Home
News

Digital Payments చేస్తున్నారా !!! ఈ చిట్కాలు పాటించండి...

గత కొన్ని నెలలుగా పేటిఎమ్, గూగుల్ పే మరియు ఇతర ఇ-వాలెట్ యాప్ లకు సంబంధించిన సైబర్ క్రైమ్ కేసులు గణనీయంగా పెరిగాయి. వాస్తవానికి KYC మోసం గురించి Paytm తన వినియోగదారులను హెచ్చరించింది. Paytm అకౌంటును బ్లాక్ చేయడం లేదా KYC చేయమని సూచించడం వంటి సమాచారంతో పంపిన SMS ని దయచేసి నమ్మవద్దు వీరు ఖచ్చితంగా మోసగాళ్ళు అని Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.

UPI

గూగుల్ కూడా UPI యొక్క పిన్‌ను రహస్యంగా ఉంచాలని వినియోగదారులకు సూచించింది. తమ ఫోన్ లలో కొన్ని విశ్వసనీయ యాప్ లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని కూడా సూచించింది. అలాగే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లతో సన్నిహితంగా ఉండటానికి గూగుల్ పే యాప్ ను మాత్రమే ఉపయోగించాలని వినియోగదారులను కోరుతూ ఒక సలహా కూడా జారీ చేసింది.

 

 

డిల్లీ పోలీసులు

డిల్లీ పోలీసులు

ఇప్పుడు డిల్లీ పోలీసులు కూడా ఈ యాప్‌ల గురించి వినియోగదారుల కోసం కొన్ని ముఖ్యమైన సలహాలను ఇచ్చారు. మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లోని ఒక పోస్ట్‌లో పేటీఎం, గూగుల్ పే వంటి ఇతరుల ఇ-వాలెట్ యాప్ ల వినియోగదారులు 'చేయకూడని' జాబితాను డిల్లీ పోలీసులు షేర్ చేసారు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

పేమెంట్స్

** పేమెంట్స్ యాప్ ఫోన్ కాల్ ద్వారా KYC ని ధృవీకరించదు. కావున మీకు ఇటువంటి ఫోన్ కాల్స్ / SMS లు వస్తే కనుక అవి మిమ్మల్ని మోసం చేయాలని వచ్చినవి అని గ్రహించండి.

** మీ యొక్క ఫోన్ లో SMS లేదా ఇమెయిల్ ద్వారా పంపిన ఎటువంటి లింక్‌ మీద క్లిక్ చేయవద్దు.

** 'కస్టమర్ సర్వీస్' ఎగ్జిక్యూటివ్ సలహా మేరకు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎటువంటి యాప్ ను ఇన్‌స్టాల్ చేయకూడదు.

 

 

KYC

** ఫోన్ కాల్ ఆధారంగా ఎప్పుడు రూ.1 లావాదేవీని కూడా చేయకూడదు.

** KYCని పొందడానికి SMS లో ఇచ్చిన నంబర్‌కు ఎటువంటి పరిస్థితులలోను కాల్ చేయకూడదు.

** మీ యొక్క బ్యాంకుకు సంబందించిన ఎటువంటి ఆర్థిక వివరాలను ఫోన్‌లలో స్టోర్ చేసుకోకపోవడం చాలా మంచిది.

 

 

పిన్‌

** మీ ఏటీఎం కార్డు పిన్‌ను ఎలా రహస్యంగా మెయింటైన్ చేస్తారో యూపీఐ పిన్‌ కూడా అలాగే సీక్రెట్‌గా ఉంచాలి. అంతేకాదు మీ UPI అకౌంట్ ఉన్న యాప్‌లో తప్ప మరొక యాప్‌లో మీ UPI పిన్‌ను ఎంటర్ చేయకపోవడం చాలా మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం మీరు డబ్బులు పంపడానికి మరియు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి మాత్రమే UPI పిన్ ను ఉపయోగించవలసి ఉంటుంది.


** మీరు డబ్బులు స్వీకరించేందుకు UPI పిన్ అవసరం ఉండదు. ఎవరైనా మీకు డబ్బులు పంపుతున్నామని మీ యాప్‌లో వెంటనే UPI పిన్ ఎంటర్ చేయండి అని అడిగితే అస్సలు ఎంటర్ చేయకండి. అటువంటి ఫోన్ కాల్ లేదా SMS ను పూర్తిగా మరచిపోవడం చాలా మంచిది.

 

 

గూగుల్ పే

** ప్లే స్టోర్‌లో గూగుల్ పే, ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్ పేని పోలినట్లు ఉండే చాలా యాప్స్ ఉంటాయి కావున వాటిని డౌన్‌లోడ్ చేసేముందు ఒకటికి పది సార్లు చెక్ చేసుకోండి. పొరపాటున నకిలీ యాప్ డౌన్‌లోడ్ చేస్తే కనుక చాలా మోసపోతారు. అందుకే యాప్ డౌన్‌లోడ్ చేసేముందు డెవలపర్ పేరు చెక్ చేయాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా యాప్ డౌన్‌లోడ్ చేయకండి.

** మీ పేమెంట్ యాప్‌లో ఏవైనా సమస్యలు ఉంటే కేవలం యాప్ ద్వారానే కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి. లేదా అధికారిక వెబ్‌సైట్‌లోనే కస్టమర్ కేర్ నెంబర్లు, ఇమెయిల్ ఐడీలను వాడాలి. అంతే తప్ప గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్ల కోసం సెర్చ్ చేయకూడదు.

 

More from GizBot

Best Mobiles in India

English summary
Online Payment App Users Follow These Safety Tips For Avoid Cyber crimes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X