవచ్చు లేదా వన్‌ప్లస్ నార్డ్ ఇన్‌స్టాగ్రామ్‌ను అనుసరించండి. అలాగే మరిన్ని అప్ డేట్ కోసం వన్‌ప్లస్ నార్డ్ AR వెబ్‌సైట్‌ను అనుసరించండి.


Click it and Unblock the Notifications








