OneWeb శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు త్వరలో ప్రారంభంకానున్నాయి...

|

వన్‌వెబ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ (శాట్‌కామ్) కంపెనీ ప్రధానంగా ఇండియా మరియు UK ప్రభుత్వానికి చెందినది. ఈ సంస్థ త్వరలో భారతదేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించనుంది. రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం కారణంగా ఆలస్యంగా కంపెనీ తన సేవలను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నది. ముందుగా 2022 మే నెలలో భారతదేశంలో వాణిజ్యపరంగా ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలని OneWeb సంస్థ ప్లాన్ చేసింది. కానీ ఇప్పటికి కూడా లాంచ్ జరగనందున సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అన్నదానిపై ఎటువంటి నిర్ణీత కాలపరిమితి లేదు కానీ త్వరలోనే లాంచ్ కానున్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

OneWeb శాటిలైట్ లాంచర్ల ఉపయోగం

OneWeb శాటిలైట్ లాంచర్ల ఉపయోగం

వన్‌వెబ్ ప్రతినిధి ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ "వారు వీలైనంత త్వరగా ఇండియాలో తమ యొక్క సేవలను ప్రారంభించడానికి భారతీయ శాటిలైట్ లాంచర్‌లను ఉపయోగించబోతున్నట్లు సూచించారు." ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) యొక్క వాణిజ్య విభాగం అయిన న్యూస్పేస్ ఇండియాతో భాగస్వామ్యంను కుదుర్చుకున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.

శాటిలైట్

ప్రపంచవ్యాప్తంగా 648 శాటిలైట్ గ్లోబల్ కాన్స్టెలేషన్‌ను రూపొందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 428కి పైగా శాటిలైట్ లు అంతరిక్షంలోకి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా OneWeb తన యొక్క సేవలను వేగంగా విస్తరించడానికి తన యొక్క ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని 'స్టార్‌లింక్' కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దీనికి ప్రధాన పోటీదారుగా ఉంది. ఇప్పటికే భారతదేశంలో కంపెనీ NLD (నేషనల్ లాంగ్ డిస్టెన్స్)) అలాగే GMPCS (గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ బై శాటిలైట్ సర్వీసెస్)ను పొందగలిగింది. OneWeb భారతదేశంలో ప్రారంభించేందుకు అవసరమైన ఇతర అనుమతులను పొందాలని భావిస్తోంది.

వాణిజ్య శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్
 

ప్రణాళికాబద్ధంగా కంపెనీ యోచించిన విధంగా అనుకున్న విషయాలు ముందుకు సాగితే OneWeb భారతదేశంలో ప్రారంభమయ్యే మొదటి ఆధునిక వాణిజ్య శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ అవుతుంది. స్టార్‌లింక్ కంపెనీ ఇప్పటివరకు భారత ప్రభుత్వం నుండి అవసరమైన ఆమోదాలను పొందలేకపోయింది. వాస్తవానికి కొత్త కనెక్షన్‌ల కోసం రీఫండ్‌లు తీసుకోవడం మానేయాలని మరియు ఇప్పటికే తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇవ్వమని స్టార్‌లింక్ కంపెనీని భారత అధికారులు కోరారు.

స్టార్‌లింక్

వాణిజ్య లైసెన్స్ మరియు ఆమోదం లేకుండా స్టార్‌లింక్ భారతదేశంలో ప్రీ-బుకింగ్‌లను కూడా విక్రయించదు అని అధికారులు తెలిపారు. ఇది స్టార్‌లింక్‌కు కలిగిన అతి పెద్ద ఎదురుదెబ్బ అని కూడా చెప్పవచ్చు. దీని ఇండియా హెడ్ సంజయ్ భార్గవ కూడా కంపెనీ నుంచి వైదొలిగారు. ప్రస్తుతానికి భారతీయ మార్కెట్ కోసం స్టార్‌లింక్‌కి సంబంధించిన తాజా పరిణామాలు ఏవీ లేవు. స్టార్‌లింక్ ఏప్రిల్ 2022 నాటికి భారతదేశంలో వాణిజ్య సేవలను ప్రారంభించాలని భావించింది కానీ కంపెనీ యొక్క సేవలు ఇప్పటికి అందుబాటులోకి రాలేదు.

Best Mobiles in India

English summary
OneWeb Company Plan to Launch Satellite Broadband Services in India Very Soon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X