Home
News

OnePlus Nord సేల్స్ ఆగస్టు 6 నుండి ప్రారంభం:డిస్కౌంట్ ఆఫర్‌ల మీద ఓ లుక్ వేయండి

ఇటీవలి కాలంలో విడుదలైన అత్యంత ఉత్తేజకరమైన స్మార్ట్‌ఫోన్లలో వన్‌ప్లస్ నార్డ్ ఒకటి. వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ తన ధర పరిధిలో చాలా ఆసక్తికరమైన ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ లను కలిగి ఉంది. అలాగే దీని యొక్క ప్రీమియం ఫోన్ ఆల్-గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఆగస్టు 6 న మొదలుకానున్నాయి.

oneplus nord the most anticipated smartphone goes on sale starting august 4  

వన్‌ప్లస్ నార్డ్ ముందస్తుగా గ్రహించిన స్మార్ట్‌ఫోన్
2020 సంవత్సరంలో వినియోగదారులు ఎక్కువగా ముందస్తుగా గ్రహించిన స్మార్ట్‌ఫోన్‌గా వన్‌ప్లస్ నార్డ్‌ను ర్యాంక్ చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. అమెజాన్ ఇండియాలో ఇప్పటికే అత్యధికంగా వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్ ను ప్రీ-బుకింగ్ ద్వారా బుక్ చేసుకున్నారు. ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రాకముందే వినియోగదారులు పూర్తి మొత్తాన్ని ఇప్పటికే చెల్లించి బుక్ చేసుకోవడం జరిగింది.
వన్‌ప్లస్ నార్డ్‌ను అత్యంత ప్రత్యేకమైనవిగా మరియు వినూత్నమైనవిగా చేసే అంశాలు అనేకం ఉన్నాయి. AR ఈవెంట్ ద్వారా లాంచ్ చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇది. అదనంగా దీని యొక్క విషయాలు మరింత ఆసక్తికరంగా చేయడానికి వన్‌ప్లస్ వినూత్న ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా సంస్థ ప్రేక్షకుల పరస్పర చర్యను మరింత మెరుగుపరిచే అత్యంత ప్రత్యేకమైన ఆన్‌లైన్ పాప్-అప్ ఈవెంట్‌ను ఒకదాన్ని నిర్వహించింది.

oneplus nord the most anticipated smartphone goes on sale starting august 4  

వన్‌ప్లస్ నార్డ్‌ ఫోన్ మీద ఆసక్తిగల వారు మరియు ఈవెంట్ లో పాల్గొనేవారి యొక్క అవతారాలను నమోదు చేయడానికి, సృష్టించడానికి మరియు వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయడానికి ఈ కార్యక్రమం అనుమతించింది. నమోదు చేసుకున్న వారు జూలై 27 మరియు జూలై 30 మధ్య తమ వన్‌ప్లస్ నార్డ్‌ను కొనుగోలు చేయడానికి పాప్-కోడ్‌లను అందుకున్నారు మరియు అదే రోజున ఫోన్ ను ప్రీ-బుక్ చేసుకోవడానికి కూడా అనుమతిని ఇచ్చింది.
ఆగస్టు 6 న వన్‌ప్లస్ నార్డ్ సేల్

ఇండియాలో ఎట్టకేలకు వన్‌ప్లస్ నార్డ్ యొక్క అమ్మకాలు ఆగస్టు 6 న ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ భారతదేశం అంతటా ఉన్న సంస్థ యొక్క వన్‌ప్లస్ స్టోర్స్‌లో లభిస్తుంది. అలాగే ఆన్‌లైన్ ద్వారా కొనుగోలుచేయాలనుకునే వారికి ఆగస్టు 6 నుండి సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ వన్‌ప్లస్.ఇన్ మరియు అమెజాన్.ఇన్‌ ద్వారా వన్‌ప్లస్ నార్డ్‌ను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు మీద సంస్థ అదనపు ఆఫర్లను కూడా తీసుకువచ్చింది.

oneplus nord the most anticipated smartphone goes on sale starting august 4  

వన్‌ప్లస్ స్టోర్స్‌లో వన్‌ప్లస్ నార్డ్‌ను ముందే బుక్ చేసుకున్న రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులు ఆగస్టు 3 న ఈ స్మార్ట్‌ఫోన్లను పొందవచ్చు. ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో ముందుగా బుక్ చేసిన కస్టమర్లు ఆగస్టు 4 మరియు 5 తేదీలలో తమ సమీప వన్‌ప్లస్ స్టోర్‌లోకి వెళ్లి వారి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. అలాగే రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులు వన్‌ప్లస్ నుండి 50GB క్లౌడ్ స్టోరేజ్ మరియు 6 నెలల ఎక్స్‌టెండెడ్ వారంటీని ఆస్వాదించవచ్చు.

రిలయన్స్ డిజిటల్ మరియు మైజియో స్టోర్స్‌లో వన్‌ప్లస్ నార్డ్‌ యొక్క అమ్మకాలు ఆగస్టు 7 నుండి మొదలుకానున్నట్లు కంపెనీ తెలిపింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఇందులో కూడా కొనుగోలు చేయవచ్చు. రిలయన్స్ డిజిటల్ మరియు మైజియో స్టోర్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి కావున సరికొత్త వన్‌ప్లస్ నార్డ్‌ను కొనుగోలుదారులు చాలా సులభంగా పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
oneplus nord the most anticipated smartphone goes on sale starting august 4  
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X