సర్వే రిపోర్ట్.. 82 శాతం మందికి జియో సెకండరీ సిమ్ మాత్రమే!

దేశవ్యాప్తంగా జియో 4జీ నెట్‌వర్క్ వినియోగానికి సంబంధించి పలు ఆసక్తికర వివరాలను మార్కెట్ రిసెర్చ్ ఏజెన్సీ Velocity MR వెల్లడించింది. ఈ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపుగా 82శాతం మంది రిలయన్స్ జియో యూజర్లు ఈ సిమ్‌లను ఇప్పటికీ సెకండరీ నెట్‌వర్క్‌గానే భావిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కేవలం 18శాతం యూజర్లు మాత్రమే...

కేవలం 18శాతం యూజర్లు మాత్రమే జియో నెట్‌వర్క్‌ను ప్రైమరీ కనెక్షన్‌గా భావిస్తున్నారు. కాల్ డ్రాపింగ్ సమస్యలలు వేధిస్తున్నప్పటికి జియో అందిస్తోన్న ఆఫర్స్‌ను దృష్టిలో ఉంచుకుని 86శాతం మంది యూజర్లు రిలయన్స్ జియోతో కంటిన్యూ అయ్యేందుకే మెగ్గుచూపుతున్నట్లు స్టడీ తెలిపింది.

అతితక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ..

దేశవ్యాప్తంగా బలమైన సబ్‌స్ర్కైబర్ బేస్‌ను కలిగి ఉన్న రిలయన్స్ జియో ప్రతి 10 మంది రెస్పాండెంట్లలో నలుగురిని ప్రభావితం చేయగలిగిందని స్టడీ వెల్లడించింది. జియో అతితక్కువ కాలంలోనే మార్కెట్‌ పాపులారిటీని సొంతం చేసుకున్నప్పటికి, ఆ పాపులారిటీ అనేది ఎంతకాలం స్థిరంగా కొనసాగుతోంది అనేది స్పష్టం కావల్సి ఉందని ఈ రిసెర్చ్ అభిప్రాయపడింది.

అత్యధిక శాతం మంది ప్రీపెయిడ్ ఖతాదారులే..

జియో నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటోన్న యూజర్లలో అత్యధిక శాతం మంది యూజర్లు ప్రీపెయిడ్ ఖతాదారులే. ఇదే సమయంలో వొడాఫోన్, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లకు భారీ సంఖ్యలో పోస్ట్-పెయిడ్ ఖతాదారులు ఉన్నారని, ప్రధానంగా ఈ విషయాన్ని పరిగణంలోకి తీసుకోవల్సి ఉందని స్టడీ అభిప్రాయపడింది.

మీ Jio నెంబర్ మెయిన్ బ్యాలన్స్ చెక్ చేసుకోవాలంటే..?

*333#కు డయల్ చేయటం ద్వారా మీ రిలయన్స్ జియో నెంబర్‌కు సంబంధించిన మెయిన్ బ్యాలన్స్ ఫోన్ డిస్‌ప్లే పై ప్రత్యక్షమవుతుంది. లేకుంటే MBAL అని టైప్ చేసి 55333 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయటం ద్వారా బ్యాలన్స్ వివరాలు మెసేజ్ రూపంలో మీకు అందుతాయి.

ప్రీపెయిడ్ బ్యాలన్స్ అలానే ప్యాక్ వ్యాలిడిటీ వివరాలు తెలుసుకోవాలంటే..?

BAL అని టైప్ చేసి 199 నెంబర్‌కు మీ జియో సిమ్ నుంచి ఎస్ఎంఎస్ పంపటం ద్వారా ప్రీపెయిడ్ బ్యాలన్స్ ఇంకా ప్యాక్ వ్యాలిడిటీ వివరాలు మీకు మెసేజ్ రూపంలో అందుతాయి.

పోస్ట్‌పెయిడ్ బిల్ తెలుసుకోవాలంటే..?

మీ Jio నెంబర్‌కు సంబంధించి పోస్ట్‌పెయిడ్ బిల్ అమౌంట్ తెలుసుకోవాలంటే BILL అని టైప్ చేసి 199 నెంబర్‌కు మీ జియో సిమ్ నుంచి ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ రూపంలో పోస్ట్‌పెయిడ్ బిల్ వివరాలు అందుతాయి.

టారిఫ్ ప్లాన్ వివరాలను తెలుసుకోవాలంటే..?

మీరు సబ్‌స్ర్కైబ్ చేసుకున్న టారిఫ్ ప్లాన్ వివరాలను తెలుసుకోవాలంటే MY PLAN అని టైప్ చేసి 199 నెంబర్‌కు మీ జియో సిమ్ నుంచి ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ రూపంలో ఆ వివరాలు మీకు అందుతాయి.

డేటా యూసేజ్‌ను చెక్ చేసుకోవాలంటే..?

రిలయన్స్ జియోలో 4జీ డేటాకు మాత్రమే డబ్బులను వసూలు చేయటం జరుగుతోంది. Jio డేటా యూసేజ్‌ను చెక్ చేసుకునేందుకు ఏ విధమైన USSD కోడ్ అందుబాటులో లేదు. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డేటా యూసేజ్ లిమిట్‌ను సెట్ చేసుకోవటం ద్వారా జియో డేటాను మీ ప్లాన్‌కు అనుగుణంగా వాడుకునే అవకాశం ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Only 18% users are using Jio SIM as primary connection. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot