వన్‌ప్లస్ TV40Y1 ధరలు, ఫీచర్స్ వివరాలు లీక్ అయ్యాయి!! మీరు చూడండి..

|

గ్లోబల్ మార్కెట్లో ఫ్లాగ్‌షిప్ కిల్లర్‌గా పిలువబడుతున్న వన్‌ప్లస్ సంస్థ పోటీ ప్రపంచంలో ఉత్తమమైన స్పెసిఫికేషన్లతో అద్భుతమైన ఆఫర్‌లతో తన యొక్క ప్రొడెక్టులను విడుదల చేస్తోంది. ధరల విషయంలో సంస్థ తన వ్యూహంలో మార్పులను సాధించింది. కంపెనీ యొక్క కీలకమైన వ్యూహాత్మక మార్పులలో ఒకటి టీవీ సిరీస్ లను చేర్చడం. మొదటి ప్రయత్నంలో భాగంగా అధిక ధర కారణంగా ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. కాని ఇప్పుడు సంస్థ నుండి లభించే రెండు కొత్త టీవీలు చాలా మెరుగ్గా ఉన్నాయి.

వన్‌ప్లస్ టీవీ 40Y1

భారతదేశంలో వన్‌ప్లస్ సంస్థ వచ్చే వారం వన్‌ప్లస్ టీవీ 40 Y1 ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించడంతో కంపెనీ తన టీవీ పోర్ట్‌ఫోలియోకు మరో ఉత్పత్తిని జోడించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 40-అంగుళాల మోడల్ వన్‌ప్లస్ Y1 పోర్ట్‌ఫోలియోలో జోడించనున్నది. వన్‌ప్లస్ సంస్థ ఇప్పటికే Y1-సిరీస్ లో 32Y1 మరియు 43Y1 లను కలిగి ఉంటుంది. రాబోయే వన్‌ప్లస్ 40 Y1 అనేది 2020 లో ప్రారంభించిన రెండు మోడళ్ల మధ్య స్లాట్ గా ఉంది. ధర విషయంలో ఇది వన్‌ప్లస్ 43Y1 టీవీ కంటే కొంచెం చౌకగా ఉంటుంది. కంపెనీ యొక్క అధికారిక సైట్ ప్రకారం ఈ మోడల్ యొక్క ధర ఇండియాలో రూ.26,999 గా ఉంది.

వన్‌ప్లస్ టీవీ 40 Y1 లీక్ స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ టీవీ 40 Y1 లీక్ స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 40 Y1 స్మార్ట్ టీవీ ఇండియాలో మే 24 న లాంచ్ కానున్నట్లు వన్‌ప్లస్ సంస్థ తన అధికారిక అకౌంట్ లో ట్వీట్ చేసింది. ఈ ఈవెంట్ లాంచ్ మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. వన్‌ప్లస్ యొక్క Y-సిరీస్ మోడల్ లో Y1 32-ఇంచ్ మోడల్ ధర ప్రస్తుతం రూ.15,999 మరియు 43 Y1 మోడల్ ధర రూ.26,999 గా ఉంది. కొత్త మోడల్ 40Y1 ఈ ధరల మధ్యలో ఉండవచ్చు అని భావిస్తున్నారు. కాబట్టి దీని యొక్క ధర 20-25k చుట్టూ ఉంటుందని భావిస్తున్నారు.

వన్‌ప్లస్

వన్‌ప్లస్ కొత్త టీవీ 40 Y1 యొక్క స్పెసిఫికేషన్లను అధికారిక సైట్ ద్వారా లాంచ్ కు ముందే కంపెనీ టీజ్ చేయడం ప్రారంభించింది. ఈ టీవీ 64-బిట్ ప్రాసెసర్ ద్వారా శక్తినిపొందుతూ ఆండ్రాయిడ్ 9 ఆధారిత ఆక్సిజన్ ప్లేపై ఆధారపడి ఉంటుందని సైట్ వెల్లడించింది. అలాగే ఇది 40 అంగుళాల FHD డిస్‌ప్లేను DCI-P 3 కలర్ గాముట్ యొక్క 93 శాతం కవరేజ్‌తో పాటు గామా ఇంజిన్ పిక్చర్ క్వాలిటీని పెంచింది. కంపెనీ విడుదల చేసిన టీజర్‌లలో బెజెల్-లెస్ డిజైన్ మరియు వన్‌ప్లస్ కనెక్ట్ వంటి ఇంటిగ్రేషన్ ఫీచర్‌లను కలిగి ఉన్నట్లు కూడా సూచిస్తాయి.

క్రోమ్‌కాస్ట్

వన్‌ప్లస్ టీవీ 40 Y1 మోడల్ అంతర్నిర్మిత క్రోమ్‌కాస్ట్ తో పాటు అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్‌లకు మద్దతును ఇస్తుంది. ఈ టీవీ గూగుల్ ప్లే స్టోర్ కోసం మద్దతును కూడా అందిస్తుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ వంటివి ముందే ప్రీలోడ్ చేయబడి ఉన్నాయి. కొత్త ఫీచర్ ఇంటిగ్రేటెడ్ కంటెంట్ క్యాలెండర్ ద్వారా తాజా టీవీ షోలు మరియు సినిమాల స్వయంచాలక రిమైండర్‌లను అందించే టీవీ సామర్థ్యంను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో వై-ఫై 802.11 b/g/n మరియు బ్లూటూత్ 5.0 వంటివి ఉంటాయి. ఆడియో కోసం డాల్బీ ఆడియోకు మద్దతుతో గల రెండు 20W స్పీకర్లు బోర్డులో ఉంటాయి. పోర్టులలో ఈథర్నెట్ పోర్ట్, RF కనెక్షన్ ఇన్‌పుట్, రెండు హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు, ఒక ఎవి ఇన్, ఒక డిజిటల్ ఆడియో అవుట్‌పుట్ మరియు రెండు యుఎస్‌బి పోర్ట్‌లు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
OnePlus TV40Y1 India Launch Date Revealed: Key Specifications, Price Leaked

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X