Online మోసాలకు బ్రేక్ వేయడానికి పాటించవలసిన టిప్స్...

|

ఇండియాలో ప్రస్తుతం కరోనావైరస్ యొక్క వ్యాప్తి అధికం అవడంతో వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావాలని ప్రభుత్వం సూచిస్తున్నది. అలాగే ఏదైనా ఖచ్చితమైన అవసరాలకు తప్ప బయటికి రావడం కోసం అనుమతిని ఇస్తున్నది.

కరోనావైరస్ సంక్షోభం

కరోనావైరస్ సంక్షోభం

అన్ని రకాల సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుండి పనిని చేయడం కోసం ఆదేశాలను కూడా ఇచ్చింది. ప్రస్తుతం ప్రజలు తమ యొక్క అన్ని రకాల అవసరాల కోసం ఆన్‌లైన్‌లో ప్రతిదానిపై ఆధారపడటం కూడా పెరిగింది. నేరస్థులు ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సంక్షోభాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా సైబర్ నేరగాళ్లు చాలా రకాల కంపెనీలు, బ్యాంకులు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు మరియు మరెన్నో వాటిపై హ్యాకింగ్ చేసి దాడులను చేసారు.

 

Also Read: Redmi Note 9 Launch: సరసమైన ధరలో రెడ్‌మి కొత్త ఫోన్ లాంచ్!!! ఫీచర్స్ బ్రహ్మాండం...Also Read: Redmi Note 9 Launch: సరసమైన ధరలో రెడ్‌మి కొత్త ఫోన్ లాంచ్!!! ఫీచర్స్ బ్రహ్మాండం...

ఆన్‌లైన్ సైబర్ దాడులు

ఆన్‌లైన్ సైబర్ దాడులు

ప్రస్తుతం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం అత్యవసరం అయితే భద్రతను నిర్ధారించడం కూడా చాలా కీలకం. దీని కోసం ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండటానికి భారత ప్రభుత్వం ఇటీవల వినియోగదారులు చేయవలసిన మరియు చేయకూడని పనుల యొక్క జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆన్‌లైన్‌లో చేయకూడని పనులు

ఆన్‌లైన్‌లో చేయకూడని పనులు

** ఆన్‌లైన్‌లో వినియోగదారులు వారి వయస్సు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయకూడదు. ఇది ఇండెంట్ దొంగతనానికి దారితీస్తుంది.

** పేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో లాగిన్ అయిన తర్వాత మీ అకౌంటును గమనించకుండా వదిలేయడం మరియు ఉపయోగించిన తరువాత లాగ్ అవుట్ చేయకపోవడం వంటివి చేయకూడదు.

** పబ్లిక్ కంప్యూటర్లలో USB లు లేదా హార్డ్ డ్రైవ్‌లు వంటి వ్యక్తిగత పరికరాలను ఉపయోగించడం వంటివి చేయకూడదు.

** సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఏవైనా లింక్‌లు మరియు అటాచ్మెంట్ లను ఓపెన్ చేయడం మరియు సాఫ్ట్‌వేర్‌ను ఫిల్టర్ చేయడం ద్వారా .bat, .cmd, .exe, .pif వంటి ఫైల్ ఎక్స్‌టెన్షన్‌ను బ్లాక్ చేయండి.

** మీ పాస్‌వర్డ్‌ను ఎవరికైనా బహిర్గతం చేయడం వంటివి చేయకూడదు.

** విశ్వసనీయ సమాచారం ఏదైనా ధృవీకరించకుండా ఫార్వార్డ్ చేయకూడదు.

** ఏదైనా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌లను సృష్టించడం వంటివి చేయవద్దు.

** మీ స్నేహితుల సమాచారాన్ని నెట్‌వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేయడం వంటివి చేయకూడదు. అది వారిని ప్రమాదంలోకి నెట్టివేసే ప్రమాదం ఉంది.

 

ఆన్‌లైన్‌లో చేయవలసిన పనులు

ఆన్‌లైన్‌లో చేయవలసిన పనులు

** బలమైన పాస్‌వర్డ్‌ను సృష్టించడం మరియు దాన్ని తరచుగా మార్చడం.

** సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో గోప్యతా సెట్టింగ్‌లను జాగ్రత్తగా చదవండి.

** డిజిటల్ ఫుట్ ప్రింట్స్ చెరిపివేయడం కష్టం కాబట్టి ఏదైనా సమాచారాన్ని పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

** మీ యొక్క పర్సనల్ కంప్యూటర్ సిస్టమ్‌ను మీకు చాలా సన్నిహితంగా ఉన్న సిబ్బంది మాత్రమే యాక్సెస్ చేయడానికి అనుమతిని ఇవ్వండి.

** మీ యొక్క అకౌంట్ హ్యాక్ చేయబడినా లేదా దొంగిలించబడినా నెట్‌వర్కింగ్ సైట్ యొక్క బృందానికి వెంటనే నివేదించండి.

** ధృవీకరించబడిన ఓపెన్ సోర్స్ లేదా లైసెన్స్ పొందిన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే ఉపయోగించండి.

** ఆటోమేటిక్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ అప్ డేట్ లను మీ కంప్యూటర్‌లో సెటప్ చేయండి.

 

 

Best Mobiles in India

English summary
Online Banking: Do's and Don'ts Guide in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X