OnePlus నుండి మూడు కొత్త టీవీలు,ధర రూ.20000 లోపే మొదలు.

By Maheswara
|

వన్‌ప్లస్ కంపెనీ జూలైలో మూడు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వచ్చే నెల ప్రారంభంలో ఈ టీవీలను ఆవిష్కరించడానికి కంపెనీ ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తోంది.ఈ మూడు టీవీలు వేర్వేరు ధరల కేటగిరీ లో రాబోతున్నాయి.

 

 ఒక ఫోటో ను ట్వీట్

వన్‌ప్లస్  అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ఒక ఫోటో ను ట్వీట్ చేసింది, ఈ ఫోటో ను నిశితం గా పరిశీలిస్తే వీటి ధరలు రూ .20,000 లోపు ప్రారంభమవుతాయని మనకు స్పష్టంగా తెలుస్తుంది.ఇంకా ఫీచర్ల వివరాలకు వస్తే HD ,Full HD మరియు 4K స్క్రీన్ రెసొల్యూషన్ లతో రావొచ్చని అంచనా.

Oneplus Tv variants

Oneplus Tv variants

అదే విధంగా సైజు ల లో కూడా తేడాలు గమనించవచ్చు 32  ఇంచులు,43 ఇంచులు  మరియు 53 ఇంచుల స్క్రీన్ సైజు లతో రావొచ్చు.ఈ ధరలు  మరియు ఫీచర్లను పరిశీలిస్తే షియోమీ ,రియల్ మీ మరియు VU టీవీ లకు గట్టి పోటీగా నిలుస్తాయని అర్థమౌతోంది.ఇండియన్ టీవీ ల మార్కెట్లో ధర 20 వేల నుండి మొదలెయ్యి మధ్యరకం బడ్జెట్ ధరలలో టీవీలకు మంచి డిమాండ్ ఉంది.అందుకే ఈ సెగ్మెంట్ లో టీవీ లను విడుదల చేస్తే విజయం సాధించ వచ్చని ఈ పోటీలోకి Oneplus కూడా వచ్చేసింది.ఇప్పటికి షియోమీ Mi Tv సిరీస్ లతో మంచి సేల్ తో ముందు వరసలో ఉంది.

టీజర్ కూడా విడుదల చేసింది
 

టీజర్ కూడా విడుదల చేసింది

ఈ టీవీ లకు సంబంధించి One plus ఇప్పటికే ప్రీ బుకింగ్ ఆర్డర్స్ ను మొదలుపెట్టినట్లు కంపెనీ తెలిపింది.వన్ ప్లస్ కు సంబందించి సామజిక మాద్యమాలైన ఇంస్టాగ్రామ్ లో ఈ టీవీ లకు సంబందించిన ఒక టీజర్ కూడా విడుదల చేసింది.టీజర్ లో చూపిన సమాచారం ప్రకారం, ఈ టీవీ లు వన్ ప్లస్ 8 స్మార్ట్ ఫోన్ల అంత మందం తో వస్తాయని భావించవచ్చు.

వన్ ప్లస్ కంపెనీ సీఈఓ మాట్లాడుతూ

వన్ ప్లస్ కంపెనీ సీఈఓ మాట్లాడుతూ

గత వారం వన్ ప్లస్ కంపెనీ సీఈఓ మాట్లాడుతూ తమ కంపెనీ నుంచి రాబోయే కొత్త టీవీ లు బీజిల్ లెస్ డిజైన్ లతో పాటు 93% DCI -P3 కలర్ మరియు Dolby vision సపోర్ట్ తో వస్తాయని తెలియచేసారు.అంతే కాక టీవీ లో పిక్చర్ క్వాలిటీ ని మెరుగు పరచడానికి Gamma engine అనే టెక్నాలజీ ని కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలియచేసారు.డైనమిక్ కాంట్రాస్ట్ ,MEMC మరియు సూపర్ రెసొల్యూషన్ ఫీచర్లు కూడా ఈ కొత్త టీవీ లలో భాగమే.

గత సంవత్సరం వన్ ప్లస్ నుండి వచ్చిన 55 ఇంచుల టీవీ ధర రూ.69,900 గా ఉన్నట్లు అందరికీ తెలిసిన విషయమే. 

Best Mobiles in India

Read more about:
English summary
OnePlus TV Launching on July 2 with Three Variants Options 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X