OnePlus Nord CE 5G హ్యాండ్‌సెట్ ఫీచర్స్ లీక్!! వాటి మీద ఓ లుక్ వేయండి...

|

భారతదేశంలో వన్‌ప్లస్ సంస్థ తన యొక్క సరికొత్త వన్‌ప్లస్ నార్డ్ CE 5G హ్యాండ్‌సెట్ ను 2021 జూన్ 10 న అంటే రేపు ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది. అయితే అధికారిక ఆవిష్కరణకు ముందు అన్ని బ్రాండ్లు తమ యొక్క డివైస్ యొక్క పూర్తి డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ కు సంబందించిన కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని విడుదల చేస్తాయి. ఇప్పుడు వన్‌ప్లస్ సంస్థ కూడా తన యొక్క రాబోయే నార్డ్ CE 5G సంబందించిన వివరాలను లీక్ చేసింది.

నార్డ్ CE 5G

సంస్థ ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ కు సంబందించిన చాలా అంశాలను ఆవిష్కరించింది. అయితే జనాదరణ పొందిన టిప్‌స్టెర్ ఇవాన్ బ్లాస్ కొత్తగా రాబోయే నార్డ్ CE 5G యొక్క ప్రోమో వీడియోను అధికారిక లాంచ్‌కు ముందే విడుదల చేసింది. ఈ వీడియోలో హ్యాండ్‌సెట్ యొక్క కొత్త షేడ్స్‌ను పూర్తిగా వెల్లడించారు. లీకైన ప్రోమో వీడియోలోని సమాచార వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

Samsung నెక్స్ట్-జెన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు చౌకగా రానున్నాయి!! ఇందులో నిజమెంత...Samsung నెక్స్ట్-జెన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు చౌకగా రానున్నాయి!! ఇందులో నిజమెంత...

వన్‌ప్లస్ నార్డ్ CE 5G లీక్ ప్రోమో

వన్‌ప్లస్ నార్డ్ CE 5G లీక్ ప్రోమో

ఇవాన్ బ్లాస్ షేర్ చేసిన ప్రోమో వీడియో ప్రకారం సంస్థ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఇప్పటికే టీజ్ చేసిన అన్ని ప్రత్యేకతలను ధృవీకరించింది. ఇది ర్యాప్ ఛార్జ్ 30T ప్లస్ మద్దతుతో హ్యాండ్‌సెట్ వస్తుందని 1:29 నిమిషాల నిడివి గల వీడియో ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 3.5mm ఆడియో జాక్‌ను కూడా అందిస్తుందని చూపబడింది. ఇది ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్ ఫోన్‌లలో చాలా సాధారణమైన ఫీచర్. అంతేకాకుండా వన్‌ప్లస్ నార్డ్CE 5G ఫోన్ 5G డౌన్‌లోడ్, స్ట్రీమింగ్ మరియు షేరింగ్‌కు మద్దతు ఇస్తుందని వీడియో సూచిస్తుంది.

లీక్ ప్రోమో వీడియో

వన్‌ప్లస్ నార్డ్ CE 5G లీక్ ప్రోమో వీడియో ప్రకారం వెనుకభాగంలో స్మార్ట్‌ఫోన్ 64MP ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది వన్‌ప్లస్ 8 కన్నా చాలా శక్తివంతమైనదిగా అనిపిస్తుంది. వీడియో టీజర్ కూడా హ్యాండ్‌సెట్ మునుపటి కంటే సన్నగా ఉందని మరియు ఇది కేవలం 7.9mm మందంగా ఉందని పేర్కొంది. హుడ్ కింద ఈ హ్యాండ్‌సెట్ 5G సపోర్ట్‌తో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుందని నిర్ధారించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లూయిడ్ అమోలేడ్ ఆల్వేస్-ఆన్ డిస్ప్లే వంటి లక్షణాలతో వస్తుంది. అలాగే ఇది 4500mAh భారీ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది అని చెబుతున్నారు.

వన్‌ప్లస్ నార్డ్ CE 5G స్మార్ట్‌ఫోన్ గ్రే ఒనిక్స్, మరియు బ్లూ మార్బుల్ వంటి కలర్ ఆప్షన్లలోకి వస్తుందని చెబుతున్నారు. సంస్థ అధికారికంగా రెండు మోడళ్లను మాత్రమే ధృవీకరించింది. అయితే కంపెనీ మరోక రంగును కూడా జోడించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీడియో సిల్వర్ వైట్ వలె కనిపించే కొత్త రంగు వేరియంట్‌ను కూడా చూపిస్తుంది. లీకైన వీడియోలో ఫోన్‌ను రెండుసార్లు ప్రదర్శించింది కానీ రంగు పేరును వెల్లడించలేదు.

Best Mobiles in India

English summary
OnePlus Nord CE 5G Smartphone Design, Featurs, Specs and Colour Variants Revealed: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X