OnePlus Nord SE: 65W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో త్వరలోనే లాంచ్!!

|

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ సంస్థ ఇటీవల నార్డ్ సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ నార్డ్ N10 5G మరియు వన్‌ప్లస్ నార్డ్ N100 వంటి మూడు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసిన తరువాత 2021 Q1లో వన్‌ప్లస్ నార్డ్ SEని తమ లైనప్‌లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సంవత్సరం రూ.30,000 ధర విభాగంలో లాంచ్ చేసిన ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్‌లలో వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ అత్యధికంగా అమ్ముడైంది. తదుపరి రెండు ఫోన్లు- నార్డ్ N10 5G మరియు నార్డ్ N100 ఇంకా భారత మార్కెట్లోకి చేరలేదు.

 

వన్‌ప్లస్ నార్డ్ SE ఆన్‌లైన్‌ లీక్

వన్‌ప్లస్ నార్డ్ SE ఆన్‌లైన్‌ లీక్

రాబోయే వన్‌ప్లస్ నార్డ్ SE భారత, యూరోపియన్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని విడుదల చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మరియు ఆండ్రాయిడ్ సెంట్రల్ వంటి కొన్ని కీలకమైన ఫీచర్లను కలిగి ఉన్నట్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: Vi పోస్ట్‌పెయిడ్ డేటా ప్యాక్‌ల ఆఫర్లు ఏవిధంగా ఉన్నాయో చూడండి!!!Also Read: Vi పోస్ట్‌పెయిడ్ డేటా ప్యాక్‌ల ఆఫర్లు ఏవిధంగా ఉన్నాయో చూడండి!!!

వన్‌ప్లస్ నార్డ్ SE అమోలేడ్ స్క్రీన్, 65W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్
 

వన్‌ప్లస్ నార్డ్ SE అమోలేడ్ స్క్రీన్, 65W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్

వన్‌ప్లస్ నార్డ్ SE స్మార్ట్‌ఫోన్‌ AMOLED స్క్రీన్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉండి వన్‌ప్లస్ నార్డ్‌కు సమానమైన ఫీచర్లను కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది. వాస్తవానికి ఈ ఫోన్‌ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ 8T కంటే ఇది ప్రత్యేకమైనది. వన్‌ప్లస్ 8 ప్రో కూడా 30W వైర్డ్ ఛార్జింగ్‌కు మాత్రమే మద్దతు ఇస్తుంది. ఇతర నార్డ్ ఫోన్ల మాదిరిగానే నార్డ్ SE కూడా బడ్జెట్ మరియు మిడ్-రేంజ్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు సమాచారం.

వన్‌ప్లస్ నార్డ్ SE 4500mAh బ్యాటరీ ఫీచర్స్

వన్‌ప్లస్ నార్డ్ SE 4500mAh బ్యాటరీ ఫీచర్స్

వన్‌ప్లస్ నార్డ్ SE ఫోన్ వన్‌ప్లస్ 8T కి సమానమైన 4500mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తున్నట్లు సమాచారం. అలాగే ఇది అధిక రిఫ్రెష్ రేట్ స్క్రీన్ ను కూడా కలిగి ఉండవచ్చు. ఇందులో ఉపయోగించే ప్రాసెసర్ మరియు కెమెరా సిస్టమ్ వంటి మిగిలిన ఫీచర్ల వివరాలు ప్రస్తుతానికి తెలియవు. వీటి గురించి పూర్తి వివరాలను సంస్థ త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.

వన్‌ప్లస్ తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ వివరాలు

వన్‌ప్లస్ తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ వివరాలు

వన్‌ప్లస్ సంస్థ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 9 ను మార్చి 2021 లో విడుదల చేయనున్నట్లు పుకారులు ఉన్నాయి. కావున వన్‌ప్లస్ 9 సిరీస్ తర్వాత నార్డ్ SE ఫోన్ విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సంస్థ తమ బ్రాండ్ అమ్మకాలను పెంచడానికి వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌ను ముందుకు నెట్టడం చూడటం మంచిది. కానీ అదే సమయంలో ఇప్పటికే ఉన్న మోడళ్లకు సకాలంలో సాఫ్ట్‌వేర్ అప్ డేట్ లను అందించడం కొనసాగించాలి.

Best Mobiles in India

English summary
OnePlus Nord SE Phone Rumoured to Launch Q1 2021 With 65W Fast Charging Technology

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X