OnePlus Nord AR స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి....

|

ఇండియా యొక్క స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అతి తక్కువ కాలంలో మంచి మార్కెట్ ను సంపాదించుకున్న సంస్థలలో వన్‌ప్లస్ ఒకటి. ఈ సంస్థ ఎప్పటికప్పుడు తన అభిమానుల కోసం కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నది. ఈ సారి వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ను జూలై 21 న ఇండియాలో అధికారికంగా లాంచ్ చేస్తున్నది.

వన్‌ప్లస్ నార్డ్ AR స్మార్ట్‌ఫోన్
 

వన్‌ప్లస్ నార్డ్ AR స్మార్ట్‌ఫోన్

ప్రపంచంలోని మొట్టమొదటి AR స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ AR పేరుతో లాంచ్ అవుతున్న ఈవెంట్ ను లాంచ్ రోజున ఉచితంగా చూడడానికి అనుమతి లేదు. కరోనా కారణంగా ఆన్ లైన్ ద్వారా ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న వినియోగదారులు కేవలం 99 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: Oppo Find X2 Pro యొక్క కొత్త ఎడిషన్ ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూడండి...Also Read: Oppo Find X2 Pro యొక్క కొత్త ఎడిషన్ ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూడండి...

వన్‌ప్లస్ నార్డ్ AR లాంచ్ బహుమతులు

వన్‌ప్లస్ నార్డ్ AR లాంచ్ బహుమతులు

వన్‌ప్లస్ నార్డ్ AR లాంచ్ ఆహ్వానాలను కొనుగోలు చేసేవారికి అమెజాన్‌లో లాంచ్ డే లాటరీలో పాల్గొనడానికి మరియు హామీ ఇచ్చిన బహుమతిని గెలుచుకునే అవకాశం కూడా లభిస్తుంది. అయితే ఈ లాంచ్ లో పాల్గొనేవారికి ఎటువంటి బహుమతులు ఇవ్వనున్నదో కంపెనీ వెల్లడించలేదు. వన్‌ప్లస్ నార్డ్ AR లాంచ్ యొక్క టికెట్ల అమ్మకం నేటి నుంచి అంటే జూలై 11 నుంచి మొదలుకానున్నాయి. యూజర్లు అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా మధ్యాహ్నం 12:00 గంటల నుండి టికెట్ లను కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్‌ AR అనుభవం

వన్‌ప్లస్ నార్డ్‌ AR అనుభవం

AR ను ఉపయోగించి రాబోయే వన్‌ప్లస్ నార్డ్‌ యొక్క అనుభవాన్ని పొందడానికి కొనుగోలుదారులు గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి నార్డ్ AR యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు AR అనుభవానికి అవసరమైన అనుమతులను అంగీకరించాలి. వినియోగదారులు అప్పుడు వారి అవతార్‌ను సెటప్ చేయడానికి యాప్ ను ప్రారంభించి దాని యొక్క సూచనలను అనుసరించాలి. దీన్ని పూర్తి చేసిన తర్వాత వెబ్ AR అనుభవాన్ని ప్రారంభించడానికి ఇన్విటేషన్ లో QR కోడ్‌ను స్కాన్ చెయవలసి ఉంటుంది.

వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ ఫీచర్స్ లీక్
 

వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ ఫీచర్స్ లీక్

వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ గురించి మొదట లీకైన చిత్రంలోని స్మార్ట్‌ఫోన్ యొక్క వాస్తవ డిజైన్ కు అనుగుణంగా లేదని స్పష్టం అయింది. అయితే ఇది పరికరం యొక్క సాధారణ రూపురేఖలను మాత్రమే ప్రదర్శిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు దీని యొక్క ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ల వివరాలు సమగ్రంగా జాబితా చేయబడ్డాయి. లీక్ అయిన సమాచారం ప్రకారం దీని యొక్క స్పెసిఫికేషన్ వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వన్‌ప్లస్ నార్డ్ AR స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ నార్డ్ AR స్పెసిఫికేషన్స్

లీక్ అయిన సమాచారం ప్రకారం వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ 5G కనెక్టివిటీ మద్దతుతో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765G SoC ని కలిగి ఉంటుంది. అలాగే ఇది 20: 9 కారక నిష్పత్తితో ఫుల్ హెచ్‌డి + రిజల్యూషన్‌ మరియు 90HZ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 6.44-అంగుళాల ఫ్లూయిడ్ అమోలేడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ డిస్ప్లే 408pp మద్దతుతో కూడా అందిస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ AR కెమెరా సెటప్

వన్‌ప్లస్ నార్డ్ AR కెమెరా సెటప్

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే దీని వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ సోనీ IMX 586 ప్రైమరీ సెన్సార్‌ను f / 1.75 ఎపర్చరు మరియు OIS / EIS మద్దతుతో వస్తుంది. రెండవది 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా 119 డిగ్రీల FOV తో వస్తుంది. మిగిలిన వాటిలో 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలు కూడా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో డ్యూయల్-సెల్ఫీ కెమెరా డ్యూయల్ పంచ్-హోల్ డిస్ప్లేలో కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.45 ఎపర్చరుతో 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరాలు ఉన్నాయి. లిస్టింగ్ ప్రకారం ఇది ఫేస్ రికగ్నిషన్ మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్లను కూడా కలిగి ఉన్నాయి. ఇది బ్లూ మార్బుల్, గ్రే ఒనిక్స్ మరియు గ్రే యాష్ వంటి కలర్ ఆప్షన్లలో కూడా వస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ AR ఆపరేటింగ్ సిస్టమ్

వన్‌ప్లస్ నార్డ్ AR ఆపరేటింగ్ సిస్టమ్

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ 8GB లేదా 12GB RAM మరియు 128GB లేదా 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి రెండు వేర్వేరు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎన్‌ఎఫ్‌సి, బ్లూటూత్ 5.1, వై-ఫై 2 × 2 మిమో వంటి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4115mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఆక్సిజన్ ఓఎస్ 10 తో పాటు సరికొత్త ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇది 185 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
OnePlus Nord Specifications Reveled: Launching on July 21 in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X