108MP కెమెరా, 8GB ర్యామ్ OnePlus స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు.. సేల్ వివరాలు..!
వన్‌ప్లస్ సంస్థ తన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G (OnePlus Nord CE 3 Lite 5G Smartphone) హ్యాండ్‌సెట్ ధరను తగ్గించింది. ఈ ఫోన్ ధరను రూ.2,000 తగ్గిస్తూ వన్‌ప్లస్ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఈ వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.17,999 గా ఉంది.
రూ.1,350 అదనపు డిస్కౌంట్ : వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల సమయంలో రూ.19,999 గా ఉంది. ప్రస్తుతం రూ.17,999 కే కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,350 డిస్కౌంట్‌ను పొందవచ్చు. పాత ఫోన్లను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ.16,950 వరకు ప్రయోజనాలు పొందవచ్చు.

రెండు వేరియంట్లలో లభిస్తుంది : వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ రెండు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. పాస్టెల్ లైమ్ మరియు క్రోమాటిక్ గ్రే రంగుల్లో లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల పుల్ HD+ పంచ్ హోల్ డిజైన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే నాణ్యమైన గొరెల్లా గ్లాస్ రక్షణను పొందుతుంది. మరియు డిస్‌ప్లే పైన ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 695 చిప్ ద్వారా పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారిత OxygenOS 13.1 పైన పనిచేస్తుంది. కెమెరాల పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 108MP ప్రధాన కెమెరా సహా మరో రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 5G, వైఫై, బ్లూటూత్ మరియు GPS, USB-C ఛార్జింగ్ పోర్టు సహా అనేక కనెక్టింగ్ ఫీచర్లను కలిగి ఉంది. ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్లతో మరింత తక్కువకే కొనుగోలు చేయవచ్చు.
ఇటీవల కాలంలో అనేక స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తోంది. శాంసంగ్, రియల్‌మి, నథింగ్, ఆపిల్ సంస్థలు ఇప్పటికే అనేక స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించింది. ఫలితంగా తమ పాత మోడళ్ల విక్రయాలను పెంచుకొనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








