OnePlus Nord CE 5G లాంచ్ అయిన కొద్ది రోజులకే అందుకున్న కొత్త సాఫ్ట్‌వేర్ అప్ డేట్!!!

|

ఇండియాలో ఈ నెల ప్రారంభంలో వన్‌ప్లస్ నార్డ్ CE స్మార్ట్‌ఫోన్ రూ.22,999 ధర వద్ద ప్రారంభమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 16 నుండి దేశంలో ఓపెన్ సేల్‌లో వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులో లభించింది. ఈ కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను వన్‌ప్లస్.ఇన్, అమెజాన్.ఇన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్స్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే ఇప్పుడు విడుదలైన అతి తక్కువ రోజుల్లోనే వన్‌ప్లస్ నార్డ్ CE ఫోన్ మొదటి సాఫ్ట్‌వేర్ అప్ డేట్ ను పొందనున్నది.

ఆక్సిజన్ OS అప్ డేట్

కొత్తగా లభించే ఆక్సిజన్ OS అప్ డేట్ చాలా మెరుగుదలలను పొందడమే కాకుండా వన్‌ప్లస్ నార్డ్ CE యొక్క తాజా భద్రతా పాచ్‌ను తెస్తుంది. ఆక్సిజన్ఓఎస్ 11.0.2.2 సాఫ్ట్‌వేర్ కొత్త అప్ డేట్ సెల్ఫీ కెమెరా, డిస్ప్లే స్క్రీన్ వంటి మరిన్నింటికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది.

 

 

Apple మాక్‌బుక్ ప్రో మోడల్‌ కొనుగోలు మీద 44 శాతం తగ్గింపు...Apple మాక్‌బుక్ ప్రో మోడల్‌ కొనుగోలు మీద 44 శాతం తగ్గింపు...

ఆక్సిజన్ OS

కొత్త ఆక్సిజన్ OS సాఫ్ట్‌వేర్ అప్ డేట్ అనేది స్క్రీన్ కలర్ యొక్క ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుంది మరియు తెలిసిన సమస్యలను కూడా పరిష్కరిస్తుంది మరియు స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ CE కోసం కొత్త సాఫ్ట్‌వేర్ అప్ డేట్ ఫ్రంట్ యొక్క పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీని కూడా మెరుగుపరుస్తుంది.

సాఫ్ట్‌వేర్ అప్ డేట్
 

అదనంగా ఈ కొత్త ఆక్సిజన్ OS సాఫ్ట్‌వేర్ అప్ డేట్ మే 2021 నెల ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ను తెస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్ డేట్ దశలవారీగా విడుదల అవుతోందని గమనించాలి. అంటే OTA అప్ డేట్ ను అందుకోని వినియోగదారులు రాబోయే రోజుల్లో దాన్ని పొందుతారు. మీరు వన్‌ప్లస్ నార్డ్ CE ఫోన్ ను కొనుగోలు చేసి ఉంటే కనుక సాఫ్ట్‌వేర్ అప్ డేట్ను ఇన్‌స్టాల్ చేయడానికి మీరు సెట్టింగుల మెనూకు వెళ్లి, ఆపై సాఫ్ట్‌వేర్ అప్ డేట్ ఎంపికను ఎంచుకోవలసి ఉంటుంది.

 

ట్రూకాలర్ లో కొత్త ఫీచర్స్!! ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోట్రూకాలర్ లో కొత్త ఫీచర్స్!! ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో

ఆక్సిజన్ OS సాఫ్ట్‌వేర్ అప్ డేట్ ను ఇన్‌స్టాల్ చేసే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు

ఆక్సిజన్ OS సాఫ్ట్‌వేర్ అప్ డేట్ ను ఇన్‌స్టాల్ చేసే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు

-మీ ఫోన్‌ను స్థిరమైన మరియు అధికంగా లభించే నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయండి. మంచి వైఫై కనెక్షన్‌కు కనెక్ట్ చేయడం మంచిది మొబైల్ డేటాకు కాదు.

- సాఫ్ట్‌వేర్ అప్ డేట్ ను ఇన్‌స్టాల్ చేసే ముందు మీ మొత్తం డేటాను బ్యాకప్ చేయాలని నిర్ధారించుకోండి.

 

వన్‌ప్లస్ నార్డ్ CE స్మార్ట్‌ఫోన్ జూన్ 16 నుండి భారతదేశంలో ఓపెన్ సేల్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది - వీటిలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర రూ.22,999 కాగా, 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర రూ.24,999 మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ లను రూ.27,999 ధర వద్ద వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అదనంగా లాంచ్ ఆఫర్‌లో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ CE 5G స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ నార్డ్ CE 5G స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ నార్డ్ CE 5G ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 మరియు ఆక్సిజన్‌ OS11 తో రన్ అవుతుంది. ఇది 6.43-అంగుళాల ఫుల్-హెచ్‌డి + అమోలేడ్ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 కారక నిష్పత్తి మరియు 90HZ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G Socతో పాటు అడ్రినో 619 GPU మరియు 6GB ర్యామ్ లతో జతచేయబడి ఉంటుంది.

వన్‌ప్లస్ నార్డ్ CE 5G

వన్‌ప్లస్ నార్డ్ CE 5G ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్ మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఇఐఎస్) తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ , ఎఫ్ / 2.25 అల్ట్రా- వైడ్ లెన్స్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు f / 2.4 లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కెమెరాలు కలిగి ఉంటాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది f / 2.45 లెన్స్ మరియు EIS మద్దతుతో వస్తుంది.

Best Mobiles in India

English summary
OnePlus Nord CE Smartphone Brings First Software Update: Download Process

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X