భారతదేశంలో వన్‌ప్లస్ టీవీల ధరలు మళ్లీ రూ.7,000 వరకు భారీగా పెరిగాయి!!

|

ప్రముఖ వన్‌ప్లస్ సంస్థ ఇండియాలో స్మార్ట్ ఫోన్ లతో పాటుగా స్మార్ట్ టీవీలను విడుదల చేసి వినియోగదారుల యొక్క దృష్టిని తనపైపుకు తిప్పుకున్నది. ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన సరికొత్త వన్‌ప్లస్ టీవీ U1S సిరీస్‌తో పాటుగా అన్ని టీవీల యొక్క ధరలను పెంచింది. ఇందులో కొన్ని టీవీ మోడళ్ల ధరలు కొంతవరకు సహేతుకంగా పెరగగా మరికొన్నింటి ధరలు 17.5 శాతం అంటే దాదాపుగా రూ.7,000 వరకు ధరలు పెరిగాయి. సంస్థ ఇండియాలో ఈ ధరల పెరుగుదలకు గల కారణం అస్పష్టంగా ఉంది.

టీవీ తయారీదారులు

ప్రపంచవ్యాప్తంగా టీవీ తయారీదారులు ఉపయోగించే ఓపెన్-సెల్ ప్యానెళ్ల ధరలు, టీవీని సమీకరించడానికి అవసరమైన పదార్థాల దిగుమతి వ్యయం భారం అవ్వడం లేదా కొరత కారణంగానే ధరల పెరుగుదలకు కారణం కావచ్చు అని భావిస్తున్నారు. భారతదేశంలో ఇటీవల ఇతర కంపెనీలు కూడా తమ టీవీల యొక్క ధరలను పెంచాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వన్‌ప్లస్

వన్‌ప్లస్ కంపెనీ గత ఏడాది జూలైలో తన వన్‌ప్లస్ టీవీ Y-సిరీస్ మోడళ్లలో 32 అంగుళాలు, 43 అంగుళాల మోడల్‌ను విడుదల చేసింది. అలాగే 40-అంగుళాల వన్‌ప్లస్ Y1 ను కూడా ఈ ఏడాది మేలో విడుదల చేశారు. 32 అంగుళాల మోడల్‌ను రూ.12,999 చౌకైన ధరతో ప్రారంభించింది. అయితే దాని ధరను మొదట రూ.16,499 కు మరియు ఇప్పుడు దీని ధరను రూ.18,999 కు పెంచారు. ఇది గత పెంపుతో పోలిస్తే 15 శాతం అధికంగా పెరుగుదలను అందుకున్నది. లాంచ్ ధరతో పోలిస్తే ప్రస్తుత పెరుగుదల దాదాపు 50 శాతం పెరిగింది. అలాగే 43 అంగుళాల మోడల్‌ను రూ.22,999 వద్ద లాంచ్ కాగా తరువాత రూ.26,999 కు మరియు ఇప్పుడు దీనిని రూ.29,499 కు పెంచారు. అదేవిధంగా ఇటీవల 40 అంగుళాల మోడల్‌ను రూ.23,999 ధర వద్ద విడుదల చేయగా ఇప్పుడు దీని ధరను రూ.26,499 కు పెంచారు.

వన్‌ప్లస్ టీవీ U1S సిరీస్‌

సరికొత్త వన్‌ప్లస్ టీవీ U1S సిరీస్‌ విషయంలో 50 అంగుళాల, 55-అంగుళాల, మరియు 65-అంగుళాలు అనే మూడు మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు గత నెలలో రూ.39,999, రూ.47,999, మరియు రూ.62,999 వద్ద ఉండగా ఇప్పుడు మూడు మోడల్స్ రూ.46,999, రూ.52,999, మరియు రూ.68,999 వద్దకు పెరిగాయి. అంటే 50-అంగుళాల మోడల్‌ మీద రూ.7,000 ధరల పెరుగుదల అందుకోగా, 65 అంగుళాల మోడల్ మీద రూ.6,000 మరియు 55-అంగుళాల మోడల్ మీద రూ. 5,000 వరకు పెరుగుదలను అందుకున్నాయి.

వన్‌ప్లస్ సంస్థ

ఇటీవల వన్‌ప్లస్ సంస్థ మాత్రమే తన యొక్క టీవీల ధరలను పెంచే ఏకైక తయారీదారు కాదు. జూన్ చివరలో షియోమి సంస్థ తన గత సంవత్సరంలోని సరఫరా గొలుసు కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టివిల యొక్క ధరలను పెంచింది. ఇతర వాటిలో ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ భాగాల ధరలలో "స్థిరమైన కదలిక" ఏర్పడింది. జూలై 1 నుండి షియోమి మరియు రెడ్‌మి టీవీ ధరలు 3-6 శాతం పెరిగాయి. అలాగే రియల్‌మి సంస్థ కూడా తన ధరలను 15 శాతం వరకు పెంచగా, టిసిఎల్ ఇండియా తన టీవీల ధరలను ఏడు నుంచి ఎనిమిది శాతం పెంచింది.

Best Mobiles in India

English summary
OnePlus TV Prices Hiked Up to Rs.7,000 Once Again in India: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X