Home
News

ఈ OnePlus ఫోన్ పై ధర తగ్గింది! ఇప్పుడు ధర రూ.17,999 మాత్రమే!

By Maheswara

వన్ ప్లస్ సంస్థ భారతదేశంలో తమ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ OnePlus Nord 3 ను విడుదల చేయబోతున్న సమయంలో, సంస్థ గత సంవత్సరం లాంచ్ చేసిన మరో బడ్జెట్ మోడల్‌పై అకస్మాత్తుగా ధర తగ్గింపును ప్రకటించింది.

మేము ఇక్కడ వన్ ప్లస్ నోర్డ్ CE 2 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ గురించి మాట్లాడుతున్నాము. తెలియని వారి కోసం గత వివరాలు గమనిస్తే, ఇది రూ.20,000 బడ్జెట్‌తో లాంచ్ చేయబడిన మొదటి వన్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఇది. రిమైండర్‌గా గుర్తు తెచ్చుకుంటే, ఇది గత ఏప్రిల్ 2022లో లాంచ్ చేయబడింది.

OnePlus Nord CE 2 Lite 5g Price Cut By Rs.2000. New Price And Offers Details Here.

ప్రస్తుతం ఈ ఫోన్ పై ధర తగ్గింపు రూ. 2,000 ప్రకటించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ తగ్గింపు వన్ ప్లస్ నోర్డ్ CE 2 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ యొక్క రెండు స్టోరేజ్ ఆప్షన్‌లపై కూడా అందుబాటులో ఉంది.

పాత ధర VS కొత్త ధర: వన్ ప్లస్ నోర్డ్ CE 2 లైట్ 5G స్మార్ట్ ఫోన్ యొక్క 6GB + 128GB మరియు 8GB + 128GB యొక్క 2 స్టోరేజీ ఎంపికలలో వరుసగా రూ. 19,999 మరియు రూ. 21,999 వద్ద లాంచ్ చేయబడింది. అయితే, ఇప్పుడు రూ.2000 ధర తగ్గింపు తర్వాత, ఈ 6GB RAM వేరియంట్ రూ.17,999 కి అందుబాటులో ఉంది.

మరోవైపు ఈ ఫోన్ యొక్క 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.19,999 కి తగ్గింది. ఈ రెండు ఫోన్లు బ్లూ టైడ్ మరియు బ్లాక్ డస్క్ అనే 2 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. వన్ ప్లస్ నోర్డ్ CE 2 లైట్ 5G యొక్క కొత్త ధర OnePlus.in మరియు Amazon.in రెండింటిలోనూ వర్తిస్తుంది.

ముఖ్య ఫీచర్ల వివరాలు: వన్ ప్లస్ నోర్డ్ CE 2 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1080 x 2412 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.59 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు ఇది ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.

ఆండ్రాయిడ్ 12 OS ఆధారంగా వన్ ప్లస్ స్వంత ఆక్సిజన్ OS 12.1తో వస్తున్న ఈ నోర్డ్ సిరీస్ మోడల్‌లో మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. అంతర్గత స్టోరేజీ ని 1TB వరకు విస్తరించడానికి మీరు దీన్ని ఉపయోగించవచ్చు.

ఇక కెమెరాల విషయానికొస్తే, ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది f/1.79 ఎపర్చరుతో 64MP ప్రధాన కెమెరా + 2MP డెప్త్ కెమెరా + f/2.4 ఎపర్చర్‌తో 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంది. ముందు భాగంలో, f/2.0 ఎపర్చర్‌తో 16MP సెల్ఫీ కెమెరా ఉంది

డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తున్న వన్ ప్లస్ నోర్డ్ CE 2 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది దీర్ఘకాలిక వినియోగాన్ని నిర్ధారిస్తుంది. చివరగా, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

Best Mobiles in India

English summary
OnePlus Nord CE 2 Lite 5g Price Cut By Rs.2000. New Price And Offers Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X