Home
News

వన్‌ప్లస్ OxygenOS 16 ఓపెన్‌ బీటా వెర్షన్‌ విడుదల.. స్టేబుల్‌ వెర్షన్ విడుదల ఎప్పుడంటే?

Oneplus OxygenOS 16 Open Beta Version : భారత్‌ లో వన్‌ప్లస్‌ OxygenOS 16 ఓపెన్‌ బీటా వెర్షన్‌ ను లాంచ్‌ చేసింది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ఈ OS పనిచేస్తుంది. ఈ OS ఫుల్ వెర్షన్ అక్టోబర్ 16 వ తేదీన విడుదల కానుంది. ఈ కొత్త OS ను వన్‌ప్లస్‌ లో ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్‌ లు సపోర్టు చేయనున్నాయి. కొత్త వెర్షన్‌ లో గ్యాలరీ, నోట్స్‌, వాతావరణ అప్‌డేట్స్‌కు సంబంధించిన ఫీచర్లు కొత్త అనుభూతిని అందిస్తాయని తెలుస్తోంది.

వన్‌ప్లస్ OxygenOS 16 ఓపెన్‌ బీటా వెర్షన్ పై యూజర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ ను తీసుకుంటుంది. పనితీరు సహా ఫీచర్లపై యూజర్ల అభిప్రాయాలను సేకరిస్తుంది. ప్రస్తుతం వన్‌ప్లస్‌ లో ఉన్న అనేక మోడల్స్‌ ఈ కొత్త OS వెర్షన్‌ లు సపోర్టు చేస్తాయి. ఈ జాబితాలో ఈ కింది వన్‌ప్లస్‌ ఫోన్‌ లు ఉన్నాయి.

Oneplus OxygenOS 16 Open Beta Version launched in india  full details

> వన్‌ప్లస్ 12
> వన్‌ప్లస్ 12R
> వన్‌ప్లస్ 13
> వన్‌ప్లస్‌ 13R
> వన్‌ప్లస్ 13s
> వన్‌ప్లస్ ఓపెన్ స్మార్ట్‌ఫోన్‌

ఈ బీటా వెర్షన్‌ ను ఉపయోగించే ముందే, స్మార్ట్‌ఫోన్ డేటాను బ్యాకప్‌ చేసుకోవడం ఉత్తమం. ఈ ఓపెన్ బీటా వెర్షన్ OS ఇన్‌స్టాల్ చేసిన అనంతరం కొన్ని థర్డ్‌ పార్టీ యాప్‌ లు సక్రమంగా పనిచేయకపోవచ్చని వన్‌ప్లస్‌ చెబుతోంది. యాప్‌లు తరచూ క్రాష్‌ కావడం, ల్యాగ్‌ లేదా ఫోన్ బ్యాటరీ త్వరగా డిశ్ఛార్జీ అయ్యే అవకాశం ఉంటుంది.

దీంతోపాటు స్మార్ట్‌ఫోన్‌ త్వరగా వేడెక్కడం, ఆలస్యంగా స్పందించడం, ఎక్కువ ఛార్జింగ్‌ ను ఉపయోగించుకోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. బ్యాగ్రౌండ్‌ ఆప్టిమైజేషన్‌ ఇందుకు కారణం. స్మార్ట్‌ఫోన్ సాధారణ స్థితికి వచ్చేందుకు, ఛార్జింగ్ చేసిన అనంతరం ఫోన్‌ ను రీస్టార్‌ చేయాలని సూచిస్తోంది.

వన్‌ప్లస్‌ కొత్తగా లాంచ్‌ చేసిన OxygenOS 16 ఓపెన్ బీటా వెర్షన్‌ ను ఇన్‌స్టాల్‌ చేయాలని అనుకుంటే, స్మార్ట్‌ఫోన్‌ లో కనీసం 30 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఉండాలి. మరియు కనీసం 4GB స్టోరేజీ ఉండాలి. వన్‌ప్లస్‌ 15 ఫోన్‌.. ఈ కొత్త OS తో విడుదల కానున్న తొలి హ్యండ్‌సెట్‌ గా నిలుస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత Out of the box గా వస్తుంది.

OxygenOS 16 ఓపెన్‌ బీటా వెర్షన్‌ ను ఇన్‌స్టాల్‌ చేసుకొనేందుకు యూజర్లు తమ ఫోన్‌ ను CPH2649_15.0.0.860 (EX01) సాఫ్ట్‌వేర్‌ వెర్షన్‌ ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మరియు అక్టోబ‌ర్ 13 వరకు ఈ అవకాశం ఉంటుందని తెలిపింది.

> ఈ వెర్షన్‌ ను ఇన్‌స్టాల్ చేసుకున్నాక, మెనూ ఐకాన్‌ పైన క్లిక్‌ చేయాలి.
> అనంతరం అక్కడ కనిపించే ఆప్షన్‌లలో బీటా ప్రోగ్రాం పైన క్లిక్‌ చేయాలి.
> అనుమతులు వచ్చాక, OxygenOS 16 ఓపెన్‌ బీటా వెర్షన్‌ ను పొందుతారు.
> ఈ బీటా వెర్షన్‌ ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
> అక్టోబర్‌ 16 వ తేదీన కొత్త OS స్టేబుల్‌ వెర్షన్‌ విడుదల కానుంది.

Best Mobiles in India

English summary
Oneplus OxygenOS 16 Open Beta Version launched in india, full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X