పడిపోయిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

పెద్ద నోట్ల రద్దు కారణంగా ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు నవంబర్‌లో 18 శాతానికి పడిపోయినట్లు కౌంటర్ పాయింట్ రిసెర్చ్ వెల్లడించింది. నోట్ల రద్దు ఎపెక్ట్‌తో క్యాష్ కొనుగోళ్లు బాగా తగ్గాయని, ఇదేసమయంలో క్యాష్‌లెస్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతోన్నట్లు ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్‌లు చెబుతున్నాయి.

Read More : ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే చాలు, డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ ఇదే పరిస్థతి..

ఆన్‌లైన్ మార్కెట్లో ఈ విధంగామైన పరిస్థతి కొనసాగుతుండగా, ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ అమ్మకాలు జోరు అంతగా కనిపించటం లేదు. సామ్‌సంగ్, ఎల్‌జీ వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఆఫ్‌లైన్ మార్కెట్లో తమ అమ్మకాలను మెరుగుపరుచుకునేందుకు buy-now-pay-later, జీరో ఇంట్రస్ట్ కాస్ట్ వంటి స్కీమ్‌లను ఇప్పటికే అనౌన్స్ చేసాయి.

100 శాతానికి పెరిగిన క్యాష్‌లెస్ డీల్స్

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇంకా ఫోన్స్ విభాగంలో క్యాష్‌లెస్ లావాదేవీలు నవంబర్‌కు గాను 100 శాతానికి పెరిగాయని ఫ్లిప్‌కార్ట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే క్యాష్ అన్ డెలివరీ ఆర్డర్స్ 20:80 నుంచి 40:60కి మారాయని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఇదే సమయంలో స్నా‌ప్‌‌డీల్‌లోనూ క్యాష్‌లెస్ డీల్స్ పెరుగుతున్నాయట.

ఐడీసీ సర్వే ప్రకారం

నోట్ల రద్దు తరువాత ప్రముఖ రిసెర్చ్ సంస్థ ఐడీసీ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు 50 శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మొబైల్ ఫోన్ మార్కెట్ మరింత పతనమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ జాతియ అధ్యక్షుడు పంకజ్ మోహింద్రో తెలిపారు.

రద్దైన పెద్ద నోట్లతో

రద్దైన పెద్ద నోట్ల ద్వారా ఆఫ్‌లైన్ మార్కెట్లో మొబైల్ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు అనుమతించాలంటూ ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Online smartphone sales dip 18% in November on note ban.Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting