OnePlus స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్ ఫీచర్‌లతో వన్‌ప్లస్ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది

|

స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీలలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ కంపెనీ 2022 మూడవ త్రైమాసికంలో కొత్తగా మరొక టాప్-ఆఫ్-లైన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి వచ్చే కొత్త మోడల్స్ లోని ఫీచర్ల విషయానికి వస్తే మార్కెట్ లో కొత్తగా అందుబాటులోకి వచ్చే కొత్త రకం చిప్ సెట్ లను ఉపయోగిస్తున్నది. దీనికి కొనసాగింపుగా క్వాల్‌కామ్ సంస్థ ఇటీవల కొత్తగా విడుదల చేసిన స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ను వన్‌ప్లస్ సంస్థ తను విడుదల చేయనున్న కొత్త స్మార్ట్‌ఫోన్‌ మోడల్ లో ఉపయోగించనున్నట్లు చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో బ్రాండ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటన చేసింది. ఈ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌ను స్వీకరించిన మొదటి కంపెనీ వన్‌ప్లస్ బ్రాండ్ అని పేర్కొంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1తో 2022లో రాబోయే వన్‌ప్లస్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లు

స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1తో 2022లో రాబోయే వన్‌ప్లస్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లు

వన్‌ప్లస్ సంస్థ 2021 సంవత్సరంలో అనుసరించిన అదే మార్కెట్ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే లాంచ్‌కు ముందే తన కొత్త స్మార్ట్‌ఫోన్ గురించి హైప్‌ని పెంచడానికి ఎప్పటికప్పుడు ఎదో ఒక కొత్త ఫీచర్‌ను వెల్లడిస్తుంది. వన్‌ప్లస్ బ్రాండ్ తన తదుపరి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పేరును ఇంకా వెల్లడించలేదు. వన్‌ప్లస్ 10 అల్ట్రా ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్‌ని కలిగి ఉంటుందని మునుపటి నివేదికలు సూచించాయి. ఈ డివైస్ 2022 రెండవ భాగంలో లాంచ్ అవుతున్నందున దీని కొనసాగింపుగా వన్‌ప్లస్ 10RT, వన్‌ప్లస్ 10T లేదా వన్‌ప్లస్ 10T ప్రోని చూసే అవకాశం అధికంగా ఉంది.

వన్‌ప్లస్

వన్‌ప్లస్ సంస్థ మాత్రమే కాకుండా అసూస్ మరియు రియల్‌మి సంస్థలు కూడా 2022లో స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌తో కూడిన కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్నట్లు సమాచారం. రియల్‌మి బ్రాండ్ రియల్‌మి GT 2 అనే హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మాస్టర్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ మరియు Snapdragon 8+ Gen 1ని మార్కెట్‌కి తీసుకువచ్చిన మొదటి కంపెనీ అవుతుంది. మరోవైపు ఆసుస్ సంస్థ తన ROG ఫోన్ 6 సిరీస్ లో స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCని కలిగి ఉన్న ప్రపంచంలోని మొట్టమొదటి గేమింగ్ స్మార్ట్‌ఫోన్ అని ప్రకటించింది.

స్నాప్‌డ్రాగన్

స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 అత్యంత సున్నితమైన ప్రతిస్పందనను అందిస్తుంది, అత్యున్నత దృశ్య నాణ్యతతో కలర్-రిచ్ HDR దృశ్యాలు మరియు అద్భుతమైన గేమ్‌ప్లే అనుభవాన్ని అందించే డెస్క్‌టాప్-స్థాయి సామర్థ్యాలను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 అప్‌గ్రేడ్ చేయబడిన Adreno GPUతో 10% వేగవంతమైన వేగం మరియు 30% పవర్ తగ్గింపును ఎనేబుల్ చేస్తుంది. దీనికి అదనంగా, Snapdragon 8+ Gen1 8K HDR వీడియో వంటి సాంకేతికతలను కలిగి ఉంది మరియు స్మార్ట్‌ఫోన్‌లలో గణనీయంగా మెరుగుపరచబడిన వీడియోగ్రఫీని అనుమతించే ప్రీమియం HDR10+ ఫార్మాట్‌లో క్యాప్చర్ చేయగలదు.

Best Mobiles in India

English summary
OnePlus Officially Announces Premium Flagship Smartphone Featuring Snapdragon 8+ Gen 1

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X