ఆన్‌లైన్‌లో పండగ షాపింగ్ చేస్తున్నారా? అయితే, వారి టార్గెట్ మీరే కావొచ్చు..

|

పండుగల సీజన్‌లలో ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ప్రొవైడ్ చేసే డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్ ఇంకా ఇతర ఈఎమ్ఐ ఆఫర్స్ కోసం చాలా మంది ఆన్‌లైన్ షాపర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సరిగ్గా అటువంటి ఆఫర్ల సమయమే మళ్లి వచ్చేసింది. దసరా ఇంకా దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లైన అమెజాన్ ఇంకా ఫ్లిప్‌కార్ట్‌లు ఆసక్తికర డిస్కౌంట్లను సిద్థం చేస్తున్నాయి.

ఆన్‌లైన్ షాపర్స్‌కు మరో ముప్పు..
 

ఆన్‌లైన్ షాపర్స్‌కు మరో ముప్పు..

సాధారణంగా ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్స్ సమయంలో ఆన్‌లైన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువుగా జరుగుతుంటాయి. ఇదే సమయంలో హ్యాకింగ్ దాడులు కూడా జరుగుతుంటాయి. ఆన్‌లైన్ షాపర్స్‌ను మాయ చేసి వారి పేమెంట్ వివరాలను దొంగిలించే క్రమంలో హ్యాకర్లు రకరకాల ఎత్తుగడలతో ముందుకు వస్తున్నారు. తాజాగా వారు అనసరిస్తోన్న వ్యూహాల్లో 'formjacking' ఒకటి.

Norton హెచ్చరికలు..

Norton హెచ్చరికలు..

ప్రముఖ సెబర్ సెక్యూరిటీ కంపెనీ నార్టాన్ (Norton) వెల్లడించిన వివరాల ప్రకారం ఈ దీపావళి పండుగ రద్దీని పురస్కరించుకుని హ్యాకర్లు ఆన్‌లైన్ షాపర్సే 'formjacking' దాడులకు పాల్పడబోతున్నారు. ఈ ప్రమాదకర హ్యాకింగ్ దాడి నుంచి ఏ విధంగా బయటపడవచ్చు అనే దాని పై నార్టాన్ సెక్యూరిటీ రిసెర్చర్లు కీలక సూచనలు చేసారు. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

హ్యాకర్స్ సర్వర్‌లోకి మన క్రెడిట్ కార్డ్ వివరాలు..

హ్యాకర్స్ సర్వర్‌లోకి మన క్రెడిట్ కార్డ్ వివరాలు..

Formjackingలో భాగంగా హ్యాకర్లు ఓ ప్రమాదకర జావా స్ర్కిప్ట్‌ను ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లకు సంబంధించిన చెక్‌ అవుట్ వెబ్ పేజీలలో లోడ్ చేసేస్తారు. దీంతో ఈ పేజీలలో ఎంటర్ అయ్యే పేమెంట్ డిటెయల్స్‌ హ్యాకర్లకు సంబంధించిన సర్వర్స్‌లోకి వెళ్లిపోతాయి. ఈ హ్యాకింగ్ ఉచ్చులో బ్రిటీష్ ఎయిర్‌వేస్, టికెట్‌మాస్టర్ వంటి ప్రముఖ వెబ్‌సైట్‌లు చిక్కుకున్నాయి. పర్యావశానంగా 3.8 లక్షలు యూజర్లకు సంబంధించిన క్రెడిడ్ కార్డ్ వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి.

పాస్‌వర్డ్స్‌ను మరింత పటిష్టం చేసుకోవాలి...
 

పాస్‌వర్డ్స్‌ను మరింత పటిష్టం చేసుకోవాలి...

Formjacking దాడుల నుంచి మీమీ ఆన్‌లైన్ అకౌంట్లను కాపాడుకునే క్రమంలో శక్తివంతమైన ఇంకా విభిన్నమైన పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకోవల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే పాస్‌వర్డ్‌లో అప్పర్‌కేస్, లోవర్‌కేస్ సింబల్స్ ఇంకా నెంబర్స్ ఉండేలా చూసుకోవాలి. ఒకే రకామైన పాస్‌వర్డ్‌ను మల్టిపుల్ అకౌంట్‌లకు ఉపయోగించకండి.

అనుమానాస్పద అటాచ్‌మెంట్స్ పై క్లిక్ చేయకండి...

అనుమానాస్పద అటాచ్‌మెంట్స్ పై క్లిక్ చేయకండి...

మీకు పరిచయం లేని వ్యక్తల నుంచి వచ్చే మెసేజెస్ లేదా అటాచ్‌మెంట్స్‌ను ఓపెన్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసకోవాలి. ఇదే సమయంలో ర్యాండమ్ లింక్స్ పై క్లిక్ చేయవద్దు. సైబర్ నేరగాళ్లు మీ మిత్రులకు చెందిన ఈ-మెయిల్ లేదా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా మాలీషియ్స్ లింక్స్‌ను పంపించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వెబ్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవటం మంచిది.

వైర్‌లెస్ కనెక్షన్స్‌తో జాగ్రత్త..

వైర్‌లెస్ కనెక్షన్స్‌తో జాగ్రత్త..

కొత్త నెట్‌వర్క్ కనెక్టెడ్ డివైస్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నపుడు డీఫాల్డ్ పాస్‌వర్డ్‌ను కొత్త పాస్‌వర్డ్‌తో అప్‌డేట్ చేసుకోవాలి. ఇదే సమయంలో మీ వైర్‌లెస్ కనెక్షన్‌లకు శక్తివంతమైన పాస్‌వర్డ్‌లతో ప్రొటెక్ట్ చేసుకోవటం మంచిదని రిసెర్చర్స్ హెచ్చరిస్తున్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Online shoppers, beware of this big credit/debit card fraud around Diwali season.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X