Just In
Don't Miss
- Movies
నిర్మాతగా మెగా డాటర్ ఎంట్రీ.. వాటితో మొదలు పెడుతుందంట!
- News
JD Lakshminarayana: జనసేనకు మరో షాక్ తప్పదా? బీజేపీ వైపు మాజీ జేడీ?: టచ్ లో ఉన్న సుజనా?
- Finance
కుదిరిన తొలిదశ వాణిజ్య ఒప్పందం, ఆ టారిఫ్ కొనసాగుతుంది... ట్రంప్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు
- Sports
లార్డ్స్‌లో కొత్త హోదాలో గంగూలీ: ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసిన అధికారిక ట్విట్టర్ వీడియో
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
వన్‌ప్లస్ 7 సిరిస్ వచ్చేస్తోంది, అదరగొట్టేలా కొత్త ఫీచర్లు !
చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్ ప్లస్ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చే సమయం వచ్చేసింది. టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ 7 సీరిస్ ఫోన్లు మార్కెట్లో కనువిందు చేయనున్నాయి. ఫాస్ట్ అండ్ స్మూత్ ట్యాగ్‌తో ఈ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. కాగా ఇందుకు సంబంధించి రోజుకో వార్త ఇంటర్నెట్‌లో చక్కెర్లు కొడుతోంది. ఆ వార్తలను బ్రేక్ చేస్తూ సీఈవో పీట్ లౌ వన్‌ప్లస్ 7 టీజర్‌ను విడుదల చేశారు.
వన్‌ప్లస్ నుంచి వస్తున్న కొత్త ప్రొడక్టును అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఫాస్ట్ అండ్ స్మూత్ పదాలకు కొత్త నిర్వచనం చెబుతుందని, ఇది చాలా అందంగా ఉంటుంది అని ఆయన ట్వీట్ చేశారు. ఫైనల్ గా వన్ ప్లస్ 7 ఫోన్ల లాంచింగ్ ను కంపెనీ బెంగుళూరులో మే 14న జరిగే ఈవెంట్లో లాంచ్ చేయనుంది. పూర్తి వివరాల్లోకెళితే..

లీకయిన ఫీచర్లు
వన్‌ప్లస్ 7 సిరీస్ ఫోన్లలో 6.7 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6/8/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, 48, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, వార్ప్ చార్జ్ తదితర ఫీచర్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇక ఈ ఫోన్లకు చెందిన పూర్తి స్థాయి స్పెసిఫికేషన్ల వివరాలు త్వరలో తెలుస్తాయి.

మూడు ఫోన్లు
వన్‌ప్లస్ 7 సిరీస్‌లో మూడు ఫోన్లు మార్కెట్‌లోకి రావొచ్చనే అంచనాలున్నాయి. సీఈఓ విడుదల చేసిన టీజర్ అంచనాలకు బలాన్ని చేకూర్చుతోంది. వీటి పేర్లు వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో, వన్‌ప్లస్ 7 ప్రో 5జీ అయ్యి ఉండొచ్చని సమాచారం.

ఓచర్లు
ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నవారికి కంపెనీ ఓచర్లను అందిస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ ఓచర్లు కంపెనీ అధికారిక వెబ్ సైట్ oneplus.inలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఈవెంట్ కి హాజరు కాలేని వారు లైవ్ స్ట్రీమ్ ద్వారా కూడా ఈవెంట్ విశేషాలను తెలుసుకోవచ్చు.

అన్ని దేశాల్లో ఒకేసారి
యూకే, యూఎస్ఏలతోపాటు ఇండియాలోనూ అదే తేదీన వన్‌ప్లస్ 7 సిరీస్ ఫోన్లు విడుదల కానున్నాయి.ఈ ఫోన్లను ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎక్స్ క్లూజివ్ గా విక్రయించనుంది. ఇప్పటికీ ఈ ఫోన్ల మీద భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి.

వన్‌ప్లస్ 6కి సక్సెసర్
వన్‌ప్లస్ నుంచి రానున్న వన్‌ప్లస్ 7 స్మార్ట్ ఫోన్ గతంలో వచ్చిన వన్‌ప్లస్ 6, వన్‌ప్లస్ 6 టిలకు సక్సెసర్ గా వచ్చినట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ 7 ప్రొ ప్రీమియం సెగ్మెంట్లో శాంసంగ్ ఆపిల్ ఫోన్లకు గట్టి పోటీనివ్వనుంది.

5జీ సపోర్ట్
ఈ ఫోన్ 5జీ సపోర్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Qualcomm's latest 5G modem, the Qualcomm X55ని ఇందులో పొందుపరిచారు. అలాగే గేమింగ్ విషయంలో ఈ ఫోన్ అద్భుతమైన పనితీరును కూడా కనపరచనుంది. గతంలో వచ్చిన Razer Phone 2 and Asus' ROG Phoneలను మించి గేమింగ్ అనుభూతిని అందివ్వనుందని తెలుస్తోంది.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790