Home
News

అప్పట్లో ChatGPT.. ఇప్పుడు అట్లాస్‌ వెబ్‌ బ్రౌజర్‌.. ఎన్ని ఫీచర్లు, ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా?

ఒకప్పుడు ఏదైనా అంశంపై సందేహం వస్తే, తెలిసిన వారినో లేక ఉపాధ్యాయులనో అడిగి తెలుసుకొనే వారు. అయితే క్రమంగా ఈ పరిస్థితిలో చాలానే మార్పులు వచ్చాయి. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక.. ఏ చిన్న సందేహం వచ్చినా, గూగుల్‌ ను ఆశ్రయిస్తున్నారు. 4G, 5G నెట్‌వర్క్, తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక.. గుర్తించదగిన మార్పులు వచ్చాయి.

క్రమంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అందుబాటులోకి వచ్చాక.. ఈ పరిస్థితిలో మరిన్ని మార్పులు వచ్చాయి. ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థ చాట్‌జీపీటీని అందుబాటులోకి తీసుకొచ్చాక.. భారీ మార్పులనే తీసుకొచ్చింది. యూజర్లు ప్రశ్నలకు నేరుగా సమాధానాలు పొందడం సహా అనేక విధాలుగా ఉపయోగపడుతోంది.

OpenAI launched Atlas web browser  here are the best features

దీంతో ఓపెన్‌ ఏఐ సంస్థ ఒక్కసారిగా ట్రెండింగ్‌ లోకి వచ్చింది. ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ ట్రెండ్‌ను కొనసాగించేందుకు, టెక్ దిగ్గజాలుగా పేరు పొందిన అనేక సంస్థలకు గట్టి సవాల్ విసిరేందుకు ఓపెన్‌ఏఐ సంస్థ సిద్ధమయింది. దీంతోపాటు వ్యాపార విస్తరణ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

యూజర్లు భారీగానే ఉన్నా.. :
ప్రస్తుతం చాట్‌జీపీటీకి ఏకంగా 800 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. అయితే అందులో అధిక శాతం ఉచిత యూజర్లే కావడంతో.. ఆదాయాన్ని పెంచుకొనేందుకు వీలుగా మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా వెబ్‌ బ్రౌజర్‌ను తీసుకొచ్చింది. అట్లాస్‌ (Atlas) పేరుతో ఓపెన్‌ఏఐ సంస్థ వెబ్‌బ్రౌజర్‌ను ప్రారంభించింది.

ఎక్కడ అందుబాటులో ఉందంటే :
గూగుల్‌కు చెందిన క్రోమ్‌ సహా ఇతర సంస్థల బ్రౌజర్‌లతో పోటీపడనుంది. ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన అట్లాస్‌ వెబ్‌ బ్రౌజర్‌ (Atlas Web browser) ప్రస్తుతం macOS లోనే అందుబాటులో ఉంది. త్వరలో విండోస్, iOS, ఆండ్రాయిడ్‌ OS లకు అందుబాటులోకి రానుంది. బ్రౌజర్‌ అంటే ఏంటి, ఎలా ఉపయోగించాలనేదానిపై ప్రజలు తిరిగి ఆలోచించేలా అట్లాస్‌ వెబ్‌ బ్రౌజర్‌ను రూపొందించినట్లు ఓపెన్ఏఐ సీఈఓ సామ్‌ ఆల్టమన్‌ అన్నారు.

సాధారణంగా బ్రౌజర్‌లో ఉండే URL బార్‌ను ప్రస్తుతం AI చాట్‌ ఇంటర్‌ఫేస్‌తో భర్తీ చేయవచ్చని చెప్పారు. అట్లాస్‌ బ్రౌజర్‌లో ప్రత్యేకంగా మూడు ఫీచర్లు ఉన్నాయని, యూజర్లకు ఈ ఫీచర్లు చాలా బాగా ఉపయోగపడతాయన్నారు. చాట్‌జీపీటీతో ఏఐ లో సంచలనం సృష్టించిన ఓపెన్‌ఏఐ.. వెబ్‌ బ్రౌజర్‌ కేటగిరిలో కూడా దీటైన ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంది.

ప్రత్యేక ఫీచర్లు :
ఓపెన్‌ ఏఐ అట్లాస్‌ వెబ్‌బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసిన అనంతరం వెబ్‌పేజీ పక్కన సైడ్‌బార్‌ కనిపిస్తుంది. కంటెంట్‌ను అర్థం చేసుకోవడం సహా విశ్లేషించేందుకు ఉపయోగపడుతుంది. దీంతోపాటు బ్రౌజర్‌లోని కర్సర్‌ చాట్‌ ఫీచర్‌ కూడా సూపర్‌ ఫీచర్‌గా నిలిచే అవకాశం ఉంది.

ఈ ఫీచర్‌ ద్వారా ఇ-మెయిల్‌ లేదా ఇతర డాక్యుమెంట్స్‌లో పేరాలను హైలైట్‌ చేయడం మరియు కంటెంట్‌ను మెరుగుపరుచుకొనేందుకు అవకాశం కల్పిస్తుంది. దీంతోపాటు ఈ బ్రౌజర్‌ మీ బ్రౌజింగ్‌ హిస్టరీ ఆధారంగా, మీకు అవసరం అయిన సమాచారాన్ని అందిస్తుంది.

దీంతోపాటు ప్లస్‌, ప్రో, బిజినెస్‌ యూజర్ల కోసం ప్రివ్యూలో బ్రౌజర్‌ ఏజెంట్‌ మోడ్‌ అందుబాటులో ఉంది. రిజర్వేషన్లు చేయడం, వస్తువులను కొనుగోలు చేయడం, పరిశోధనలు నిర్వహించడం వంటి అనేక పనులను సులభంగా చేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OpenAI launched Atlas web browser, here are the best features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X