OnePlus Nord CE 5G ఫోన్ జూన్ 10న రానున్నది!! ఫీచర్స్ లీక్ అయ్యాయి...
ఇండియా మార్కెట్ లో వన్‌ప్లస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లకు మంచి పేరు ఉంది. అయితే ఇప్పుడు ఈ సంస్థ వన్‌ప్లస్ నార్డ్ CE 5G పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను జూన్ 10 న లాంచ్ చేయనున్నది. ఇండియాలో లాంచ్ చేయడానికి ముందు కంపెనీ ఫోన్ యొక్క కొన్ని స్పెసిఫికేషన్స్ వంటి వివరాలను వెల్లడించింది. మిడ్-రేంజ్ ధరలో రాబోయే ఈ ఫోన్ కు సంబందించిన వివరాలను తెలుపుతూ సంస్థ ఒక వీడియోను షేర్ చేసింది. వీడియోలో వన్‌ప్లస్ నార్డ్ ఫోన్‌కు సంబదించిన డిజైన్‌ను కలిగి ఉంది. దీని యొక్క వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వన్‌ప్లస్ నార్డ్ CE 5G స్మార్ట్ ఫోన్ పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్ ను కలిగి ఉంది. సింగిల్ సర్క్యులర్ కటౌట్‌లో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ డివైస్ చాలా సన్నని బెజెల్ మరియు మందపాటి గడ్డం కలిగిన నిర్మాణంను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. వెనుకవైపున ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 64MP కెమెరా సెన్సార్ ఉంటుంది. అయితే అసలు వన్‌ప్లస్ నార్డ్ ఫోన్‌లో మాత్రం 48MP ప్రాధమిక కెమెరాను కలిగి ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ యొక్క పాత మోడల్ తో పోలిస్తే రాబోయే వన్‌ప్లస్ కొత్త ఫోన్‌లో అదనంగా నాలుగు సెన్సార్లను కలిగి ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం వన్‌ప్లస్ నార్డ్ CE 5Gఫోన్ 7.9mm మందంతో వస్తుందని ధృవీకరించింది. ఈ డివైస్ దిగువ భాగంలో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంటుంది. మిగతా వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. వీటి యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవడానికి జూన్ 10 వరకు వేచిఉండవలసి ఉంటుంది.

పుకార్లు మరియు లీక్‌ల ప్రకారం రాబోయే వన్‌ప్లస్ నార్డ్ CE 5G కొత్త ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే ఇది 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఈ స్మార్ట్ఫోన్ వార్ప్ ఛార్జ్ 30T ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో రావచ్చు.

అలాగే ఈ ఫోన్ వెనుకవైపు 64MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP డీప్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. అలాగే ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరా సెన్సార్ ఉండవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ 6.43-అంగుళాల AMOLED డిస్ప్లేతో ఫుల్-HD + రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో వచ్చే అవకాశం ఉంది. వన్‌ప్లస్ యొక్క కొత్త ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో అందిస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications