OnePlus Nord అమ్మకానికి వచ్చేసింది!! త్వరపడండి..

|

ఇండియాలో అధునాతన AR పద్దతిలో ఆన్‌లైన్ ద్వారా గతవారంలో విడుదలైన వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ఈ రోజు మొదటిసారి అమ్మకాలు మొదలుకానున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ మొదటిసారిగా అమెజాన్ మరియు వన్‌ప్లస్ యొక్క సొంత వెబ్‌సైట్ ద్వారా ఈ రోజు ఓపెన్ సేల్ మొదలయ్యాయి. సంస్థ ప్రస్తుతం నార్డ్ యొక్క మొదటి రెండు వేరియంట్లను మాత్రమే అమ్మకానికి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో 128GB మరియు 256GB స్టోరేజ్ వేరియంట్లను నార్డ్ బ్లూ మరియు గ్రే కలర్ వేరియంట్లలో పొందవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వన్‌ప్లస్ నార్డ్  సేల్స్ ఆఫర్స్

వన్‌ప్లస్ నార్డ్  సేల్స్ ఆఫర్స్

అమెజాన్ మరియు వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లో మధ్యాహ్నం 12PM నుండి కొనుగోలుదారులు వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.  అమెజాన్‌లో జరుగుతున్న ప్రైమ్ డే సేల్‌లోని అన్ని రకాల ఆఫర్లు దీని కొనుగోలు మీద కూడా వర్తిస్తాయి. వన్‌ప్లస్ తన వెబ్‌సైట్‌లో నార్డ్ స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్‌పై 50 శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్‌ల కోసం వెయిటింగ్ పీరియడ్ మరియు అమెజాన్ కస్టమర్లు తమ డెలివరీ పొందడానికి ఆగస్టు 14 వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.

వన్‌ప్లస్ ట్రేడ్‌మార్క్

వన్‌ప్లస్ ట్రేడ్‌మార్క్

ఏదేమైనా 2020 సంవత్సరంలో రూ.30,000 ధర విభాగంలో వన్‌ప్లస్ నార్డ్ అత్యంత ఆసక్తికరమైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ ధరల విభాగంలో లభిస్తున్న మొట్ట మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌గా కూడా ఇది అవతరించింది. అలాగే వన్‌ప్లస్ సంస్థ గత మూడేళ్ళలో చౌకైన ధరలో అందిస్తున్న ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. వన్‌ప్లస్ తన ట్రేడ్‌మార్క్ యూజర్ అనుభవాన్ని కొన్ని రాజీలతో అందిస్తోంది.

వన్‌ప్లస్ నార్డ్ 12GB LPDDR4x RAM స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ నార్డ్ 12GB LPDDR4x RAM స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ నానో సిమ్ స్లాట్ లను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10-ఆధారిత ఆక్సిజన్OS 10.5 ఆధారంగా రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.44-అంగుళాల ఫుల్-హెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లేను 90HZ రిఫ్రెష్ రేట్ వద్ద 1,080x2,400 పిక్సెల్‌ల పరిమాణం మరియు 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ మరియు నైట్ మోడ్, రీడింగ్ మోడ్ మరియు వీడియో ఎన్ హన్సర్ ఫీచర్ల మద్దతుతో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 GSoCట్ తో రన్ అవుతూ అడ్రినో 620 GPU మరియు 12GB LPDDR4x RAM వరకు జత చేయబడి వస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ 48MP సోనీ IMX586 సెన్సార్ కెమెరా సెటప్

వన్‌ప్లస్ నార్డ్ 48MP సోనీ IMX586 సెన్సార్ కెమెరా సెటప్

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ యొక్క ఫొటోగ్రఫీ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వన్‌ప్లస్ నార్డ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f / 1.75 లెన్స్‌తో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్‌తో వస్తుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో పాటు వస్తుంది. ఇంకా కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.25 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో మరియు 119 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ (FoV) 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంది. అలాగే ఎఫ్ / 2.4 ఎపర్చరుతో 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్ కెమెరాలు కూడా లభిస్తాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ సెటప్‌లో ఎఫ్ / 2.45 లెన్స్‌తో కూడిన 32 మెగాపిక్సెల్ సోనీ IMX616 ప్రైమరీ సెన్సార్  మరియు ఎఫ్ / 2.45 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 105 డిగ్రీల ఎఫ్‌ఒవిని కలిగిన 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
OnePlus Nord First Sale Live on Amazon and OnePlus Website

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X