రూ.1,000 తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలుకు OnePlus Y-సిరీస్ టీవీలు
వన్‌ప్లస్ బ్రాండ్ ఇండియాలో ప్రవేశించినప్పటి నుంచి తన యొక్క అన్ని రకాల ప్రొడెక్టులను వినియోగదాదారులకు అమెజాన్‌తో అందిస్తున్నది. వన్‌ప్లస్ సంస్థ ఇండియాలోకి అమెజాన్ సహాయంతో ప్రవేశించినప్పటికి తన యొక్క విధేయత కారణంగా ప్రస్తుతం అమెజాన్‌ను మించి మంచి లాభాలను అర్జిస్తున్నది. వన్‌ప్లస్ సంస్థ ఇప్పుడు ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కూడా తమ యొక్క అన్ని రకాల ఉత్పత్తులను అందిస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్ లో మొదటిసారి వన్‌ప్లస్ Y-సిరీస్ టివిల విక్రయాలు
వన్‌ప్లస్ సంస్థ కొత్తగా విడుదల చేసిన టీవీలలో Y-సిరీస్ లను కొనుగోలుచేయడానికి వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ముందుకు రానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో వీటి అమ్మకాలు మొదలుకానున్నాయి. అమెజాన్ మరియు దాని స్వంత వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ లో వన్‌ప్లస్ టీవీలు అందుబాటులో ఉండటం దేశంలో ఇదే మొదటిసారి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫ్లిప్‌కార్ట్ లో వన్‌ప్లస్ ప్రొడెక్టులు
వన్‌ప్లస్ సంస్థ ఇప్పుడు తన భాగస్వామి సంబంధాలను అమెజాన్ వెలుపల కూడా నిర్మించాలని స్పష్టంగా చూస్తోంది. ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ ఈ-కామెర్స్ సంస్థ అనేది ఆన్ లైన్ డెలివరీలలో ముఖ్యపాత్ర పోషిస్తున్నది. ప్రస్తుతానికి వన్‌ప్లస్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కేవలం రెండు మోడళ్లను కలిగి ఉన్న Y-సిరీస్ టివిలను మాత్రమే విక్రయించనుంది. అక్టోబర్ 12 నుండి 32-అంగుళాల HD మరియు 43-అంగుళాల పూర్తి HD Y సిరీస్ టీవీలను కొనుగోలు చేయడానికి వినియోగదారులకు గొప్ప అవకాశాన్ని అందిస్తున్నది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే అమ్మకంలో వన్‌ప్లస్ Y-సిరీస్ టివిల మీద తగ్గింపు ఆఫర్లు
ఇండియాలో అక్టోబర్-16 నుండి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే అమ్మకంలో భాగంగా వన్‌ప్లస్ Y-సిరీస్ టివిల యొక్క రెండు టీవీ మోడల్ల మీద కొనుగోలుదారులకు రూ .1000 తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం 32 అంగుళాల, 43 అంగుళాల టీవీల ధరలు వరుసగా రూ.14,999, రూ.24,999 గా ఉన్నాయి. కానీ అమ్మకపు రోజుల్లో రెండు టీవీల మీద రూ.1000 తగ్గింపు లభించిన తరువాత మీరు వాటిని 13,999 రూపాయలు మరియు 23,999 రూపాయల ధర వద్ద పొందవచ్చు. వీటితో పాటుగా మీకు ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను వివిధ రకాల బ్యాంకులతో అందిస్తున్నాయి.

వన్‌ప్లస్ Y-సిరీస్ టీవీల స్పెసిఫికేషన్స్
వన్‌ప్లస్ Y-సిరీస్ టీవీలు మార్కెట్లో ఆధునికంగా మరియు తాజాగా కనిపించే బెజెల్-లెస్ డిస్ప్లేను కలిగి ఉంటాయి. ఈ Y సిరీస్ టీవీలు ప్రస్తుతం 32-అంగుళాల మరియు 43-అంగుళాల రెండు పరిమాణాలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ రెండు వేరియంట్లు 93 శాతం డిసిఐ-పిఆర్ కలర్ నిర్మాణంను కలిగి ఉండి వస్తాయి. ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఆక్సిజన్‌ఓఎస్ వెర్షన్‌లో టీవీ రన్ అవుతుంది. అందువల్ల మీరు వాయిస్ నియంత్రణ కోసం గూగుల్ అసిస్టెంట్, యాప్ ల కోసం గూగుల్ ప్లే మరియు Chromecast కు డిఫాల్ట్ యాక్సిస్ ను పొందుతారు. ఇది డాల్బీ ఆడియో టెక్నాలజీతో 20W స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది మరియు వన్‌ప్లస్ కనెక్ట్ మరియు మరిన్ని వంటి అంతర్గత లక్షణాలను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








