వన్ ప్లస్ నుంచి కొత్త ఫోన్, లాంచ్ తేదీ వివరాలు! ధర రూ.20,000 లో లాంచ్ అయ్యే అవకాశం
వన్ ప్లస్ సంస్థ నుంచి ఎన్నో అంచనాలతో రాబోతోన్న వన్ ప్లస్ నోర్డ్ CE 3 లైట్ వచ్చే నెల ప్రారంభంలో వస్తుందని సమాచారం ఉంది. ఈ ఫోన్ ఇప్పటికే అనేక ధృవీకరణ సైట్‌లలో గుర్తించబడింది. దీని లాంచ్ త్వరలో జరగవచ్చని లీక్ లు సూచిస్తున్నాయి. ఇది ఇప్పటికే IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది.
ఇది గీక్‌బెంచ్ డేటాబేస్‌లో కూడా జాబితా చేయబడింది. ఈ మధ్య శ్రేణి 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్‌పై అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, ఇది ఏప్రిల్ 4న లాంచ్ చేయబడుతుందని ఊహాగానాలున్నాయి. వన్ ప్లస్ నోర్డ్ CE 3 లైట్ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

వన్ ప్లస్ నోర్డ్ CE 3 లైట్ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 695 SoC ని ఉపయోగించవచ్చని జాబితా సూచిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 20,000 గా ఉంటుందని అంచనా ఎందుకంటే, ఇందులో వాడే చిప్ సెట్ ను పరిశీలించినట్లయితే ఈ చిప్ తో వచ్చే చాలా ఫోన్‌లను పరిశీలిస్తే అవి కూడా ఇదే ధరలో ఉన్నాయి. ఇంకా, కంపెనీ నోర్డ్ CE లైట్ సిరీస్ ను రూ. 20,000 సెగ్మెంట్‌లోపు బడ్జెట్ ఉన్నవారిని లక్ష్యంగా లాంచ్ చేసింది. మరియు ఈ కొత్త వెర్షన్ కూడా అదే ధర శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నారు.
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 OS లో రన్ అవుతుందని గీక్ బెంచ్ జాబితా సూచిస్తుంది. ఇది 8GB RAM ఆప్షన్ తో కూడా అందించబడుతుంది. వన్ ప్లస్ నోర్డ్ CE 3 లైట్ కొన్ని ప్రాంతాలలో కొన్ని పెద్ద అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. కొత్త వెర్షన్ పెద్ద డిస్‌ప్లే, హై-రిజల్యూషన్ కెమెరా, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ మరియు మరిన్నింటి వివరాలను ఇది ప్యాక్ చేస్తుంది.

వన్ ప్లస్ నోర్డ్ CE 3 లైట్ ఫోన్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది FHD+ రిజల్యూషన్‌తో పనిచేసే అవకాశం ఉంది. దీని ముందున్న, వన్ ప్లస్ నోర్డ్ CE 2 లైట్ 6.59-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ప్యానెల్ 120Hzకి మద్దతునిస్తుందని భావిస్తున్నారు, చాలా ఫోన్‌లు దీనిని అందిస్తున్నాయి.
ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, వెనుకవైపు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను గమనించవచ్చు. ఇది పాత వెర్షన్‌లో మనం చూసిన 64-మెగాపిక్సెల్ సెన్సార్ కంటే అప్‌గ్రేడ్ అవుతుంది. ప్రైమరీ కెమెరాతో పాటు రెండు 2-మెగాపిక్సెల్ సెన్సార్‌లు ఉండవచ్చు. ఇవి వన్ ప్లస్ నోర్డ్ CE 3 లైట్ యొక్క అధికారిక స్పెసిఫికేషన్లు కావు కాబట్టి, వినియోగదారులు ఈ వివరాలను అంచనాలుగా మాత్రమే తీసుకోవాలి.
ఇంకా, ఈ కొత్త వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుందని చెప్పబడింది. ఈ సెగ్మెంట్‌లో ఈ ఫీచర్ తో వచ్చే మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే కావొచ్చు. ధర రూ. 20,000 సెగ్మెంట్‌లో 33W ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే మీరు చూస్తుంటారు. ఈ ఫోన్ భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. త్వరలోనే, లాంచ్ వివరాలు విడుదలవుతాయని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications








