OnePlus Nord ఓపెన్ సేల్ ఈ రోజు కాదు!! కారణం ఇదే...
వన్‌ప్లస్ నార్డ్ అమ్మకం భారతదేశంలో వాయిదా పడింది, వన్‌ప్లస్ నార్డ్ అమ్మకం 6 వ ఆగస్టు, వన్‌ప్లస్ నార్డ్ అమ్మకపు తేదీ, భారతదేశంలో వన్‌ప్లస్ నార్డ్ అమ్మకం తేదీ, అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ అమ్మకం తేదీ, అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ అమ్మకపు తేదీ, భారతదేశంలో వన్‌ప్లస్ నార్డ్ లక్షణాలు మరియు ధర, వన్‌ప్లస్ నార్డ్ పూర్తి లక్షణాలు.

ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ అమ్మకాలు
ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ యొక్క అమ్మకాలు ఆగస్టు 4 అంటే ఈ రోజు నుంచి మొదలుకానున్నట్లు సంస్థ ఇంతకుముందు ప్రకటించింది. కానీ ఇప్పుడు వీటి యొక్క అమ్మకాలు ఆలస్యం అయ్యాయి. అయితే వీటి యొక్క బహిరంగ అమ్మకాలు ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి గల కారణం విషయానికి వస్తే ముందస్తు ఆర్డర్ సమయంలో అపూర్వమైన డిమాండ్‌ను పేర్కొంటూ సేల్ డేట్ లను మార్చినట్లు తెలుస్తోంది. డిమాండ్ కారణంగా స్టాక్స్ ఉహించిన దానికంటే క్షీణించాయని కంపెనీ పేర్కొంది. వీటి యొక్క డిమాండ్ లను మరింత పెంచడానికి వీలుగా ఈ అమ్మకాన్ని మరో రెండు రోజులు ముందుకు నెట్టారు.

వన్‌ప్లస్ నార్డ్ అమ్మకాలు ఆలస్యంగా
వన్‌ప్లస్ నార్డ్ యొక్క మొదటి సేల్ ఇండియాలో ఇప్పుడు ఆగస్టు 6 న అంటే గురువారం ఉదయం 12 గంటల నుండి మొదలుకానున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రీ-బుకింగ్ ద్వారా వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ ను బుక్ చేసుకున్న కస్టమర్లకు ఆగస్టు 4 నుంచి ఫోన్ ను పొందవచ్చు అని కంపెని వాగ్దానం చేసింది. కానీ షిప్పింగ్‌లో కొంత ఆలస్యం కారణంగా వీటి లభ్యత ఇంకో రెండు రోజులు ఆలస్యం కానున్నది.

ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ అమ్మకాలు
ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ ఇప్పుడు అమెజాన్.ఇన్, వన్‌ప్లస్.ఇన్, వన్‌ప్లస్ స్టోర్స్ మరియు వన్‌ప్లస్ ఆథరైజ్డ్ స్టోర్స్ ద్వారా ఓపెన్ సేల్ పద్ధతి ద్వారా కొనుగోలుదారుల కోసం అందుబాటులోకి లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఆగస్టు 7 నుండి ఈ ఫోన్ ను రిలయన్స్ డిజిటల్ మరియు మైజియో స్టోర్స్ ద్వారా కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అలాగే ఇతర అధీకృత రిటైల్ భాగస్వాముల ద్వారా ఆగస్టు 12 నుండి అమ్మకాలు మొదలుకానున్నాయి.

వన్‌ప్లస్ నార్డ్ ధరల వివరాలు
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్లలో విడుదల అయింది. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ. 27,999 కాగా 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర 29,999 రూపాయలు. ఈ ఫోన్ గ్రే ఒనిక్స్ మరియు బ్లూ మార్బుల్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ సేల్ ఆఫర్స్
అమెజాన్ ద్వారా మాత్రమే ఆగస్టు 6 నుండి వన్‌ప్లస్ నార్డ్ యొక్క బ్లూ మార్బుల్ కలర్ ఆప్షన్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే వన్‌ప్లస్.ఇన్, వన్‌ప్లస్ స్టోర్స్ మరియు దాని యొక్క పార్టనర్ స్టోర్స్ నుండి అమ్మకాలు ఆగస్టు 8 నుండి మొదలుకానున్నాయి. అమ్మకపు ఆఫర్ల విషయానికి వస్తే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే మరిన్ని ముఖ్యమైన బ్యాంకుల నుండి నో-కాస్ట్ EMI ఆప్షన్స్, నార్డ్ స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్‌పై 50 శాతం ఆఫ్, మరియు నార్డ్ యాక్సెసరీ బండిల్స్‌పై 20 శాతం వరకు తగ్గింపు కూడా లభిస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ స్పెసిఫికేషన్స్
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ నానో సిమ్ స్లాట్ లను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10-ఆధారిత ఆక్సిజన్OS 10.5 ఆధారంగా రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.44-అంగుళాల ఫుల్-హెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లేను 90HZ రిఫ్రెష్ రేట్ వద్ద 1,080x2,400 పిక్సెల్‌ల పరిమాణం మరియు 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ మరియు నైట్ మోడ్, రీడింగ్ మోడ్ మరియు వీడియో ఎన్ హన్సర్ ఫీచర్ల మద్దతుతో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 GSoCట్ తో రన్ అవుతూ అడ్రినో 620 GPU మరియు 12GB LPDDR4x RAM వరకు జత చేయబడి వస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ కెమెరా సెటప్
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ యొక్క ఫొటోగ్రఫీ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వన్‌ప్లస్ నార్డ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f / 1.75 లెన్స్‌తో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్‌తో వస్తుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో పాటు వస్తుంది. ఇంకా కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.25 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో మరియు 119 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ (FoV) 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంది. అలాగే ఎఫ్ / 2.4 ఎపర్చరుతో 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్ కెమెరాలు కూడా లభిస్తాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ సెటప్‌లో ఎఫ్ / 2.45 లెన్స్‌తో కూడిన 32 మెగాపిక్సెల్ సోనీ IMX616 ప్రైమరీ సెన్సార్ మరియు ఎఫ్ / 2.45 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 105 డిగ్రీల ఎఫ్‌ఒవిని కలిగిన 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








