Home
News

Open AI సంస్థ సీఈవో శ్యామ్‌ ఆల్ట్‌మాన్‌ తొలగింపు.. ChatGPT విడుదలలో కీలక పాత్ర..!

టెక్‌ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ChatGPTను లాంచ్‌ చేసిన ఓపెన్‌ ఏఐలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓపెన్‌ ఏఐ సీఈవో శ్యామ్‌ ఆల్ట్‌మాన్‌ను సంస్థ నుంచి తొలగించింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఆ సంస్థ ప్రకటన చేసింది. టెక్‌ ప్రపంచంలో ఈ వార్త సంచలనం రేకెత్తించింది.

తాత్కాలిక సీఈవోగా.: ఓపెన్‌ ఏఐ సంస్థ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. శ్యామ్ స్థానంలో ఓపెన్‌ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటీని తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తారని ప్రకటన చేసింది. దీంతోపాటు శ్యామ్‌ ఆల్ట్‌మాన్‌ తొలగింపుపైనా సంస్థ స్పందించింది. పూర్తిస్థాయి సీఈవోను త్వరలో నియమిస్తామని పేర్కొంది.

Open AI ceo sam altman fired as ceo

ఆల్ట్‌మాన్‌పై ఆరోపణలు: సీఈవోగా వ్యవహరించిన శ్యామ్‌ ఆల్ట్‌మాన్‌ అంతర్గత చర్చలో నిజాయతీగా లేరని, బోర్డుతో సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించింది. బోర్డు తీసుకొనే నిర్ణయాలకు అడ్డుపడుతున్నాడని, శ్యామ్ పనితీరుపై బోర్డుకు విశ్వాసం లేదని ప్రకటన చేసింది. దీంతోపాటు బోర్డు నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

ఓపెన్‌ ఏఐ సంస్థ ప్రకటనపై ఆల్ట్‌మాన్‌ స్పందించారు. ఓపెన్‌ ఏఐ సంస్థలో పనిచేయడాన్ని తాజా ఎంతో ఇష్టపడినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా తనకు ఉపయోగపడిందని చెప్పారు. ఎంతో మంది ప్రతిభావంతులతో పనిచేసినట్లు శ్యామ్ ఆల్టమన్ X ( ట్విట్టర్‌ ) వేదికగా స్పందించారు.

ఓపెన్‌ ఏఐ కీలక అధికారి రాజీనామా : ఓపెన్‌ ఏఐ సీఈవోగా వ్యవహరించిన శ్యామ్‌ ఆల్ట్‌మాన్‌ను తొలగించిన గంటల వ్యవధిలోనే ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు మరియు బోర్డు ఛైర్మన్‌ గ్రెగ్‌ బ్రోక్‌మన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ నుంచి వైదొలిగినట్లు ప్రకటించారు. ఆల్ట్‌మాన్‌ను తొలగించిన కారణంగానే తాను కూడా సంస్థ నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొ్న్నారు. ఈ మేరకు Xలో పోస్టు చేశారు.

అద్భుతాలను సృష్టించాం: గత 8 సంవత్సరాలుగా తాము ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని బ్రాక్‌మన్‌ వెల్లడించారు. అసాధ్యమనుకున్నవి చాలా వరకు సాధించి చూపించామని పేర్కొన్నారు. తాము అద్భుతాలను సృష్టించామని, వాటి పట్ల సంతోషంగా ఉన్నామని X వేదికగా బ్రాక్‌ మన్‌ పోస్ట్‌ చేశారు.

గత సంవత్సరం మైక్రోసాఫ్ట్‌ ఆధారిత ఓపెన్‌ ఏఐ సంస్థ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చాట్ జీపీటీని విడుదల చేసింది. టెక్‌ ప్రపంచంలో ఇదో కీలక మైలురాయిగా నిపుణులు అభిప్రాయపడతారు. అయితే ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారణంగా ఎన్ని ప్రయోజనాలున్నాయో. అంతే కంటే ఎక్కువ అప్రయోజనాలు ఉన్నాయి దీని కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఓపెన్‌ ఏఐ తీసుకొచ్చిన చాట్‌జీపీటీకి పోటీగా టెగ్‌ దిగ్గజం గూగుల్‌ బార్డ్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది తొలి భాగంలో విడుదల కాగా.. మార్చిలో గూగుల్‌ బార్డ్‌ను లాంచ్‌ చేసింది. మే నెల బార్డ్‌ AI అందరికీ అందుబాటులోకి వచ్చింది. చాట్‌జీపీటీ ఇటీవల వచ్చిన అప్‌డేట్‌తో తాజా సమాచారం కూడా ఇవ్వగలదు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Open AI ceo fired and co founder brockman quits from firm
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X