OnePlus వాచ్‌ లో సరికొత్త SpO2 సెన్సార్‌!! ఈ ఫీచర్ ఎందుకో తెలుసా?

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అనేకం ఇటీవల ఫిట్‌నెస్ ట్రాకర్ విభాగంలోకి అడుగుపెట్టాయి. ఇవి అత్యంత ఆశాజనక ఫీచర్లను కలిగిన స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేయడంతో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును పొందాయి. వన్‌ప్లస్ బ్రాండ్ సంస్థ కూడా గత ఏడాది ఈ విభాగంలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఈ సంస్థ దాని ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడంతో పాటు దాని వన్‌ప్లస్ వాచ్‌ను కూడా విడుదల చేసింది.

వన్‌ప్లస్ వాచ్‌
 

వన్‌ప్లస్ వాచ్‌ హెల్త్ ట్రాకర్ రియల్ టైమ్ హార్ట్ బీట్ సెన్సార్, SpO2, స్లీప్ మానిటర్ వంటి మరెన్నో ఫీచర్లతో కూడి ఉంటుంది. హార్ట్ బీట్ సెన్సార్లు మరియు నిద్ర పర్యవేక్షణ సెన్సార్లు మనలో చాలా మందికి ఇప్పటికీ అర్థమయ్యేవి. అయితే SpO2 సెన్సార్ అంటే ఏమిటి మరియు ఇది ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? ఈ సెన్సార్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

SpO2 అంటే ఏమిటి?

SpO2 అంటే ఏమిటి?

SpO2 గురించి సరళంగా చెప్పాలంటే మీ యొక్క రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కొలవడానికి SpO2 సెన్సార్‌కు సామర్థ్యం ఉంది. మానవ శరీరానికి మనుగడ సాగించడానికి ఆక్సిజన్ ఎంతగానో అవసరం. అంటే అధిక SpO2 స్థాయిలు మనకు మంచివి. ఎవరికైనా తక్కువ స్థాయి SpO2 ఉంటే కనుక వారికి హైపోక్సేమియా లక్షణాలు ఉన్నట్లు. నివేదికల ప్రకారం 95% -99% అనేది SpO2 యొక్క సాధారణ స్థాయి.

వన్‌ప్లస్ వాచ్ SpO2 స్థాయిలను ఎలా కొలుస్తుంది?

వన్‌ప్లస్ వాచ్ SpO2 స్థాయిలను ఎలా కొలుస్తుంది?

వన్‌ప్లస్ వాచ్ లో ఫిట్‌నెస్ ట్రాకర్లు హార్ట్ బీట్ మానిటర్ వంటివి ఎలా పనిచేస్తుందో అదే విధంగా SpO2 స్థాయిలను కొలవగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇందుకోసం ఈ వాచ్ అత్యంత సున్నితమైన ఫోటోడెటెక్టర్‌ను ఉపయోగిస్తుంది. ఇది వినియోగదారుడి రక్తనాళాలలో గల హిమోగ్లోబిన్‌ యొక్క స్థాయిని చూడడానికి వీలుగా ఉంటుంది. వన్‌ప్లస్ వాచ్ వంటి స్మార్ట్‌వాచ్‌లు SpO2 స్థాయిలను కొలవడానికి రిఫ్లెక్టయిన్స్ పల్స్ ఆక్సిమెట్రీ పద్ధతిని ఉపయోగిస్తాయి.

మరింత సరళంగా చెప్పాలంటే ఈ పద్ధతిలో డివైస్ వినియోగదారుడి యొక్క శరీర ఉపరితలంపై పరారుణ మరియు ఎరుపు కాంతిని మరియు సబ్కటానియస్ కణజాలం నుండి సెన్సార్‌కు ప్రతిబింబించే కాంతిని ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ కాంతి విడుదల మరియు ప్రతిబింబం మధ్య రక్తంలోని ఆక్సిజన్ స్థాయి నిర్ణయించబడుతుంది. అయితే ఇది ఒక నిర్దిష్ట స్థాయికి ఖచ్చితమైనదని గమనించండి. తయారీదారులు తమ పరికరాలను వైద్య నిర్ధారణ కోసం ఉపయోగించరాదని పేర్కొన్నారు.

వినియోగదారులకు SpO2 స్థాయిలు ఎందుకు ముఖ్యమైనవి?
 

వినియోగదారులకు SpO2 స్థాయిలు ఎందుకు ముఖ్యమైనవి?

వినియోగదారులందరికీ అధిక SpO2 స్థాయిలు ముఖ్యమైనవి. అథ్లెట్లు మరియు ఆరోగ్య పరిస్థితులతో ఉన్న రెండు రకాల వినియోగదారులకు ముఖ్యమైనది. అథ్లెట్లు ఎల్లప్పుడూ SpO2 స్థాయిలపై నిఘా ఉంచుతారు ఎందుకంటే శిక్షణ సమయంలో వారి శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం మరియు ఆక్సిజన్ డిమాండ్ వారి శిక్షణా సెషన్లను ప్రభావితం చేస్తుంది. శిక్షణ తీసుకునే వ్యక్తులు వారి SpO2 స్థాయిలను పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అధిక లేదా తక్కువ ఎత్తులో ఖచ్చితమైన మొత్తంలో ఆక్సిజన్‌ను తీసుకోవడం వారికి కష్టం. సముద్ర మట్టంలో ఆక్సిజన్ స్థాయిలు 21% ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే మీరు 3000 మీటర్ల పరిమితిని దాటినప్పుడు అవి 15% వరకు పడిపోతాయి.

స్లీప్ అప్నియా వంటి వైద్య పరిస్థితులు ఉన్నవారికి SpO2 మానిటర్ మరింత సహాయంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ప్రజలు రాత్రి సమయంలో క్రమరహిత వ్యవధిలో మేల్కొనే పరిస్థితి ఇది. ఈ లక్షణంతో స్మార్ట్‌వాచ్ నిద్రలో కదలికను పర్యవేక్షించగలదు మరియు ఇది సమస్య గురించి వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది మరియు అవసరమైన చర్య తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
OnePlus Watch Comes With ‘SpO2’ New Smart Feature: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X