Home
News

ఏప్రిల్ 4 న లాంచ్ కాబోతున్న కొత్త వన్ ప్లస్ ఫోన్! స్పెసిఫికేషన్ల వివరాలు

By Maheswara

వన్ ప్లస్ నోర్డ్ CE 3 లైట్ ఏప్రిల్ 4న భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది మరియు ఈ లాంచ్ ఈవెంట్‌కు ముందు రాబోయే 5G ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లను కంపెనీ ధృవీకరించింది. ఇప్పుడు, దీని ధర గురించి అందరు ఎదురుచూస్తున్నారు. అయితే, లీకుల సమాచారం ప్రకారం. ఈ ఫోన్ భారతదేశంలో రూ. 21,999 ప్రారంభ ధరతో వస్తుందని టిప్‌స్టర్ పేర్కొన్నారు.

నోర్డ్ CE 3 లైట్ స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే కొన్ని లాంచ్ ఆఫర్ ప్రయోజనాలను కూడా కంపెనీ జాబితా చేసింది. తాజా OnePlus ఫోన్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇక్కడ అందిస్తున్నాము.

OnePlus Nord CE 3 Lite Specifications Officially Confirmed, All Set To Launch On April 4.

వన్ ప్లస్ నోర్డ్ CE 3 లైట్ ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లు అధికారికంగా ధృవీకరించబడ్డాయి.
ఈ ఫోన్, స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్ ద్వారా వస్తుందని కంపెనీ అధికారికంగా తన వెబ్‌సైట్‌లో ధృవీకరించింది. ఇది 8GB వరకు RAMతో బ్యాకప్ చేయబడుతుంది మరియు వన్ ప్లస్ RAMని వర్చువల్‌గా విస్తరించుకునే అవకాశాన్ని కూడా ఇచ్చింది.

వన్ ప్లస్ నుండి తాజా మధ్య-శ్రేణి 5G ఫోన్ అయిన,ఇది 6.72 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది, ఇది సున్నితమైన స్క్రోలింగ్ అనుభవం కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతునిస్తుంది. ఈ ఫోన్లో అమోలెడ్ లేదా LCD ప్యానెల్‌ను అందజేస్తుందా అనే దానిపై సమాచారం లేదు. దీనికి ముందు వచ్చిన ఈ తరహా ఫోన్లలో LCD స్క్రీన్‌ను కలిగి ఉంది మరియు కంపెనీ తాజా మోడల్‌తో కూడా అదే అందించే అవకాశాలు ఉన్నాయి.

ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాల పరంగా గమనిస్తే, మీరు వెనుకవైపు 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను చూడవచ్చు, ఇది మేము పాత వెర్షన్‌లో చూసిన 64-మెగాపిక్సెల్ సెన్సార్ కంటే అప్‌గ్రేడ్ అవుతుంది.ఇంకా, వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి కెమెరాకు కొంత చక్కటి ట్యూనింగ్ కూడా చేస్తుందని భావిస్తున్నారు.ఈ 5G ఫోన్లో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.ఇంకా, బాక్స్‌లో 67W ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తోంది, ఇది దాదాపు 30 నిమిషాల్లో బ్యాటరీని పూర్తి చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఫోన్ కొత్త, పాస్టెల్ లైమ్ మరియు క్రోమాటిక్ గ్రే రంగులలో లాంచ్ చేయబడుతుంది.

వన్ ప్లస్ నోర్డ్ C3 లైట్ ధర భారతదేశంలో రూ. 21,999 గా నిర్ణయించబడింది. గుర్తుకు తెచ్చుకుంటే, వన్ ప్లస్ నోర్డ్ C3 యొక్క బేస్ వేరియంట్ భారతదేశంలో రూ. 21,999 నుండి ప్రారంభమవుతుంది. వన్ ప్లస్ నోర్డ్ C2 లైట్ భారతదేశంలో రూ. 19,999 ధరతో లాంచ్ చేయబడింది. ఈ లీకులు నిజమని తేలితే కంపెనీ ఈ కొత్త వెర్షన్ ధరను రూ. 2,000 పెంచుతున్నట్లు ప్రాథమికంగా ఇది సూచిస్తుంది.

వన్ ప్లస్ నోర్డ్ C3 లైట్ లాంచ్ ఆఫర్ వివరాలు
వన్ ప్లస్ నోర్డ్ C3 లైట్ కొనుగోలుదారుల కోసం కంపెనీ ఎర్లీ బర్డ్స్ ప్రయోజనాలను వెల్లడించింది. వన్ ప్లస్ షేర్ చేసిన వివరాల ప్రకారం, మొదట కొనుగోలు చేసే కస్టమర్‌లు ఈ పరికరం కొనుగోలుపై ఉచిత వన్ ప్లస్ ఉత్పత్తిని పొందుతారు, అలాగే ఎక్స్‌క్లూజివ్ డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు పొడిగించిన వారంటీ ప్లాన్‌ను కూడా పొందుతారు. ఇంకా, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై డిస్కౌంట్ ఆఫర్‌లు కూడా ఉంటాయి.

Best Mobiles in India

English summary
OnePlus Nord CE 3 Lite Specifications Officially Confirmed, All Set To Launch On April 4.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X