జియో మార్ట్ డిజిటల్ లోనూ వన్‌ప్లస్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు..!!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus JioMart Digital) తాజాగా కీలక ప్రకటన చేసింది. వన్‌ప్లస్ ఫోన్లను జియో మార్ట్ డిజిటల్ స్టోర్లలోనూ కొనుగోలు చేయవచ్చని తెలిపింది. దేశంలోని రెండు వేలకు పైగా ఉన్న నగరాలు, పట్టణాల్లోని జియో మార్ట్ డిజిటల్ స్టోర్ల నుంచి వన్‌ప్లస్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చని సంస్థ వెల్లడించింది.
వన్‌ప్లస్ తాజా నిర్ణయంతో టైర్ 3 మరియు టైర్ 4 నగరాలకు కూడా సేల్స్ విస్తరించినట్లయింది. అయితే జియో మార్ట్ డిజిటల్‌తో ఒప్పందం ప్రభావం ఈ-కామర్స్ విక్రయాలపై చూపదని తెలుస్తోంది. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్ మరియు ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

జియో మార్ట్ డిజిటల్‌తో ధీర్ఘకాల రిటైల్ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని వన్‌ప్లస్ ఇండియా సేల్స్ డైరెక్టర్ రంజిత్ సింగ్ అన్నారు. జియో డిజిటల్‌తో తమ బంధాన్ని బలోపేతం చేస్తూ ప్రయాణానికి కట్టుబడి ఉన్నామని రంజిత్ సింగ్ తెలిపారు. ఫలితంగా వినియోగదారులు కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
** భారత్‌లో వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 210 టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్‌తో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే HDR 10+ కలర్ సర్టిఫికేషన్ మరియు 10 బిట్ కలర్ డెప్త్‌ను కలిగి ఉంటుంది.
నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. అడెన్నో 720 GPU తో జతచేయబడి ఉంటుంది. 8GB LDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ LYT600 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో వచ్చింది. మరియు 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది.
100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సంస్థ ప్రకారం కేవలం 29 నిమిషాల్లో 0-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తిచేయవచ్చని తెలుస్తోంది. IP54 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. దీంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








