ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!

By Maheswara
|

ఒక వారంలో వన్ ప్లస్ సంస్థ వన్ ప్లస్ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.ఇలాంటి సమయం లో, కంపెనీ దాని ప్రస్తుత వినియోగదారులకు సంబంధించి ఇతర సమస్యలను పరిష్కరించవలసి ఉంది. కానీ,ఇలాంటి సమయంలో తమ వన్ ప్లస్ 9 మరియు 9 Pro వినియోగ దారులకు నిరాశను కలిగించే వార్తను అందించింది. ఈ సమాచారం ప్రకారం వన్ ప్లస్ 9 మరియు 9 ప్రో ఫోన్లలో బ్రికింగ్ సంఘటనల సమస్యల కారణంగా ఆండ్రాయిడ్ 13 ఆక్సిజన్ OS అప్‌డేట్ ను విడుదల చేయకుండా ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సమస్యలు పరిష్కారం అయ్యే అంతవరకూ ఆండ్రాయిడ్ 13 ఆక్సిజన్ OS అప్‌డేట్ ను వాయిదావేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

 
OnePlus Withdraws New Oxygen OS 13 Updates For OnePlus 9 Series Devices.

కొత్త అప్డేట్ ను ఇన్‌స్టాల్ చేయవద్దు

 

వన్ ప్లస్ కంపెనీ తన కమ్యూనిటీ ఫోరమ్‌లో కొత్త అప్డేట్ ను ఇన్‌స్టాల్ చేయవద్దు అని హెచ్చరికలు కూడా జారీ చేసింది, అయితే ఇప్పటికే అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసి,వన్ ప్లస్ 9/9 ప్రో ఫోన్‌తో సమస్యలు ఎదుర్కొంటున్న చాలా మందికి ఈ హెచ్చరిక కొంచెం ఆలస్యంగా వచ్చింది. కాబట్టి, సమస్య కారణంగా ప్రభావితమైన యూనిట్‌ల సంఖ్యను తగ్గించిన వినియోగదారులతో ఈ సమాచారాన్ని పంచుకోవడంలో OnePlus ఎందుకు ఆలస్యం చేసిందని మీరు తప్పకుండా ఆలోచిస్తూ ఉండాలి. అయితే, చైనీస్ న్యూ ఇయర్ కారణంగా తన టీమ్‌ సెలవుల కారణంగా ఇలా జరిగిందని తెలుస్తోంది. ఇది వింతగా అనిపించినప్పటికీ , కారణం గురించి నిజాయితీగా ఉన్నందుకు అభినందించాలి.

OnePlus Withdraws New Oxygen OS 13 Updates For OnePlus 9 Series Devices.

వన్ ప్లస్ 9/9 ప్రో ఫోన్ల వినియోగదారులు జాగ్రత్త

వన్ ప్లస్ 9/9 ప్రో ఫోన్‌తో "వినియోగదారుల యొక్క అప్డేట్ కు ప్రారంభ రోల్‌అవుట్ సమయంలో, బూట్ కాని అప్డేట్ సమస్యను కొందరు ఎదుర్కొన్నట్లు మేము గమనించాము. ఎక్కువ మంది వినియోగదారులు ప్రభావితం కాకుండా ఉండటానికి, మేము వెంటనే రోల్‌అవుట్‌ను ఆపివేసి, సమస్యను పరిశోధించడం ప్రారంభించాము, "అని వన్‌ప్లస్ అధికారికంగా తన పోస్ట్‌లో హైలైట్ చేసింది. ఈ సమస్యలు ద్వారా ప్రభావితమైన వెర్షన్ వన్ ప్లస్ 9 లో ఫర్మ్‌వేర్ LE2111_11.F.19 మరియు వన్ ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్నవారికి LE2121_11.F.19తో, ఆక్సిజన్OS 13 F.19. F.19 వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత రీస్టార్ట్ అవుతు సమస్యలు ఎదుర్కొంటున్న ఈ ఫోన్లలో సమస్యలు పరిష్కరించడానికి ఇది కొత్త అప్‌డేట్ వెర్షన్ F.20ని కూడా జారీ చేసింది.

OnePlus Withdraws New Oxygen OS 13 Updates For OnePlus 9 Series Devices.

ఈ సమస్య గురించి కంపెనీ తన పొరపాటును గుర్తించి మరియు సమస్యతో బాధపడే ఏ యూజర్ అయినా సర్వీస్ సెంటర్‌ను సంప్రదించడానికి లేదా వన్ ప్లస్ మెయిల్ ఆర్డర్ రిపేర్ సర్వీస్‌ని ఉపయోగించుకోవాలని కోరుకుంటోంది. సమస్య లు ఎదుర్కొంటున్న వారి వన్ ప్లస్ పరికరాలు మునుపటి సెట్టింగ్‌లకు రీసెట్ చేయబడతాయని మరియు వారు ఫోన్‌లో నిల్వ చేసిన ఏ డేటాను కోల్పోరని హామీ ఇచ్చారు.

వన్‌ప్లస్ 11 లాంచ్ ఈవెంట్

ఈ కొత్త F.19 అప్‌డేట్‌లో జనవరి 2023 సెక్యూరిటీ ప్యాచ్, సిస్టమ్ యాప్‌లలో స్టెబిలిటీ మెరుగుదలలు మరియు క్విక్ గ్లాన్స్, ఆటోమేటిక్ బ్రైట్‌నెస్ మరియు సెల్యులార్ కనెక్టివిటీ లో సమస్యలకు పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఈ సాఫ్ట్‌వేర్ సమస్యలు కొంతమంది వన్‌ప్లస్ 9 మరియు 9 ప్రో యజమానులకు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, కంపెనీ ఫిబ్రవరి 7న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ 11 లాంచ్ కోసం సన్నద్ధమవుతోంది. ఈ ఈవెంట్లో వన్ ప్లస్ 11R తో సహా అనేక కొత్త పరికరాలను కూడా లాంచ్ చేస్తుంది అని అంచనాలున్నాయి. వీటిలో, వన్‌ప్లస్ ప్యాడ్ టాబ్లెట్, కీక్రోన్‌తో కూడిన మెకానికల్ కీబోర్డ్ మరియు బడ్స్ ప్రో 2 పరికరాలు ఉన్నాయి.

Best Mobiles in India

Read more about:
English summary
OnePlus Withdraws New Oxygen OS 13 Updates For OnePlus 9 Series Devices.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X