OnePlus V Fold స్మార్ట్‌ఫోన్ వివరాలు లీక్.. 7.8 అంగుళాల డిస్‌ప్లే..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ పోల్డబుల్ ఫోన్‌పై పనిచేస్తున్నట్లు ఈ సంవత్సరం ప్రారంభంలోనే వెల్లడించింది. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ గురించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. OnePlus V Fold స్మార్ట్‌ఫోన్ 7.8 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. మరియు 6.3 అంగుళాల ఔటర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
వన్‌ప్లస్ V ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ రెండు డిస్‌ప్లేలు అమోలెడ్ 2k రిజల్యూషన్ మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో రానున్నట్లు తెలుస్తోంది. మరియు V ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ 4800 mAh బ్యాటరీ సామర్థ్యం, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుందని తెలుస్తోంది.

ఆన్‌లీక్ మరియు మైస్మార్ట్ ప్రైస్ లీక్‌ల ప్రకారం వన్‌ప్లస్ V ఫోల్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 48MP ప్రైమరీ కెమెరా, 48MP ఆల్ట్రావైడ్ సెన్సార్, 64MP టెలీఫోటో సెన్సార్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఔటర్ డిస్‌ప్లే పైన 32MP సెల్ఫీ కెమెరా మరియు ఇన్నర్ డిస్‌ప్లే పైన 20MP కెమెరా ఉంటుందని సమాచారం.
వన్‌ప్లస్ V ఫోల్డ్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ఆధారంగా పనిచేస్తుందని సమాచారం. ఈ ఫోల్డింగ్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్OSను కలిగి ఉంటుందని మరికొన్ని వార్తలు వస్తున్నాయి. V ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ 16GB ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉండనుంది. అయితే మిగిలిన వేరియంట్ల వివరాలు తెలియాల్సి ఉంది. మరియు సైట్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.
గతవారం కూడా వన్‌ప్లస్ V ఫోల్డ్ ఫోన్ డిజైన్ ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫోల్డింగ్ ఫోన్ ఇన్నర్, ఔటర్ డిస్‌ప్లేలు పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఔటర్ డిస్‌ప్లే మధ్యలో పంచ్ హోల్ ఉండగా.. ఇన్నర్ డిస్‌ప్లేలో మాత్రం ఎడమవైపున ఉంది. ఈ ఫోన్ ఆగస్టులో విడుదల కానుందని తెలుస్తోంది. స్సెసిఫికేషన్లు, డిజైన్‌పై వన్‌ప్లస్ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ ఫోన్ ప్రీమియంగా రానుందని తెలుస్తోంది.
ఫోల్డింగ్ ఫోన్ల మార్కెట్‌లో సత్తా చాటేందుకు ప్రముఖ సంస్థలన్నీ పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగా శాంసంగ్ జులై నెల చివరలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో తన గెలాక్సీ Z ఫోల్డ్ మరియు Z ఫ్లిప్ 5 ఫోన్లను విడుదల చేయనుందని తెలుస్తోంది. పిక్సల్ ఫోల్డ్ కూడా త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలలైన ఫోల్డింగ్ ఫోన్ సహా త్వరలో లాంచ్ కానున్న ఫోన్లు మార్కెట్‌లో ట్రెండ్ సృష్టించే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications