Home
News

వన్ ప్లస్ యొక్క కొత్త ఫోల్డబుల్ ఫోన్,పేరు విడుదలైంది! డిజైన్, స్పెక్స్ వివరాలు 

By Maheswara

వన్ ప్లస్ సంస్థ కొత్త గా ఫోల్డబుల్ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ యొక్క ఖచ్చితమైన పేరు మరియు లాంచ్ తేదీ వివరాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ, వన్ ప్లస్ ఈ సంవత్సరం తన మొదటి ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ ను చాలా కాలంగా ధృవీకరించింది. కొన్ని పాత నివేదికల ప్రకారం ఈ ఫోన్‌ని "OnePlus V Fold" అని పిలుస్తారని అంచనాలున్నాయి.

అయితే, ప్రస్తుతం కొత్తగా వెలువడిన నివేదికల ప్రకారం దీని పేరు "OnePlus Open" గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ వారంలో గెలాక్సీ Z ఫోల్డ్ 5 లాంచ్ అయిన తర్వాత, వన్ ప్లస్ తన మొదటి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ను "OnePlus Open" అని పిలవవచ్చని సూచిస్తూ, "ఇతరులు మడతపెట్టినప్పుడు మేము తెరుస్తాము" అని అర్థంతో ట్వీట్ చేసింది.

OnePlus Teases Its First Foldable Phone Name From The Brand. Expected Launch Date Details Here.

ఈ వన్ ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ 2023 మూడవ త్రైమాసికంలో లాంచ్ చేయబడుతుందని ధృవీకరించబడింది. అంటే, సెప్టెంబర్ 30 లోపు లాంచ్ కావొచ్చు. అయితే, ఆగస్ట్ 29న లాంచ్ చేయవచ్చని ఒక నివేదిక సూచించింది. అయితే, ఈ ఫోన్ యొక్క అమ్మకాలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి. వన్ ప్లస్ ఈ టైమ్‌లైన్‌ ప్రకారం పాటిస్తే, దాని వన్ ప్లస్ నంబర్ సిరీస్, వన్ ప్లస్ 12 సిరీస్ లాంచ్ లోపే ఇది వస్తుంది.

ఈ కొత్త వన్ ప్లస్ ఓపెన్ ఫోల్డింగ్ ఫోన్ గురించి అధికారిక వివరాలు అస్పష్టంగానే ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఫోన్ అనేక లీక్‌ల కారణంగా కొన్ని వివరాలు విడుదలయ్యాయి. ఈ ఫోన్ క్లా మ్‌షెల్ లాంటి ఫ్లిప్ మెకానిజమ్‌కు బదులుగా శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ లాంటి ఫోల్డింగ్ డిజైన్ తో వస్తుంది. ఈ వన్ ప్లస్ ఫోన్ దాని సబ్ బ్రాండ్ అయిన ఒప్పో ఫోల్డ్ నుండి ప్రేరణ పొందవచ్చు. అంటే, అంతర్గతంగా, వన్ ప్లస్ ఓపెన్ ఫోన్ ఒప్పో ఫైండ్ N2 మాదిరిగానే ఉండవచ్చు

గతంలో, ఆన్‌లీక్స్‌తో స్మార్ట్‌ప్రిక్స్ ద్వారా విడుదలైన రెండర్‌ల ప్రకారం, లెదర్ బ్యాక్ మరియు స్లిమ్ బెజెల్స్‌తో పెద్ద బాహ్య డిస్‌ప్లేను టీజ్ చేశారు. బాహ్య డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా కోసం రంధ్రం-పంచ్ కటౌట్‌ను కలిగి ఉంటుంది. ప్రధాన డిస్‌ప్లేలో మరో సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. వెనుక భాగంలో హాసెల్‌బ్లాడ్ ట్యూన్ చేసిన మూడు కెమెరా సెన్సార్‌లు ఉండవచ్చు.

ఈ ఫోన్ యొక్క వెనుక కెమెరాలు ఒక రౌండ్ కెమెరా డెక్ డిజైన్ లోపల రావచ్చు. స్పెసిఫికేషన్ల పరంగా, ఈ ఫోన్, ఇంకా ప్రకటించబడని స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 2 SoC ప్రాసెసర్, 2K 120Hz అమోలెడ్ (LTPO) డిస్‌ప్లే మరియు 100W సూపర్ ఊక్ ఛార్జింగ్‌తో కూడిన 4800mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్ ఫ్లాగ్ షిప్ ఫోన్ అయినందువల్ల, ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇవ్వవచ్చు, ఇది వన్ ప్లస్ ఫోన్‌లలో ప్రత్యేకంగా నిలుస్తుంది.

భారతదేశంలో వన్‌ప్లస్ ఫోన్లకు ఉన్న ప్రజాదరణను బట్టి, ఈ వన్‌ప్లస్ ఓపెన్ ఫోన్ భారతదేశంలో కూడా లాంచ్ చేయవచ్చు. ఇది, ధరపై ఆధారపడి ఉంటుంది. వన్‌ప్లస్ ఓపెన్‌కు భారతదేశంలో లక్ష రూపాయల కంటే ఎక్కువ ధర ఉంటుందని మనము అంచనా వేయవచ్చు. అయినప్పటికీ, గెలాక్సీ Z ఫోల్డ్ 5 కంటే చౌకగానే ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Teases It's First Foldable Phone Name From The Brand. Expected Launch Date Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X