Home
News

OnePlus Nord CE 3 స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింపు.. స్పెసిఫికేషన్లు, సేల్‌ వివరాలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ బడ్జెట్‌ రేంజ్ స్మార్ట్‌ఫోన్ OnePlus Nord CE 3 5G ధర తగ్గింది. భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.2 వేలు తగ్గింది. ఈ ఫోన్‌ జూన్‌లో లాంచ్‌ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 782G SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తుంది. మరియు 120Hz రీప్రెష్‌ రేట్‌తో వస్తుంది.

భారత్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 5G ధర : ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర తాజాగా రూ.2 వేలు తగ్గింది. ఫలితంగా ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ ధర రూ.24,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీ ధర రూ.28,999 నుంచి రూ.27,999కు తగ్గింది.

OnePlus Nord CE 3 smartphone

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 5G ధర తగ్గింపు తక్షణం అందుబాటులోకి వచ్చింది. అమెజాన్‌ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ వన్‌ప్లస్‌ ఫోన్‌ ఆక్వా సర్జ్‌, గ్రే షిమ్మర్‌ రంగుల్లో లభిస్తోంది. డిజైన్‌ సహా ఇతర ఫీచర్లతో ఆకట్టుకుంది. ధర తగ్గింపుతో మరింత మందిని ఆకట్టుకొనే అవకాశం ఉంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్‌ 13.1 ఆధారిత OSను కలిగి ఉంటుంది. మరియు 6.7 అంగుళాల పుల్‌ HD+ ( 1080*2412 పిక్సల్స్‌ ) ప్లూయిడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతోపాటు 120Hz రీప్రెష్‌ రేట్‌తో వస్తుంది. ఆక్టా కోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 782G చిప్‌సెట్‌తో అడెన్నో 642L GPU ప్రాసెసర్‌తో వస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్‌ CE 3 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌ 50MP కెమెరాతో 1/1.56 అంగుళాల సోనీ IMX890 సెన్సార్‌, OIS, EIS సపోర్టుతో వస్తుంది. దీంతోపాటు 8MP సోనీ IMX355 ఆల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా మరియు 2MP 4cm మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. మరియు ముందువైపు 16MP ఫ్రంట్‌ కెమెరాతో వస్తుంది. 80w సూపర్‌వోక్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సపోర్టుతో రానుంది.

ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 256GB స్టోరేజీతో వస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్‌ 5.2, NFC, GPS, A-GPS మరియు USB-C పోర్టుతో వస్తుంది. యాక్సెలిరోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, ఈ కంపాస్‌, IR- ప్లాస్టర్‌, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, మరియు టెంపరేచర్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు డిస్‌ప్లే ఫింగర్‌ ఫ్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Nord CE 3 smartphone price dropped by rs 2000 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X