సూపర్ ఫీచర్లతో ఓపెన్ ఏఐ GPT-4o ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ విడుదల.. ఉచితంగా వినియోగించుకోవచ్చు..!!
చాట్‌జీపీటీని విడుదల చేసిన ఓపెన్ AI సంస్థ తాజాగా LLM GPT- 4 అప్ డేట్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. GPT-4o ను విడుదల చేసింది. ఇందులో o అంటే ఓమ్నీగా (Open AI GPT-4o) పేర్కొంది. త్వరలో ఇది అందరికి ఉచితంగా అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
ఓపెన్ ఏఐ GPT- 4o లో వాయిస్, టెక్ట్స్, విజన్ వంటి ఫీచర్లు ఉంటాయి. అయితే ఉచితంగా వినియోగించుకొనే వారికి లిమిటెడ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయని అదే ప్రీమియం యూజర్లు అన్ లిమిటెడ్ యాక్సెస్ ను పొందవచ్చని సంస్థ తెలిపింది. GPT-4 టర్బో కంటే రెండు రెట్లు వేగంగా పనిచేస్తుందని తెలిపింది.

ఈ GPT-4o సుమారు 50 భాషలను సపోర్టు చేస్తుందని ఓపెన్ ఏఐ వెల్లడించింది. ఈ జాబితాలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాళీ వంటి భారతీయ భాషలను సపోర్టు చేయనుంది. GPT-4o వాయిస్ కమాండ్లను కేవలం 232 మిల్లిసెకన్లలోనే సమాధానాలు ఇస్తుందని సంస్థ తెలిపింది.
తన కొత్త ఏఐ మోడల్ GPT -4o.. వేగవంతమైన, ఇంటెలిజెంట్ మరియు మల్టీ మోడల్‌గా లాంచ్ అయిందని ఓపెన్ ఏఐ శామ్ ఆల్టమన్ తెలిపారు. ప్రతి చాట్‌జీపీటీ యూజర్‌లు ఉచితంగా దీనిని వినియోగించుకోవచ్చని చెప్పారు. అయితే GPT-4 మాత్రం ప్రస్తుతానికి డబ్బులు చెల్లించిన వారు మాత్రమే వినియోగించుకొనేందుకు అందుబాటులో ఉందని చెప్పారు.

MacOS వినియోగదారుల కోసం డెస్క్‌టాప్ యాప్‌ను విడుదల చేయనున్నట్లు ఒపెన్ ఏఐ వెల్లడించింది. రానున్న రోజుల్లో విండోస్ యూజర్లకు కూడా విడుదల చేయనున్నట్లు తెలిపింది. కొత్త ఏఐ మోడల్ GPT- 4o ఫీచర్లు సహా స్పెసిఫికేషన్లపై ఓపెన్ ఏఐ సంస్థ తన బ్లాగ్‌లో పోస్ట్ చేసింది.
ఆడియో, విజన్ మరియు టెక్ట్స్ కోసం GPT-4o ఎండ్ టూ ఎండ్ తో కొత్త మోడల్‌కు శిక్షణ ఇచ్చింది. ఈ నెట్‌వర్క్ అన్ని అవుట్‌పుట్ మరియు ఇన్‌పుట్‌లను నిర్వహిస్తుంది. దీంతోపాటు ఈ కొత్త మోడల్‌కు సంబంధించి ఓపెన్ ఏఐ మోడల్ కొన్ని వీడియోలనూ కూడా పోస్ట్ చేసింది. ఇందులో దీని పనితీరు గురించి తెలుసుకోవచ్చు.
భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 10.30 గంటలకు గూగుల్ i/o డెవలపర్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఇందులో గూగుల్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ జెమిని కొత్త వెర్షన్‌ను విడుదల చేయనుందని తెలుస్తోంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 15 పైనా కీలక ప్రకటన సహా ఇతర సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








