Home
News

భారతీయుడిపై ChatGPT తయారుచేసిన సంస్థ సీఈవో ప్రశంసలు.. అతను లేకుంటే సాధ్యమయ్యేది కాదంటూ..!!

ఓపెన్‌ ఏఐ నుంచి ఇటీవల GPT-4o విడుదల అయింది. దీనిపై ఆ సంస్థ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ పూణేకి చెందిన వ్యక్తి ప్రఫుల్లా ధరివాల్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రఫుల్లా లేకుండా GPT-4o విడుదల సాధ్యం అయ్యేది కాదంటూ X లో పోస్టు చేశారు.

ఎవరీ ప్రఫుల్లా ధరివాల్‌...
మహారాష్ట్రలోని పూణేకి చెందిన ప్రఫుల్లా ధరివాల్‌... ఇప్పటికే తన విజయాల ద్వారా గుర్తింపు పొందారు. 2009 లో భారత ప్రభుత్వం నుంచి నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్ స్కాలర్‌షిప్‌ను పొందారు. అదే సంవత్సరం చైనాలో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఆస్ట్రానమీ ఒలింపియాడ్‌లో గోల్డ్‌ మెడల్‌ను సాధించారు.

OpenAI CEO sam altman praises pune man prafulla dhariwal

దీంతోపాటు 2012 సంవత్సరంలో ఇంటర్నేషనల్‌ మ్యాథమెటికల్‌ ఒలింపియాడ్‌ మరియు 2013 లో ఇంటర్నేషనల్‌ ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌లోనూ గోల్డ్‌ మెడల్స్‌ను సాధించారు. చదువులోనూ ప్రఫుల్లా ధరివాల్‌ భాగా రాణించారు. క్లాస్‌ XII పరీక్షల్లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌లో (PCM) 300 మార్కులకు గానీ 295 సాధించారు.

దీంతోపాటు మహారాష్ట్ర టెక్నికల్ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో 190 స్కోర్‌ సాధించారు. మరియు JEE - Mains లో 360 మార్కులకు గానీ 330 సాధించారు. దీంతోపాటు మసాచుసె‌ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్‌ సైన్స్‌ (మ్యాథమేటిక్స్‌) బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. 2017 లో 5.0/5.0 GPA తో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

అయితే 2016 మే నెలలో ఓపెన్‌ ఏఐలో రీసెర్ట్‌ ఇంటర్న్‌ గా ప్రయాణం ప్రారంభించారు. అనంతరం పరిశోధన శాస్త్రవేత్తగా ఎదిగారు. GPT-3, టెక్ట్స్‌ టూ ఇమేజ్‌ ప్లాట్‌ఫాం DALL- E 2, ఇన్నోవేటివ్‌ మ్యూజిక్‌ జనరేటర్‌ జూక్‌బాక్స్‌ రూపొందించడంలో క్రీయాశీలకంగా పనిచేశారు.

"చాలాకాలం పాటు ప్రఫుల్లా ధరివాల్‌ యొక్క దార్శనికత, ప్రతిభ, దృఢ సంకల్పం, దృఢ విశ్వాసం లేకుండా GPT-4o రూపొందేది కాదు. దీంతోపాటు ఇతరుల కృషితో ఇదో విప్లవంగా మారుతుందని భావిస్తున్నా.." అంటూ ఓపెన్‌ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్‌ తమ X పోస్టులో పేర్కొన్నారు.

**ఇటీవల చాట్‌జీపీటీని విడుదల చేసిన ఓపెన్‌ AI GPT-4o ను విడుదల చేసింది. ఇందులో o అంటే ఓమ్నీగా పేర్కొంది. త్వరలో ఇది అందరికి ఉచితంగా అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఓపెన్ ఏఐ GPT- 4o లో వాయిస్‌, టెక్ట్స్‌, విజన్‌ వంటి ఫీచర్లు ఉంటాయి. అయితే ఉచితంగా వినియోగించుకొనే వారికి లిమిటెడ్‌ ఫీచర్లు అందుబాటులో ఉంటాయని అదే ప్రీమియం యూజర్లు అన్‌లిమిటెడ్‌ యాక్సెస్‌ను పొందవచ్చని సంస్థ తెలిపింది.

GPT-4 టర్బో కంటే రెండు రెట్లు వేగంగా పనిచేస్తుందని తెలిపింది. ఈ GPT-4o సుమారు 50 భాషలను సపోర్టు చేస్తుందని ఓపెన్‌ ఏఐ వెల్లడించింది. ఈ జాబితాలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాళీ వంటి భారతీయ భాషలను సపోర్టు చేయనుంది. GPT-4a వాయిస్‌ కమాండ్లను కేవలం 232 మిల్లిసెకన్లలోనే సమాధానాలు ఇస్తుందని సంస్థ తెలిపింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
OpenAI CEO sam altman praises indian prafulla dhariwal regarding GPT 4o
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X