Home
News

OnePlus నుంచి రెండవ ఫోల్డబుల్ ఫోన్! లాంచ్ ఎప్పుడంటే!

వన్‌ప్లస్‌ నుంచి OnePlus Open, మొట్టమొదటి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్, అధిక రిజల్యూషన్ కవర్ డిస్‌ప్లే మరియు హస్సెల్ బ్లడ్ బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరాలతో గత సంవత్సరం లాంచ్ చేయబడింది. అయితే, ఇప్పుడు ఈ ఫోల్డబుల్ ఫోన్ కు కొనసాగింపుగా OnePlus Open 2 ఇప్పటికే తయారీలో ఉన్నట్లు చెప్పబడింది.

ఇప్పుడు ప్రముఖ టిప్‌స్టర్ సహకారంతో రాబోయే ఈ ఫోల్డబుల్ ఫోన్ గురించి కొన్ని కొత్త వివరాలను కలిగి ఉన్నాము. OnePlus Open 2 ఫోన్ ఇప్పటివరకు ప్రకటించబడని స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 SoC ప్రాసెసర్ పై పనిచేస్తుంది. మరియు ఇది రీబ్రాండెడ్ Oppo Find N5 ఫోన్ కూడా కావచ్చు.

OnePlus Open 2  launch

ప్రముఖ చైనీస్ సోషల్ మీడియా వెబో లో ప్రసిద్ధ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్, ఈ OnePlus Open 2 ఫోన్ 2025 మొదటి త్రైమాసికంలో లాంచ్ చేయబడుతుంది పేర్కొంది. ఇది క్వాల్కమ్ యొక్క తదుపరి తరం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 SoC ప్రాసెసర్ పై పనిచేస్తాయని చెప్పబడింది. క్వాల్కమ్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ చిప్‌సెట్‌ను ఆవిష్కరించనుంది.

ఈ పుకార్లు వచ్చిన సమాచారం ప్రకారం, వన్‌ప్లస్‌ ఓపెన్ 2 లో అప్‌గ్రేడ్ చేసిన కీలు, "అల్ట్రా-ఫ్లాట్" లోపలి స్క్రీన్, అధిక-రిజల్యూషన్ కవర్ స్క్రీన్ మరియు సన్నని డిజైన్‌ను బెజెల్స్ కలిగి ఉంటుంది. ఇది వన్‌ప్లస్ ఓపెన్ యొక్క పెరిస్కోప్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. మరియు సన్నని డిజైన్ బిల్డ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఇది రీబ్రాండెడ్ ఒప్పో ఫైండ్ N5 గా లాంచ్ అవుతుందని చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే, దీనికి మునుపటిది రీబ్యాడ్జ్ చేయబడిన Find N3 గా వచ్చింది.

వన్‌ప్లస్‌ ఓపెన్ భారతదేశంలో అక్టోబర్ 2023 లో ఏకైక 16GB RAM + 512GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కోసం ధర రూ.1,39,999 ట్యాగ్‌తో లాంచ్ చేయబడింది. ఇది 7.82-అంగుళాల (2,268x2,440 పిక్సెల్‌లు) 2K ఫ్లెక్సీ-ఫ్లూయిడ్ LTPO 3.0 అమోలెడ్ ఇన్నర్ డిస్‌ప్లే మరియు 6.31-అంగుళాల (1,116x2,484 పిక్సెల్‌లు) 2K LTPO 3.0 సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 SoC ప్రాసెసర్ తో పాటు 16GB LPDDR5x RAM తో వస్తుంది.

ఇక, వన్‌ప్లస్‌ ఓపెన్ యొక్క కెమెరా ఆప్టిక్స్ వివరాలు చూస్తే, వన్‌ప్లస్‌ ఓపెన్ 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా నేతృత్వంలోని హస్సెల్ బ్లడ్ బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 20-మెగాపిక్సెల్ ప్రైమరీ సెల్ఫీ కెమెరా మరియు 32-మెగాపిక్సెల్ సెకండరీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ 4800mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 67W సూపర్ ఊక్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Open 2 Tipped With Snapdragon 8 Gen 4 SoC . Expected To Launch In 2025 First Quarter. Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X