త్వరలో ఇండియన్ మార్కెట్లోకి న్యూఎగ్ ఆన్‌లైన్ రిటైలర్

Posted By:

కంప్యూటెక్స్ 2014 టెక్ షోలో భాగంగా ప్రముఖ రిటైలర్ న్యూఎగ్ (Newegg) తమ భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించింది. త్వరలో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని 6 దేశాలకు విస్తరించునున్నట్లు సదరు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విక్రయ రిటైలర్ తెలిపింది. ఇండియా, ఐర్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పోలాండ్ ఇంకా సింగపూర్ దేశాల్లో న్యూఎగ్ తమ వ్యాపారాలను ప్రారంభించనుంది. ఇప్పటికే యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లో న్యూఎగ్ తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

 త్వరలో ఇండియన్ మార్కెట్లోకి న్యూఎగ్ ఆన్‌లైన్ రిటైలర్

ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరగటంతో పాటు, మరిన్ని ఆన్‌లైన్ నగదు చెల్లింపు స్కీమ్‌లు అందుబాటులోకి రావటంతో భారత్ ఇ-కామర్స్ వ్యాపారం 2013లో మరింతగా పుంజుకుందని ఇటీవల ఓ విశ్లేషణలో వెల్లడైంది.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో పాటు ఆయా ఉత్పత్తులకు సంబంధించిన ఉపకరణాలు, జ్యూయలరీ, గృహోపకరణాలు, జీవనశైలి ఉపకరణాలైన వాచ్‌లు, పుస్తకాలు, సౌందర్య ఉత్పత్తులు, పరిమళ ద్రవ్యాలు, చిన్నారుల ఉత్పత్తులు వంటి అమ్మకాలు 2013 భారత్ ఈ-కామర్స్ వ్యాపారం ఎదుగుదలకు తోడ్పడ్డాయని రావత్ అన్నారు. ఇండియన్ ఈ-కామర్స్ మార్కెట్ 2013కు సంబంధించి అసోచామ్ నిర్వహించిన సర్వేలో భాగంగా ఈ ఏడాదికిగాను ఆన్‌లైన్ మార్కెట్ వృద్ధి 88శాతంగా నమోదైనట్లు వెల్లడైంది. అసోచామ్ సర్వే ప్రకారం 2009లో ఇండియన్ ఈ-కామర్స్ మార్కెట్ విలువ యూఎస్‌డి 2.5 బిలియన్‌ల వద్ద ఉంది., 2012 నాటికి ఈ విలువ యూఎస్‌డి 8.5 బిలియన్‌లుగా నమోదైంది. 2013 నాటికి ఈ విలువ మరింతగా పుంజుకుని 88శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ పరిణామంతో 2013 భారత్ ఈ-కామర్స్ మార్కెట్ విలువ యూఎస్‌డి 16 బిలియన్‌లకు చేరకుంది. 2023 నాటికి ఇండియన్ ఆన్‌లైన్ రిటైలింగ్ వ్యాపారం విలువ యూఎస్‌డి 56 బిలియన్‌లకు విస్తరించే అవకాశం ఉందని అసోచామ్ సర్వే అంచానా వేస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot