Home
News

ధర రూ.20 వేలలో వన్ ప్లస్ మరో కొత్త 5G ఫోన్ ! లాంచ్,స్పెసిఫికేషన్ల వివరాలు

By Maheswara

వన్ ప్లస్ ఫోన్‌లకు భారత మార్కెట్లో ఉన్న క్రేజ్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రేజ్ ను మరికొంత పెంచే లక్ష్యంతో అలాగే వినియోగదారులకు కూడా అందుబాటు ధరలో ఉండే విధంగా వన్ ప్లస్ రూ.20,000 బడ్జెట్‌లో తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయాలనీ ఆలోచిస్తున్నట్లు రిపోర్టులు ఉన్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G మోడల్. ఇది గత ఫిబ్రవరి 2022లో లాంచ్ చేయబడిన వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ స్మార్ట్‌ఫోన్‌కి మెరుగైన తర్వాతై తరం స్మార్ట్ ఫోన్ గా వస్తుంది.త్వరలోనే ఇండియన్ మార్కెట్లో వన్ ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G లాంచ్ కాబోతోందని అంచనాలున్నాయి.

OnePlus To Launch OnePlus Nord CE3 Lite 5G In India With Affordable Price Tag Under Rs20000.

వన్ ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G ఏ ఫీచర్లను కలిగి ఉంటుంది?
వన్ ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో రెండు పెద్ద వృత్తాకార కెమెరా మాడ్యూల్స్ ఉంటాయి. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇచ్చే ఫుల్ HD+ ఫ్లాట్ LCD డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంటుంది.

వన్ ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G ధర ఎంత ఉంటుంది?
వన్ ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ఖచ్చితంగా రూ.20,000 బడ్జెట్‌ ధరలో విడుదల చేయబడుతుంది అని అంచనాలున్నాయి. ఎందుకంటే ఇది రియల్ మీ , షియోమీ మరియు Redmi వంటి కంపెనీల నుండి వచ్చే బడ్జెట్ ధర గల 5G ఫోన్‌లతో పోటీ పడుతుంది. ఈ ఫోన్ రూ.18,999 వద్ద లాంచ్ అయినా కూడా ఆశ్చర్యం చెందాల్సిన అవసరంలేదు.ఎందుకంటే, దీని ముందు వెర్షన్ అయిన వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5G ధర రూ. 19,999 గా లాంచ్ అయింది.

OnePlus To Launch OnePlus Nord CE3 Lite 5G In India With Affordable Price Tag Under Rs20000.

వన్ ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G లాంచ్ వివరాలు
వన్ ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ వన్ ప్లస్ ఇండియా వెబ్‌సైట్‌లో ఇప్పటికే గుర్తించబడింది మరియు త్వరలో భారతీయ మార్కెట్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. కానీ ఖచ్చితమైన లాంచ్ తేదీ గురించి సమాచారం లేదు. వన్ ప్లస్ నుండి కూడా అధికారిక సమాచారం ఇంతవరకు లేదు.

మునుపటి, వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5G మోడల్ యొక్క స్పెసిఫికేషన్లు
నార్డ్ CE 2 లైట్, వన్ ప్లస్ నార్డ్ CE 3 లైట్ కి ముందు ఫోన్, ఇది 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల పూర్తి-HD+ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఆక్సిజన్‌OS 13, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్, 695 చిప్‌సెట్ మరియు 8GB వరకు RAM ఫీచర్లను కలిగి ఉంది.

ఇక కెమెరాల పరంగా గమనిస్తే, 64MP + 2MP + 2MP యొక్క AI ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్ ఉంది. ఇది ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అంతే కాకుండా, ఇది 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2 వెర్షన్, 3.5mm ఆడియో జాక్, 33W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 5,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది!

Best Mobiles in India

English summary
OnePlus To Launch OnePlus Nord CE3 Lite 5G In India With Affordable Price Tag Under Rs20000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X