OnePlus Nord Open Sale: ఓపెన్ సేల్ పద్దతిలో అమ్మకానికి OnePlus Nord స్మార్ట్‌ఫోన్....

|

ఇండియాలో గత నెలలో ఆన్‌లైన్ ద్వారా విడుదలైన వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు కేవలం పరిమిత సమయంలో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వన్‌ప్లస్ నార్డ్ బహిరంగంగా ఓపెన్ సేల్ ద్వారా అమ్మకానికి రానున్నది. అమెజాన్ ఇండియా మరియు అధికారిక స్టోర్, వన్‌ప్లస్.ఇన్‌లలో దీని ఓపెన్ సేల్ మొదలుకానున్నాయి. రెండు వెబ్‌సైట్లలో 8GB ర్యామ్ వేరియంట్‌ను, 12 GB ర్యామ్ వేరియంట్‌ను విక్రయిస్తున్నాయి. అయితే 6GB బేస్ మోడల్ వేరియంట్ యొక్క అమ్మకాలు సెప్టెంబర్ 28న ఫ్లాష్ సేల్‌ పద్దతిలో అమెజాన్ ఇండియాలో కొనుగోలు చెయవచ్చు అని పేర్కొంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వన్‌ప్లస్ నార్డ్  స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

ఇండియాలో ప్రస్తుతం వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ యొక్క రెండు వేరియంట్లు మాత్రమే అమ్మకానికి రానున్నాయి. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్‌ యొక్క బేస్ వేరియంట్ ధర రూ.27,999 కాగా 12GB ర్యామ్‌ + 256 GB స్టోరేజ్‌ వేరియంట్ యొక్క ధర రూ.29,999. ఈ ఫోన్ యొక్క 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్‌ ఎంట్రీ లెవల్ వేరియంట్ యొక్క ధర రూ.24,999. అయితే ఈ వేరియంట్ ప్రస్తుతం అందుబాటులో లేదు దీనిని సెప్టెంబర్ 28 న కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది.

 

Also Read: Amazon కొత్త తరం ఫైర్ టివి స్టిక్ లు వచ్చేసాయి!!! ఫీచర్స్ బ్రహ్మాండం....Also Read: Amazon కొత్త తరం ఫైర్ టివి స్టిక్ లు వచ్చేసాయి!!! ఫీచర్స్ బ్రహ్మాండం....

వన్‌ప్లస్ నార్డ్ ఆండ్రాయిడ్ 10 స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ నార్డ్ ఆండ్రాయిడ్ 10 స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ నానో సిమ్ స్లాట్ లను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10-ఆధారిత ఆక్సిజన్OS 10.5 ఆధారంగా రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.44-అంగుళాల ఫుల్-హెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లేను 90HZ రిఫ్రెష్ రేట్ వద్ద 1,080x2,400 పిక్సెల్‌ల పరిమాణం మరియు 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ మరియు నైట్ మోడ్, రీడింగ్ మోడ్ మరియు వీడియో ఎన్ హన్సర్ ఫీచర్ల మద్దతుతో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 GSoCట్ తో రన్ అవుతూ అడ్రినో 620 GPU మరియు 12GB LPDDR4x RAM వరకు జత చేయబడి వస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ సోనీ IMX586 సెన్సార్ కెమెరా సెటప్

వన్‌ప్లస్ నార్డ్ సోనీ IMX586 సెన్సార్ కెమెరా సెటప్

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ యొక్క ఫొటోగ్రఫీ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వన్‌ప్లస్ నార్డ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f / 1.75 లెన్స్‌తో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్‌తో వస్తుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో పాటు వస్తుంది. ఇంకా కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.25 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో మరియు 119 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ (FoV) 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంది. అలాగే ఎఫ్ / 2.4 ఎపర్చరుతో 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్ కెమెరాలు కూడా లభిస్తాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ సెటప్‌లో ఎఫ్ / 2.45 లెన్స్‌తో కూడిన 32 మెగాపిక్సెల్ సోనీ IMX616 ప్రైమరీ సెన్సార్ మరియు ఎఫ్ / 2.45 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 105 డిగ్రీల ఎఫ్‌ఒవిని కలిగిన 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ నార్డ్ 5G స్నాప్‌డ్రాగన్ 765G చిప్‌సెట్‌

వన్‌ప్లస్ నార్డ్ 5G స్నాప్‌డ్రాగన్ 765G చిప్‌సెట్‌

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ 5G -ఎనేబుల్ చేసిన స్నాప్‌డ్రాగన్ 765G చిప్‌సెట్‌ను కలిగి ఉండి 12GB ర్యామ్ మరియు 256 GB స్టోరేజ్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఫోన్ వార్ప్ ఛార్జ్ 30T ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌ టెక్నాలజీతో పాటు 4115mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అయితే వన్‌ప్లస్ నార్డ్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ అందుబాటులో లేదు.

Best Mobiles in India

English summary
OnePlus Nord Smartphone Open Sale Starts on Amazon and Oneplus Website

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X