Home
News

Amazon Great Indian Festival Sale: OnePlus స్మార్ట్‌ఫోన్‌ల మీద రూ.5000 వరకు తగ్గింపు!మిస్ అవ్వకండి..

ఇండియాలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ఈ నెల అంటే అక్టోబర్ 17 నుండి ప్రారంభం కానున్నాయి. అమెజాన్ లో ప్రత్యేకంగా అమ్మకానికి లభించే వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ల యొక్క ధరల మీద అందరూ ఉహించిన విధంగా కొన్ని అద్భుతమైన తగ్గింపులు మరియు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మరి ముఖ్యంగా టాప్-ఎండ్ వేరియంట్ల కొనుగోలు మీద సుమారు రూ.5 వేల వరకు ఆదా చేయవచ్చు అలాగే ఎంట్రీ లెవల్ వేరియంట్ మీద రూ.2,000 వరకు తగ్గింపును అందిస్తుంది. ఈ అమ్మకపు సమయంలో వన్‌ప్లస్ సంస్థ యొక్క వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ 8 మరియు 8 ప్రో 5G ఫోన్లను డిస్కౌంట్ ధరలతో కొనుగోలు చెయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020లో వన్‌ప్లస్ 8 తగ్గింపు ధరల వివరాలు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020లో వన్‌ప్లస్ 8 తగ్గింపు ధరల వివరాలు

వన్‌ప్లస్ సంస్థ ఏప్రిల్ 2020 లో సరసమైన ప్రీమియం ఫోన్‌ విభాగంలో వన్‌ప్లస్ 8ను విడుదల చేసారు. ఇది లాంచ్ అయినప్పటి నుంచి అమెజాన్ అమ్మకంలో దానిపై అధిక డిస్కౌంట్లను అందిస్తున్నది. సాధారణంగా రూ.41,999 ధర వద్ద లభించే 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌ బేస్ వేరియంట్ ను అమ్మకం సమయంలో రూ.39,999 ధర వద్ద లభిస్తుంది. అలాగే 8GB ర్యామ్‌తో కూడిన వెర్షన్ ను రూ.41,999 ధర వద్ద మరియు టాప్-ఎండ్ వేరియంట్‌ మీద రూ.5000 డిస్కౌంట్ లభించిన తరువాత రూ.44,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

 

వన్‌ప్లస్ ఇతర స్మార్ట్‌ఫోన్‌ల మీద డిస్కౌంట్ ఆఫర్లు

వన్‌ప్లస్ ఇతర స్మార్ట్‌ఫోన్‌ల మీద డిస్కౌంట్ ఆఫర్లు

వన్‌ప్లస్ 8 ఫోన్ మీద ధరల తగ్గింపు లభిస్తుండగా వన్‌ప్లస్ యొక్క ఇతర మోడళ్ల ధరలలో ఎటువంటి మార్పులు లభించదు. వన్‌ప్లస్ 8 ప్రో ప్రారంభ ధర రూ.54,999 వద్ద ఉండగా. సంస్థ ఇటీవల విడుదల చేసిన వన్‌ప్లస్ నార్డ్ 128GB వేరియంట్‌ను రూ.27,999 ధర వద్ద కొనుగోలు చెయవచ్చు. గతేడాది నుంచి లభించే వన్‌ప్లస్ 7T యొక్క ధర రూ .37,999 కాగా, వన్‌ప్లస్ 7T ప్రో యొక్క ధర రూ .43,999.

వన్‌ప్లస్ 7T ప్రో స్మార్ట్‌ఫోన్ మీద తగ్గింపు ఆఫర్లు

వన్‌ప్లస్ 7T ప్రో స్మార్ట్‌ఫోన్ మీద తగ్గింపు ఆఫర్లు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020 అమ్మకం సమయంలో డిస్కౌంట్ ధరలను పొందిన తరువాత వన్‌ప్లస్ 7T ప్రో ఫోన్ యొక్క ధర వన్‌ప్లస్ 8 యొక్క 256GB వేరియంట్‌కు సమానంగా ఉంటుంది. అందువల్ల రెండింటిలో దేనిని ఎంచుకోవాలో అన్న దాని మీద వినియోగదారులు గందరగోళంగా ఉండడం సహజం. కాబట్టి రెండు ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్ వివరాలు చూసుకొని కొనుగోలు చేయడం ఉత్తమం. వన్‌ప్లస్ 7T ప్రో గత సంవత్సరంలో లాంచ్ అయింది. ఇది కర్వ్ డిస్ప్లే మరియు బహుముఖ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది కొత్త 2020 మోడళ్ల మాదిరిగానే 30W ఛార్జింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.

వన్‌ప్లస్ 8 vs వన్‌ప్లస్ 7T ప్రో

వన్‌ప్లస్ 8 vs వన్‌ప్లస్ 7T ప్రో

వన్‌ప్లస్ 8 సరికొత్త స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌ను కలిగి ఉండి రన్ అవుతుంది. అదనంగా క్రొత్త ఫోన్ అవ్వడం వలన వన్‌ప్లస్ 7T ప్రో కంటే అదనపు OS అప్‌గ్రేడ్ అవుతుంది. అందువల్ల ఎక్కువ కాలం పనిచేసే ఫోన్ కోసం చూస్తున్న వారు కొత్త మోడల్‌ను పరిగణించవచ్చు. వన్‌ప్లస్ 7T ఇప్పటికీ అత్యంత సరసమైన ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ వన్‌ప్లస్ ఫోన్‌గా ఉంది. అయినప్పటికీ వన్‌ప్లస్ 8T లాంచ్ తర్వాత దశలవారీగా దీనిని తొలగించవచ్చు.

Best Mobiles in India

English summary
OnePlus Smartphones Gets Discount up to Rs.5000 on Amazon Great Indian Festival 2020 Sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X