ఆన్‌లైన్ లెర్నింగ్ యాప్‌లతో జాగ్రత్త!! మీ పిల్లల డేటాను సేకరిస్తున్నాయి

|

2020లో వచ్చిన COVID-19 కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని కూడా భయాందోళనలకు గురిచేసింది. ప్రతి ఒక్కరు కూడా ఇంటికి పరిమితం కావడంతో ఆన్‌లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ల మీద అధిక శ్రద్ధను పెంచింది. అప్పటి నుండి విద్యార్థులు తమ ఇళ్లలోనే ఉంటూ ఎంతో సౌలభ్యంతో నేర్చుకోవడం కోసం ఆన్‌లైన్ లెర్నింగ్ యాప్‌లు తమ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ మార్కెట్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వాలు కోవిడ్ అత్యవసర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆఫ్‌లైన్ తరగతులకు బదులు నేర్చుకోవడం కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు వెళ్లమని విద్యార్థులను ప్రోత్సహించాయి. అయితే హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) నుండి వచ్చిన నివేదిక ప్రకారం అనేక ఆన్‌లైన్ లెర్నింగ్ యాప్‌లు మరియు ప్రోగ్రామ్‌లు పిల్లల డేటాను వారి అనుమతి లేకుండా సేకరించినట్లు కనుగొనబడింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆన్‌లైన్ లెర్నింగ్ యాప్‌లతో పిల్లలకు ముప్పు

ఆన్‌లైన్ లెర్నింగ్ యాప్‌లతో పిల్లలకు ముప్పు

HRW 49 వేర్వేరు దేశాలలో 150 కంటే ఎక్కువ EdTech ఉత్పత్తులను పరిశీలించింది. ఈ పరిశీలనలో భాగంగా 89% EdTech ఉత్పత్తులు పిల్లల డేటాను రహస్యంగా వారి లేదా తల్లిదండ్రుల అనుమతి లేకుండా పర్యవేక్షిస్తున్నట్లు గుర్తించింది. అంతేకాకుండా 164లో 146 ఎడ్‌టెక్ ఉత్పత్తులు యువతను పర్యవేక్షించడానికి ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు కూడా కనుగొనబడింది.

ఆన్‌లైన్ లెర్నింగ్

ఆన్‌లైన్ లెర్నింగ్ యాప్‌లలో చేరిన విద్యార్థుల యొక్క డేటా స్టోర్ చేయబడిన తరువాత మూడవ పార్టీ కంపెనీలకు విక్రయించబడుతున్నాయి. పైన పేర్కొన్న 146 EdTech యాప్‌లు యువత యొక్క డేటాను నేరుగా 196 థర్డ్-పార్టీ కంపెనీలకు పంపుతున్నాయని HRW వెల్లడించింది. ఇది అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీలకు పంపబడుతోంది అని సమాచారం. "COVID-19 కారణంతో పాఠశాల మూసివేత సమయంలో ఆన్‌లైన్ లెర్నింగ్ యాప్‌ల విస్తృత స్వీకరణను ఆమోదించే ప్రక్రియలో ప్రభుత్వాలు ఆన్‌లైన్ విద్యను అందించడానికి ఖర్చులను పిల్లలకు అందించాయి. వారు తెలియకుండానే వారి యొక్క పెర్సనల్ మరియు గోప్యత వివరాలను అందివ్వవలసి వచ్చింది" అని HRW నివేదిక పేర్కొంది.

యాప్‌లు

జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్‌లు మరియు సిస్కో వెబెక్స్ వంటి యాప్‌లు పిల్లల యొక్క విద్యా ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు రూపొందించబడలేదు. ఈ యాప్‌లు వాస్తవానికి ప్రైవేట్ సంస్థలు తమ యొక్క ఉద్యోగులతో సమావేశాలను నిర్వహించడానికి రూపొందించబడ్డాయి. అయితే అప్పట్లో ఈ యాప్‌లను పిల్లలు ఆన్‌లైన్ లెర్నింగ్ ప్రయోజనాల కోసం ఉపయోగించేవారు. HRW నేరుగా డేటాను సేకరించడానికి ఈ యాప్‌లను స్పష్టంగా పేర్కొననప్పటికీ ST మ్యాథ్ వంటి అభ్యాస యాప్‌లు ప్రకటనల కోసం గూగుల్ మరియు మెటాకి పిల్లల డేటాను పంపే ట్రాకర్‌లను తరచుగా ఉపయోగిస్తాయని ఇది వెల్లడిస్తుంది.

Best Mobiles in India

English summary
Online Learning Apps Collect Students Personal Data and Sold to Meta and Google

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X